Home Blog Page 59

హైదరాబాద్ మల్కాజ్ గిరి కాలనీ లో హీరో నితిన్.. ఇంత సింపుల్ గా ఉన్నాడేంటి..

Nithiin Malkajgiri Shooting
Nithiin Malkajgiri Shooting

Nithiin Malkajgiri Shooting: యూత్ లో ఆడియన్స్ లో మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్, ప్రస్తుతానికి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో , పూర్తి స్థాయిలో తన మార్కెట్ ని పోగొట్టుకునే రేంజ్ కి పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రం ‘తమ్ముడు’ కూడా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఈ చిత్ర నిర్మాత , తదుపరి నితిన్ తో చెయ్యాలని అనుకున్న ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ ని కూడా ఆపేయాల్సి వచ్చింది. ఇక నితిన్ కెరీర్ అయిపోయినట్టే, ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత కూడా ఇప్పుడు సిద్ధంగా లేరని అంతా అనుకున్నారు. సరిగ్గా అలాంటి సమయం లోనే వచ్చారు ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై , నితిన్ ని హీరో గా పెట్టి రీసెంట్ గానే ఆయన ఒక సినిమాని మొదలు పెట్టారు. ఈ చిత్రం ద్వారా నరి , సోము అనే ఇద్దరు డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం లోని ఒక కాలనీ లో జరుగుతోంది. ఈ కాలనీ లో హీరో నితిన్ చాలా సామాన్యుడి గెటప్ లో కనిపించడం గమనార్హం. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిగా కనిపించారట. స్థానికులకు కూడా ఆయన అభివాదం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూస్తుంటే నితిన్ కి చాలా కాలం తర్వాత బాయ్ టు నెక్స్ట్ డోర్ తరహా పాత్ర దొరికినట్టుగా అనిపిస్తోందని , కచ్చితంగా ఈ సినిమాతో ఆయన భారీ కం బ్యాక్ ఇస్తారని , ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజెన్స్ అంటున్నారు.

ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా ‘మిరాయ్’ ఫేమ్ రితిక నాయక్ ని ఎంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానం లోకి ఇప్పుడు వైష్ణవి చైతన్య ని ఎంచుకున్నారు. గతం లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ హీరో గా ‘రంగ్ దే ‘ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ , కరోనా ప్రభావం వల్ల లాంగ్ రన్ దక్కలేదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గ్రాసర్ గా నిల్చింది. కానీ ఈసారి గురి తప్పే ఛాన్స్ లేదని , పక్కా హిట్ కొడుతారని అంటున్నారు ఫ్యాన్స్, చూడాలి మరి , అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.

అండమాన్ లో.. కేంద్రం కీలక ప్రాజెక్టు.. ఇక్కడి నుంచే దేశానికి కరెంటు.. ఏం చేయబోతున్నారో తెలుసా..

Andaman Islands
Andaman Islands

Andaman Islands: అండమాన్.. బ్రిటిష్ కాలంలో ఇక్కడ అత్యంత కఠినమైన కారగారాలను నిర్మించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిని ఇందులో వేసి చంపేశారు. నేటి ఆధునిక కాలంలో అండమాన్ పేరు గుర్తుకు వస్తే మనకు వెంటనే సముద్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ దీవులు.. వివిధ రకాల తెగలు.. అవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అండమాన్ ప్రాంతం ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. ఇక్కడ విశాలమైన సముద్ర తీరం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

అండమాన్ కేవలం సముద్ర తీర ప్రాంతంగా.. దీవుల సముదాయంగానే ఉండదు.. ఇకపై ఈ ప్రాంతం దేశం మొత్తానికి సరిపడా కరెంట్ ను ఉత్పత్తి చేయబోతోంది. అలాగని ఇక్కడ విస్తారమైన బొగ్గు గనులు లేవు. జీవ నదులు అంతకంటే లేవు. ఇలాంటి చోట విద్యుత్ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది.. పైగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. అలాంటప్పుడు విద్యుత్ ఎలా తయారు చేస్తారు.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. దీనికి సమాధానమే ఈ కథనం.

ప్రస్తుత కాలంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. థర్మల్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడితే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పుడు మాత్రమే జల విద్యుత్ తయారీ సాధ్యమవుతుంది. గాలి బాగా వీచినప్పుడు మాత్రమే హైడల్ పవర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇక సోలార్ పవర్ అయితే.. వర్షాకాలంలో తగినంత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. పైగా దీనికి భూమి చాలా కావాలి.

ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. విద్యుత్ అవసరాలు తీర్చుకునే మార్గం మీద మన దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అండమాన్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతోంది. అండమాన్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక భాగం. ఇక్కడ కేంద్రం హాట్ స్పాట్లను గుర్తించింది. ఎనర్జీ కన్వర్టర్లు.. హైబ్రిడ్ కన్వర్టర్లు ఏర్పాటు చేస్తారు. సముద్రం మీద ఒక వేదిక నిర్మించి.. వాటిపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది.

ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారంటే

సముద్రంలో కావలసినంత శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలలు.. ఆటుపోట్లు.. ప్రబాహాల ద్వారా సహజ కదలికలు ఏర్పడతాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న నీటి ఉష్ణోగ్రత ల వ్యత్యాసాన్ని కరెంట్ మాదిరిగా మార్చవచ్చు. సముద్ర జలాల్లో ప్రతి ఏడాది 9.2 లక్షల టెరా వాట్ (ఒక్క టెరా వాట్ పది లక్షల మెగా వాట్లకు సమానం) గంటల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.

