
పాములపర్తి వెంకట నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు. పీవీ నరసింహారావు అంటేనే అందరూ ఈజీగా గుర్తుపట్టేస్తారేమో. బహుభాషావేత్త, రచయిత. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తెచ్చి.. కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కించిన ఘనాపాటి. మొట్టమొదటి తెలుగు ప్రధాని. అందులోనూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన లీడర్. అందుకే.. ఇటీవల ఆయన శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలూ చేపట్టింది. ఇప్పుడు తాజాగా పీవీకి కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్
తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. నేటి సమావేశాల్లో ముఖ్యంగా ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి.. సీఎం కేసీఆర్ ప్రధానంగా పీవీకి భారతరత్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. కానీ.. పీవీకి దక్కాల్సిన గౌరవ దక్కలేదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆర్థిక మంత్రి చేసిన ఘతన పీవీదే’ అని గంటాపథంగా చెప్పారు.
Also Read: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పీవీ శతజయంతి ఉత్సవాల్లోనూ సీఎం కేసీఆర్ పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. ‘దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. అందుకే ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది’ అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Comments are closed.