సముద్రంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి బ్లూ ఎనర్జీ మార్గాలు ఉపయోగపడతాయి. అనేక దేశాలు సముద్రంలో ఆటుపోట్లు.. ప్రవాహాలు.. కెరటాలు.. అలలు వంటి వాటితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే భారత్ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా.. సముద్ర జలల మీద సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా నదులు, సముద్ర జలాల మధ్య ఉన్న సాలినిటీ తేడాల ద్వారా కూడా కరెంటు తయారు చేసే మార్గాలను రూపొందిస్తుంది. భారత రూపొందించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో సంవత్సరానికి టెరా వాట్ అవర్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక మనదేశం ప్రతి ఏడాది 1600 టెరా వాట్ ల విద్యుత్ ను ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రకారం చూసుకుంటే దాదాపు 575 సంవత్సరాలపాటు కోతలు లేకుండా దేశం మొత్తానికి ఇక్కడి నుంచి విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ రూపొందించింది..

సముద్ర జలాల నుంచి విద్యుత్తు తయారు చేయడం మంచి పని అయినప్పటికీ.. దీనికోసం చేసే ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది . ఒక మెగావాట్ టైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ సోలార్ పవర్ కు మూడు నుంచి నాలుగు కోట్లు.. పవన విద్యుత్ కు నాలుగు నుంచి ఐదు కోట్లు సరిపోతాయి. వచ్చే రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సముద్ర జలాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది . భవిష్యత్తు కాలంలో కేవలం సముద్రాలు మాత్రమే మనుషుల కరెంటు అవసరాలు తీర్చుతాయని నిపుణులు అంటున్నారు.

'కల్కి' లో ఆ పాత్రని నేను రిజెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది - కీర్తి సురేష్

Keerthy Suresh
Keerthy Suresh

Keerthy Suresh: ‘వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్ తో , డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉన్నటువంటి అనుబంధం ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహానటి ‘ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది కాబట్టి. అంతే కాకుండా ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గానూ కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందుకే వీళ్ళతో ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభందం ఉంటుంది. అప్పటి నుండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ ని తన ప్రతీ సినిమాలో ఎదో ఒక విధంగా భాగం అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’.

ప్రభాస్ హీరో గా నటించిన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన అద్భుతాలు సాధారణమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కి ఒక బలమైన క్యారెక్టర్ ని వదులుకుంది అట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , ఈ విషయం లో మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో నన్ను నాగ్ ఎదో ఒక విధంగా భాగం చేస్తాడని నాకు ముందే తెలుసు. ముందుగా ఆయన నాకు ఒక పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్ర విన్నప్పుడు ఎందుకో నాకు అంత గొప్పగా అనిపించలేదు , వర్కౌట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశాను. ఇది జరిగిన మరుసటి రోజే నాగ్ అశ్విన్ నాకు ఫోన్ మరో పవర్ ఫుల్ పాత్ర ఉంది , కనీసం ఏదైనా చేస్తావా అని అడిగారు. అయితే ఈ పాత్ర కి షూటింగ్ సెట్స్ వరకు రావాల్సిన అవసరం లేదని , కేవలం గొంతు ఇస్తే చాలని అన్నారు’.

‘ముందుగా ఇది విని షాక్ కి గురయ్యాను. నేను షూటింగ్ కి రాకుండా , నా గొంతు తో పనేమీ ఉంటుందబ్బా అని అనుకున్నాను. కానీ కట్ చేసే బుజ్జి అనే వాయిస్ క్యారెక్టర్ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత నాకు గొప్ప పేరు కూడా తీసుకొచ్చింది. ముందుగా ఆఫర్ చేసిన పాత్ర ని నేను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ సంతోషంగానే ఉన్నాను. ఒకవేళ నేను ఆ పాత్రని రిజెక్ట్ చేయకపోయుంటే నాకు ఇంత పేరు తీసుకొచ్చింది బుజ్జి పాత్ర దొరికేది కాదు కదా’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో, వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది , రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

'లెనిన్' ట్రైలర్ లోని హైలైట్స్ ఇవే..ఒక్క సినిమాలో ఇన్ని ట్రాజడీలా..!

Lenin Box Office Collection
Lenin Box Office Collection

Lenin Movie Trailer: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్న హీరో అక్కినేని అఖిల్. సినీ ఇండస్ట్రీ లోకి భారీ హైప్ తో ఈయన ఎంట్రీ ఇచ్చారు. కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో ఇండస్ట్రీ లోకి రాబోతున్నారు అని ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు తలక్రిందులు అయ్యాయి. స్టార్ హీరో అవుతాడని అనుకుంటే, కనీసం మీడియం రేంజ్ హీరో మార్కెట్ ని కూడా సంపాదించలేకపోయారు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన ఆయన చివరి చిత్రం ‘ఏజెంట్’ కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఆయన ఈసారి ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే కసితో ‘లెనిన్’ అనే చిత్రం లో నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 10 న విడుదల కాబోతుంది.

ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం కోరుతూ జులై 10 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాన్నీ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అక్కినేని నాగార్జున మొదటి నుండి చెప్తూనే ఉన్నారు, ఈ సినిమాలో మీరంతా సరికొత్త అఖిల్ ని చూడబోతున్నారు , చాలా గట్టిగా కొట్టబోతున్నాము అని. ట్రైలర్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి , ఫ్యాన్స్ కి కూడా ఇదే అనుభూతి కలుగుతుందట. అంత గొప్పగా నటించారట అఖిల్. అయితే ఈ చిత్రం లోని కొన్ని అంశాలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని మేకర్స్ లో కాస్త టెన్షన్ ఉందట.

ఎందుకంటే ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ చనిపోతుంది , అదే విధంగా అఖిల్ కి కళ్ళు పోతాయి. సినిమాల్లో ఇలాంటి ట్రాజెడీ సినిమాలు ఉంటే పెద్దగా వర్కౌట్ అవ్వవు , పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతుంటాయి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం ‘లెనిన్’ మేకర్స్ కి కాస్త ధైర్యం ఇచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి ఒక కాలు పోతుంది. అంత పెద్ద సూపర్ స్టార్ కాళ్ళు పోతేనే అడిగిన వాళ్ళు లేరు , సినిమాకు వర్కౌట్ కూడా అయ్యింది. కాబట్టి లెనిన్ కూడా అదే తరహా లో సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ట్రైలర్ లో అఖిల్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్ లాగా అనిపిసాయట.

'బాహుబలి' కోసం ప్రభాస్ కష్టం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు.. సంచలనం రేపుతున్న మేకింగ్ వీడియో..

Prabhas
Prabhas

Prabhas: నేడు మన టాలీవుడ్ కి పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ వచ్చిందంటే అందుకు ముఖ్య కారణం ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనే కనుక బాహుబలి చిత్రాన్ని ఒప్పుకోకపోయుంటే , ఈరోజు మన టాలీవుడ్ కి బాలీవుడ్ లో డామినేషన్ చూపించేంత సత్తా ఉండేది కాదు. కేవలం ఒక్క టాలీవుడ్ కి మాత్రమే కాదు , సౌత్ ఇండియా మొత్తానికి పాన్ ఇండియన్ మార్కెట్ ఇచ్చింది ప్రభాస్ నే, అందులో ఎలాంటి సందేహం లేదు. అదేంటి ‘బాహుబలి’ ని తీసిన రాజమౌళి కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు. రాజమౌళి కి ప్రభాస్ లాంటి హీరో దొరికాడు కాబట్టే కదా బాహుబలి వచ్చింది, ఒకవేళ ప్రభాస్ లేకపోతే ‘బాహుబలి’ సాధ్యం అయ్యేదా ?, ఒక్కసారి అలోచించి చూడండి. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి మేకింగ్ గురించి ‘బాహుబలి – ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ వచ్చింది.

నాలుగు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ లో బాహుబలి మేకింగ్ వీడియోస్ ని పొందుపరుస్తూ , ఈ సినిమాకు సంబంధించిన తమ అనుభవాలను చెప్పుకొచ్చారు మూవీ టీం. ముఖ్యంగా ప్రభాస్, రానా, అనుష్క కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ లోని విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఒప్పుకునే ముందు ‘పోతే నా సినీ కెరీర్ పోతాది.. లేదంటే మన టాలీవుడ్ రూపు రేకలు మారిపోతాయి’ అనుకోని రంగం లోకి దిగాను అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. అంటే ఈ సినిమా కోసం ఆయన తన మూడేళ్ళ విలువైన సమయాన్ని, కెరీర్ ని పణంగా పెట్టి చేశాడు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. మేకింగ్ వీడియోస్ లో పాపం ఆయన కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు.

నాన్ స్టాప్ గా పని చేసి అలిసిపోయి రోడ్ల మీద పడుకున్న సందర్భాలను కూడా ఈ డాక్యుమెంటరీ లో చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఈ చిత్రం కోసం గొడ్డులాగా కష్టపడ్డారు. కేవలం ఆయన ఒక్కరే కాదు , రానా, అనుష్క వంటి వారు కూడా అదే రేంజ్ లో కష్టపడ్డారు. ఊరికే 2000 కోట్ల గ్రాస్ రాదు కదా, వాళ్ళ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం పదింతలు ఎక్కువ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టేటస్ తో కొనసాగుతున్నారు. రానా కి ఆరోగ్య సమస్యలు రీత్యా సినిమాలు అనుకున్న స్థాయిలో చేయడం లేదు కానీ , ఒకవేళ ఆయన కూడా ఈ సిరీస్ తర్వాత కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉండుంటే వేరేలా ఉండేదేమో. ఇకపోతే ప్రభాస్ కష్టానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ని క్రింది వీడియో లో అందిస్తున్నాము చూడండి.

మస్క్ తర్వాత మనోడే.. ఎవరితను.. ఎంత సంపాదించాడు..

Shankh Mitra
Shankh Mitra

Shankh Mitra: ఈ ప్రపంచంలో అపర కుబేరుడు గా పేరు తెచ్చుకున్నాడు ఎలాన్ మస్క్. టెస్లా నుంచి ఎక్స్ వరకు అనేక కంపెనీలను నిర్వహిస్తూ.. భూమి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు విభిన్నమైన వ్యాపారాలు చేస్తూ.. లక్షల కోట్లను సంపాదించాడు మస్క్. ఇప్పటికీ అతడు సాధారణ జీవితమే గడుపుతుంటాడు. ఆడంబరాల జోలికి వెళ్లడు. అట్టహాసమైన జీవితాన్ని ఆస్వాదించడు.

మస్క్ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్.. ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ.. అతడి స్థాయిలో మాత్రం సంపాదించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మస్క్ తర్వాత స్థానంలో ఒక భారతీయుడు కొనసాగుతున్నాడు. ప్రతి ఏడాది వేల కోట్లు సంపాదిస్తూ కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు.. అతడి నేపథ్యం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలో పేరుపొందిన హెల్త్ కేర్ రియల్ ఎస్టేట్ సంస్థగా వెల్టవర్ కు పేరుంది. ఈ కంపెనీకి సీఈవోగా భారత సంతతికి చెందిన శంక్ మిత్ర కొనసాగుతున్నారు. ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆ కంపెనీ లాభాలను మరింత పెంచారు. విస్తరణకు కూడా తోడ్పడ్డారు. ఫలితంగా అతడు ప్రతి ఏడాది వేల కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. మిత్ర సంపాదిస్తున్న సంపాదన పై ది వాల్ స్ట్రీట్ జనరల్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది.

మిత్రకు 2025లో దాదాపు 821 మిలియన్ డాలర్ల ప్యాకేజీ లభించింది. ఇది మన దేశ రూపాయల విలువలో 7, 744 కోట్లు. ఈ జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ప్యాకేజీ 158 బిలియన్ డాలర్లు.. మిత్రుకు లభించే ప్యాకేజీలో ఎక్కువ భాగం షేర్ల రూపంలోనే ఉంటుంది. అక్టోబర్లో ఇతడికి 789 మిలియన్ డాలర్ల షేర్లు లభించాయి. కంపెనీ స్టాక్ పనితీరు వల్ల.. షేర్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకుంది. అందువల్లే మిత్ర సంపాదన పెరిగింది. మిత్ర కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు..

మిత్ర మొదటి నుంచి కూడా హెల్త్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన పనితీరు వల్ల అమెరికాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందువల్లే వెల్టవర్ కంపెనీ ఈయనను సీఈఓ గా నియమించుకుంది. ఆయన పనితీరు అద్భుతంగా ఉండడంతో.. వేతనాన్ని పెంచింది. కొంతమేర షేర్ల రూపంలో కూడా ఇచ్చింది. ఆ షేర్ల విలువ పెరగడంతో మిత్ర వేతనం పెరిగింది. మస్క్ తర్వాత రెండవ అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోగా మిత్ర రికార్డు సృష్టించాడు అంటే మామూలు విషయం కాదు. కాకలు తీరిన విదేశీయుల వల్ల కానిది మిత్ర చేసి చూపించాడు.

వైభవ్ ను ఈరోజైనా ఆడిస్తారా.. గంభీర్ తన పైత్యం చూపిస్తాడా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: టీమిండియాతో పోల్చి చూస్తే ఐర్లాండ్ పెద్ద జట్టు కాదు. ఐర్లాండ్ జట్టుకు అంత సీన్ లేదు. కానీ, టి20 వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియాను ఐర్లాండ్ ఓడించింది. అది కూడా భారీ అంతరంతో. పెద్ద పెద్ద జట్లను ఓడించి.. టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా చేతులెత్తేయడం సగటు అభిమానికి మింగుడు పడలేదు. అంతేకాదు.. టీమిండియా కూర్పు విషయంలో కూడా మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. అందువల్లే టీమిండియా ఓడిపోవలసి వచ్చింది.

టీమిండియాలో అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే వాషింగ్టన్ సుందర్ వరకు పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. జట్టులో ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ అయ్యర్ దారుణంగా నిరాశపరిచాడు. దీనికి తోడు మిగతా ప్లేయర్లు కూడా సరిగా ఆడలేక పోవడంతో ఐర్లాండ్ ముందు టీమిండియా తలవంచు కోవాల్సి వచ్చింది. టీమిండియా ఓటమికి బౌలర్లలో ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ కారణమైతే.. బ్యాటింగ్ లో సంజు, సుందర్, అక్షర్, తిలక్, అయ్యర్ వంటి వారు ప్రధాన కారణం. ఇలా సమష్టి విఫల ప్రదర్శనతో టీమిండియా ఓటమిపాలైంది.

ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వాస్తవానికి టీమిండియా తరఫున వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అందరూ అనుకున్నారు. మేనేజ్మెంట్ కూడా అతని మీద ప్రత్యేకమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వదిలింది. ఐర్లాండ్ లో స్థిరపడిన భారతీయులు కూడా సూర్య వంశీ ఆట తీరు చూసేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లు భారీగా కొనుగోలు చేశారు. మేనేజ్మెంట్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ వల్లే సూర్య వంశీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్లో సూర్య వంశీకి జట్టులో చోటు కల్పించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. అతడికి చోటు కల్పించి.. తొలి ఓటమి నుంచి టీమిడియాకు ఉపశమనం కలిగించాలని అభిమానులు కోరుతున్నారు.

ఎందుకంటే ఇటీవల కాలంలో సూర్య వంశీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంక లో శ్రీలంక జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సూర్య వంశీ టీమ్ ఇండియన్ గెలిపించాడు. అతడి ఆట తీరు గుర్తించి రెండవ మ్యాచ్లో అవకాశం కల్పించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్య వంశీ కూడా జాతీయ జట్టు తరఫున ఆడాలని బలంగా కోరుకుంటున్నాడు. స్వదేశీ మైదానాల మీదనే కాకుండా.. విదేశీ మైదానాల మీద అదరగొట్టాలని భావిస్తున్నాడు. అతనికి గనక అవకాశం లభిస్తే ఊరుకోడు. పైగా తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోవడంతో.. అతడు కసి మీద ఉన్నాడు. తన కసి మొత్తాన్ని ఐర్లాండ్ బౌలర్ల మీద తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. మరి గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో చూడాల్సి ఉంది.

WhatsApp గ్రూప్లో యాడ్ చేయలేదని.. ఈ అక్క ఏం పని చేసిందో తెలుసా

WhatsApp Group
WhatsApp Group

WhatsApp Group: రోజురోజుకు సమాజం మారిపోతోంది. ఎంతలా అంటే.. కనీసం చిన్నచిన్న విషయాలను కూడా జనం తట్టుకోలేకపోతున్నారు. ఓర్చుకోలేకపోతున్నారు. సహనంతో ఉండలేకపోతున్నారు. పట్టలేని ఆగ్రహంతో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో మనుషులం అనే విషయాన్ని కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఘటనలు నేటి కాలంలో పెరిగిపోయాయి. అసలు అలాంటి వారిని చూస్తుంటే మీరు మనుషులేనా అనిపిస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు పెరిగిపోవడం మనుషుల్లో తగ్గిపోతున్న సహనానికి ప్రతీకగా నిలుస్తోంది.. మన సమాజంలో ఎవరైనా సరే ఏదైనా నేరం లేదా ఘర్షణ చోటు చేసుకుంటే పోలీసులను ఆశ్రయిస్తుంటారు. తమకు జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఫిర్యాదు తో పాటు పోలీసులకు తగిన ఆధారాలు సమర్పిస్తారు. తద్వారా తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం జరిగిన సంఘటన చాలా విచిత్రంగా ఉంది. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది.

హైదరాబాద్ నగరంలోని బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ లో అక్కడి బస్తీ వాసులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో స్థానిక సమస్యల గురించి చర్చిస్తుంటారు. ఈ గ్రూపులో రాజకీయపరమైన మెసేజ్లు వద్దని అడ్మిన్ ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఒక మహిళ అదేపనిగా రాజకీయ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమెను హెచ్చరించారు అడ్మిన్. అయినప్పటికీ ఆమె అదే తీరుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. అడ్మిన్ తట్టుకోలేక ఆమెను గ్రూప్ నుంచి తొలగించారు. అనేక పర్యాయాలు ఆ మహిళ తనను చేర్చుకోవాలని సూచించినప్పటికీ అడ్మిన్ పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వాట్సప్ గ్రూపులో యాడ్ చేసుకోవడం లేదంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

ఆ మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముందుగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకొని నవ్వుకున్నారు.. నేటి కాలంలో ఇలాంటివారు కూడా ఉంటారా అంటూ చర్చించుకున్నారు. చివరికి ఆ మహిళ చెప్పిన విషయాలు నమోదు చేసుకొని.. ఆ తర్వాత ఇరు వర్గాలను పిలిపించారు. కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే ఆ మహిళను ఆ గ్రూపులో యాడ్ చేసుకున్నారా.. లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

ఈ జర్నలిస్టు నిజంగా సుద్దపూసనే.. వందల కోట్ల వెనుకేశాడట.. ఐటీ నోటీసులు.. కథ పెద్దదే

Journalist Controversy
Journalist Controversy

Journalist Controversy: ఆయన సాంప్రదాయని.. శుద్ధ పూసని టైపు. పైగా తనంత నిజాయితీ కలిగిన జర్నలిస్టు లేడని చెప్పుకుంటాడు. ఇంటర్వ్యూలు చేస్తాడు. అందులో లేకి ప్రశ్నలు అడుగుతాడు. అంతేకాదు, గతంలో ప్రైమ్ టైం లో వార్తలు చదివేవాడు. ఆ తర్వాత అతగాడి వ్యవహారం తెలిసి మేనేజ్మెంట్ కొద్ది రోజులు పక్కన పెట్టింది. కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేసింది. దీంతో అప్పటినుంచి అతడు కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే చేస్తాడు. పైగా ప్రశ్నిస్తే శత్రువు అవుతాయేమో.. అయినా పర్వాలేదు ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ గొప్ప గొప్ప పతిత్తు కబుర్లు చెబుతుంటాడు.

ఇప్పుడు ఈ సుప్రసిద్ధ జర్నలిస్టు కు ఐటీ నోటీసులు వచ్చాయి. ఏకంగా వందల కోట్ల వెనకేసుకున్నాడట. ఒక్కొక్క ఇంటర్వ్యూకు 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. పైగా ఈ విషయం మేనేజ్మెంట్ కి తెలిసి అంతర్గత విచారణ కూడా మొదలుపెట్టిందట. ఇటీవల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అతడేకంగా 11 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన ప్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడితో ఆగిపోలేదు మోకీలా ప్రాంతంలో ఎనిమిది కోట్లతో విల్లా కొనుగోలు చేశాడు. మియాపూర్ ప్రాంతంలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లి రావడానికి ఏకంగా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఐటి శాఖకు తెలియడంతో అతడికి నోటీసులు జారీ అయ్యాయి.

ఇక్కడితోనే ఆ జర్నలిస్ట్ సంపాదన వ్యవహారం ఆగిపోలేదు. బెంగళూరులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇటీవల ఆ కంపెనీ మీద ఐటి అధికారులు దాడులు చేశాడు. అమరావతిలో అతడు కొనుగోలు చేసిన భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. కృష్ణయ్యపాలెంలో 18 ఎకరాల భూమి కొనుగోలు చేస్తే.. ఇటీవల సిఆర్డిఏ నుంచి తనకు ప్లాట్ రావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలియడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులు అందరికీ నోటీసులు ఇచ్చారు. అంత కాదు హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 లో నడుస్తున్న ఓ పబ్ లో ఇతడికి వాటా ఉంది. విశాఖపట్నంలో కూడా ఒక పబ్ ఉంది. గతంలో ఓ ప్రభుత్వం ఈయనకు భారీగా డబ్బు ఇచ్చింది. ఆ డబ్బులు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా ఒప్పందం కుదిరించాడు. అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో.. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వాహకులు ఇతడిని ప్రశ్నించారు.. తాను ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించలేనంటూ చేతులు కూడా ఎత్తేశాడు.

తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులను ఇటీవల ఇంటర్వ్యూలకు పిలిపించాడు ఇతడు. వారి దగ్గర నుంచి భారీగానే లక్షల్లో వసూలు చేశాడు. అయితే మార్కెటింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం తెలియడంతో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు తన బినామీతో వసూలు చేసిన మొత్తం కూడా మేనేజ్మెంట్ కు తెలియడంతో.. మేనేజ్మెంట్ ఇతడి మీద విచారణ మొదలుపెట్టింది. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోవడంతో.. ఈ సుద్దపూస జర్నలిస్ట్ పరిస్థితి సంకట స్థితిలో పడింది. చూడాలి మరి ఈసారి పోస్ట్ ఉంటుందా.. ఊడుతుందా..

సూర్య కుమార్ ముంబై నుంచి వెళ్ళిపోవడం ఖాయమా.. ఇదేం ట్విస్ట్ స్వామి

Suryakumar Yadav
Suryakumar Yadav

Suryakumar Yadav: ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ ఒకడు. ఇతడు మిస్టర్ 360 ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అందువల్లే ముంబై మేనేజ్మెంట్ ఇతడిని తమతోనే ఉంచుకుంటున్నది. ఎలా ఆడినప్పటికీ.. అతడిని కొనసాగిస్తూనే ఉంది.

ఇటీవలి ఐపిఎల్ లో సూర్య కుమార్ యాదవ్ అంత గొప్పగా ఆడలేదు.. తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. ముఖ్యంగా జట్టు అవసరాలకు తగ్గట్టుగా పరుగులు తీయలేదు. ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ వచ్చే సీజన్లో ముంబై జట్టులో ఉండడని.. మేనేజ్మెంట్ అతడిని వదిలించుకోవడానికి సిద్ధమైందని వార్తలు రావడం మొదలైంది. దీనికి తగ్గట్టుగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహార శైలి కూడా ఉండడంతో అనేక రకాల అనుమానాలకు కారణమైంది. అయితే సూర్య కుమార్ యాదవ్ ఈ వ్యవహారం మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ముంబై మేనేజ్మెంట్ కూడా అతని తొలగించి పట్ల క్లారిటీ ఇవ్వలేదు.

అటు ముంబై.. ఇటు సూర్య కుమార్ యాదవ్ ఎటువంటి ప్రకటనలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఊహాగానాలు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికీ స్పష్టమైన సమాధానం చెప్పాడు సూర్య కుమార్ యాదవ్. కాకపోతే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. టీమిండియా టి20 మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇన్ స్టా గ్రామ్ బయోలో ముంబై ఇండియన్స్ పేరు కనిపించింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఒకసారి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సంతోషం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇటీవల స్కై ఇన్స్టాలో ముంబై ఇండియన్స్ పేరును తీసేసాడు. అధికారిక పేజీని.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అన్ ఫాలో చేశాడు. దీంతో అతడు జట్టు నుంచి వెళ్ళిపోతాడని ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు బయోలో ముంబై ఇండియన్స్ పేరు కనిపించింది. మరోవైపు హార్థిక్ పాండ్యాను అతడు మళ్లీ ఫాలో అవడం మొదలుపెట్టలేదు. ఇక ఈ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ 13 మ్యాచులు ఆడాడు. కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు.

ముంబై ఇండియన్స్ జట్టుకు తాత్కాలిక సారధిగా పని చేశాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. మైదానంలో ఒత్తిడి ఎదుర్కొన్నాడు. తన ఫేవరెట్ షాట్లు కూడా కొట్టలేకపోయాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో సూర్య కుమార్ యాదవ్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు టీమిండియా టి20 కెప్టెన్సీ కూడా కోల్పోవడంతో సూర్యకుమార్ యాదవ్ కెరియర్ ప్రమాదంలో పడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..
image.png

‘‘ఇడుపుకాయితం’’.. అర్థం తెలియకపోతే నోరుమూసుకోండి.. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచకండి

Idupu Kayitham
Idupu Kayitham

Idupu Kayitham: అప్పట్లో బలగం సినిమా వచ్చింది. అందులో తెలంగాణ మనుషుల మధ్య ఉండే బంధాలకు పెద్దపీట వేశాడు దర్శకుడు. సున్నితమైన అంశాలతో కథ నడిపించి కన్నీరు పెట్టించాడు. అప్పట్లో మాతృదేవోభవ.. గోరింటాకు.. ఆ సినిమాల తర్వాత మళ్లీ ఈ సినిమాకే జనాలు కన్నీళ్లు పెట్టారు.. థియేటర్లకు కదిలారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రొజెక్టర్లు పెట్టి సినిమాలు ప్రదర్శించారు. బలగం సినిమా తెలంగాణ మట్టి భాషకు.. తెలంగాణ మాండలి కానికి.. తెలంగాణ మనుషుల మధ్య ఉన్న బంధాలకు నిదర్శనంగా నిలిచింది.

బలగం సినిమాలో మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ ఓ కుటుంబంలో విభేదాలకు కారణమవుతుంది. మూలుగ బొక్క కోసం ఇంత గొడవ జరుగుతుందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారంతా ఇది ఎలా సాధ్యం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ అదే అరవింద సమేత సినిమాలో ఐదు రూపాయల కోసం ఊరు ఊర్లు ఫ్యాక్షన్ గొడవలకు ఎలా దిగాయని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే నోరు మూసుకొని కూర్చున్నారు.

మళ్లీ ఇప్పుడు ఇడుపు కాయితం అనే సినిమాను ఇటీవల ప్రకటించారు. దీనికి బన్నీ వాస్ నిర్మాత. ఈయన కూడా ఆంధ్ర నేపథ్యం ఉన్న వ్యక్తే. ఈ సినిమాలో ప్రియదర్శి.. నాగదుర్గ నటిస్తున్నారు.. ఇడుపు కాయితం అంటే తెలంగాణ రాష్ట్రంలో విడాకులని అర్థం. ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న పదం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాను తెలంగాణ పాటలు.. తెలంగాణ మండలి కాలు అదరగొడుతున్నాయి. ఉదాహరణకు రాను బొంబాయి రాను.. అనే పాటను తీసుకుంటే.. వందల కోట్ల వ్యూస్ దక్కించుకుంది. ఇటీవల కాలంలోనే కాదు.. గతంలో కూడా ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాట కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదు. చివరికి అలవైకుంఠపురం లో సినిమా రాములు రాములు పాట కూడా తెలంగాణ మండలికం నేపథ్యంలోనే రూపొందింది.

కొంతకాలంగా తెలంగాణ దర్శకులు కూడా తెలుగుచిత్ర పరిశ్రమ మీద తిరుగులేని ముద్ర వేస్తున్నారు. వారంతా కూడా ఆంధ్రమూలాలు ఉన్న వారి మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేక కొంతమంది తెలంగాణ యాస మీద.. తెలంగాణ మాండలికం మీద.. తెలంగాణ భాష మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఇడుపు కాయితం సినిమాను ప్రకటించిన తర్వాత కొంతమంది కావాలని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. సినిమాకు సబ్ టైటిల్స్ ఏమైనా ఉంటాయా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ప్రాంతానికి తగ్గట్టుగా యాస ఉంటుంది. బాష కూడా అదే స్థాయిలో మార్పులకు గురవుతూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉత్తరాంధ్రలోక విధంగా.. కోస్తాలో మరొక విధంగా.. రాయలసీమలో ఇంకొక విధంగా భాష ఉంటుంది. అలాంటప్పుడు దానికి సబ్ టైటిల్స్ అడుగుతారా.. ఎందుకు ఇంత లేకితనం.. ఎందుకు ఈ మూర్ఖత్వం.. ప్రాంతాల మధ్య.. మనుషుల మధ్య చిచ్చు పెట్టడం కాకపోతే… ఏందిది.. కొంతమంది మూర్ఖత్వం వల్ల.. తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ అనేక రకాలుగా వెళ్తుంది. అప్పుడు ప్రాంతాల మధ్య మళ్లీ గొడవలు జరుగుతాయి. విద్వేషాలు రగులుతాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే మనుషులు మనుషులు మాదిరిగా ఉండాలి. ప్రాంతాలను ప్రాంతాల మాదిరిగా చూడాలి. భాషలను భాషల మాదిరిగా.. యాసలను యాసల మాదిరిగా చూడాలి.

వీరికి పోలియో చుక్కలు వేయించొచ్చా..

Pulse Polio Campaign
Pulse Polio Campaign

Pulse Polio Campaign: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 28(ఈరోజు) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కలిసి గ్రామాలు, పట్టణాలు, బస్తీలు అన్న తేడా లేకుండా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకెళ్లి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకొని పోలియో చుక్కలు వేయించాలని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలని అంటున్నారు. అవేంటంటే?

పల్స్ పోలియో ఎందుకు అంత ముఖ్యమంటే?
పోలియో అనేది వైరస్ వల్ల వచ్చే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ నాడీ వ్యవస్థపై దాడి చేసి శాశ్వత అంగవైకల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేకపోవడంతో, పోలియో చుక్కలే అత్యంత ప్రభావవంతమైన రక్షణ మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే టీకాలు వేసినా.. మళ్లీ చుక్కలు ఎందుకు?
చాలా మంది తల్లిదండ్రుల్లో ఇప్పటికే పిల్లలకు అన్ని వ్యాక్సిన్లు వేశాం.. మళ్లీ పోలియో చుక్కలు ఎందుకు? అనే సందేహం ఉంటుంది. దీనికి వైద్యులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఇచ్చే ఓరల్ పోలియో వ్యాక్సిన్ (OPV) అదనపు రక్షణను అందిస్తుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని మరింత బలపరచడంతో పాటు సమాజంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. అందువల్ల గతంలో టీకాలు తీసుకున్న పిల్లలు కూడా ఈ చుక్కలు తప్పకుండా వేయించుకోవాలి.

వాంతులు చేస్తే ఏం చేయాలి?
పోలియో చుక్కలు వేసిన తర్వాత 30 నిమిషాల్లోపు చిన్నారి వాంతులు చేసుకుంటే, ఆ డోసు పూర్తిగా శరీరంలోకి వెళ్లకపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం లేదా పోలియో బూత్‌లో మరోసారి పోలియో చుక్కలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పిల్లలకు అవసరమైన రక్షణ పూర్తిగా అందుతుంది.

జలుబు, జ్వరం ఉన్నా చుక్కలు వేయించవచ్చా?
సాధారణ జలుబు, తేలికపాటి జ్వరం, దగ్గు లేదా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక జ్వరం (హై ఫీవర్), తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రత్యేక మందులు తీసుకుంటున్న పిల్లల విషయంలో ముందుగా పీడియాట్రిషన్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
పిల్లలను పోలియో బూత్‌కు తీసుకెళ్లే సమయంలో ఎలాంటి భయం అవసరం లేదు. పోలియో చుక్కలు సురక్షితమైనవి, నొప్పిలేనివి. కార్యక్రమం రోజున పిల్లలకు ఆహారం లేదా తల్లి పాలు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే చుక్కలు వేసిన వెంటనే వాంతులు చేస్తే మాత్రం మరో డోసు వేయించుకోవడం తప్పనిసరి.

ఏపీలో ఆ రెండు ఎమ్మెల్సీ పదవులు వారికే,,!

Andhra Pradesh MLC Elections
Andhra Pradesh MLC Elections

Andhra Pradesh MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలు కానుంది. గవర్నర్ కోటాలో వైసీపీకి చెందిన జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు మరో నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే కేవలం రెండు స్థానాలు కావడంతో వీటిని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చే అవకాశాల్లో మిత్రపక్షాలకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. వారంతా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీర్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. అటువంటి వారికి పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబు మరి ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.

* ఆశావాహులు అధికం..
గవర్నర్ కోటాలో నియమితులయ్యే వీరు ఆరేళ్లపాటు పదవీకాలంలో ఉంటారు. అందుకే ఈ ఎమ్మెల్సీలకు విపరీతమైన పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో 10 మంది వరకు ఆశావహులు ఉన్నారు. వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, పిఠాపురం వర్మ, మహాసేన రాజేష్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఆశావహులుగా ఉన్నారు. వీరికి సర్దుబాటు చేయడం చాలా కష్టం కూడా. అయితే ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాలు ఉన్నారు. కానీ అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఒక నిర్ణయానికి రానున్నారు.

* సీట్లు త్యాగం చేసినందుకు..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావుకు సైతం ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు సీట్లు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును వదులుకున్నారు వర్మ. అది కచ్చితంగా గెలిచే సీటు. కానీ పవన్ కోరడంతో అసంతృప్తిగానే ఆ సీటును వదులుకున్నారు వర్మ.. అప్పట్లో ఎమ్మెల్సీ హామీ తోనే అలా చేశారు అనేది బహిరంగ రహస్యం. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటు వదులుకున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలకు చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

42 పెద్ద పులులు.. ఇది మన తెలంగాణలోనే.. ఎక్కడంటే..

Amrabad Tiger Reserve
Amrabad Tiger Reserve

Amrabad Tiger Reserve: దట్టమైన అడవి.. కనీసం సెల్ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. అక్కడ పులుల గాండ్రింపులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. జింకల సయ్యాటలు కూడా ఎక్కువయ్యాయి. గతంలో ఇలా ఉండేది కాదు. కానీ కొంతకాలంగా అక్కడ పులులు పెరుగుతున్నాయి. గతంతో పోలి చూస్తే పులుల సంఖ్య పెరిగింది. ఇదంతా మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. అస్సాం రాష్ట్రంలో ఉన్న అడవుల గురించే కాదు.. మన రాష్ట్రంలో.. అది కూడా తెలంగాణలో పెరిగిన పులుల గురించి..

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది పెద్ద పులులకు అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది.. ఇటీవల అఖిల భారతీయ పులుల సంఖ్య అంచనా 2026 సర్వే ఆధారంగా ఈ అడవిలో మొత్తం 42 పెద్ద పులులు నివాసం ఉంటున్నట్టు సమాచారం. ఇందులో 18 ఆడ.. 14 మగ.. రెండు ప్రీ మెచ్యూర్డ్ టీనేజ్, 8 పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన ఎడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు 8 నెలల పాటు సుమారు 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అధికారులు సర్వే నిర్వహించారు.

2024 సర్వే ఆధారంగా ఆమ్రాబాద్ అరణ్యంలో 34 పెద్ద పులులు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 42 కు చేరింది. నల్లమల అడవుల్లో గతంతో పోల్చి చూస్తే ఈసారి జింకల సంఖ్య పెరిగింది. దీనికి తోడు ఆడ పులులు ఎక్కువగా ఉండడంతో సంక్రమణ సజావుగా సాగుతోంది. దీంతో మగ పులులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఆహార అన్వేషణ కూడా సక్రమంగా సాగుతున్న నేపథ్యంలో పులులు సజావుగా బతుకుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ అటవీశాఖ సమగ్రమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పులుల సంఖ్య పెరుగుతోంది.. వేటగాళ్ల మీద ప్రభుత్వం అత్యంత తీవ్రంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. పులులు స్వేచ్ఛగా బతకగలుగుతున్నాయి.

ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో జంతువుల కదలికలు రికార్డు అవుతున్నాయి. అటవీ జంతువుల కోసం ప్రత్యేకంగా సోలార్ సహాయంతో నడిచే బోర్లను ఏర్పాటు చేశారు. నీటి కుంటలు తవ్వించారు. తద్వారా వేసవికాలంలో జంతువులు దాహార్తితో బాధపడకుండా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. అందువల్లే ఇక్కడ జంతువులు వేసవికాలంలో కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. పులులు కూడా నీటి కుంటల వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకున్నాయి.

వైఎస్ అవినాష్ రెడ్డి నిష్క్రమణ.. జగన్ కే చెప్పేశారు

YS Avinash Reddy
YS Avinash Reddy

YS Avinash Reddy: కడప జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తట్టుకొని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం సద్దుమణగడం లేదు. రోజురోజుకు ఆ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తేల్చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

* నాలుగు దశాబ్దాలకు పైగా హవా..
కడప జిల్లాలో 1978లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు రాజశేఖర్ రెడ్డి. అలా గెలిచిన రాజశేఖర్ రెడ్డి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా కడప జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. రాజశేఖర్ రెడ్డి ది ఉమ్మడి కుటుంబం. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు రాణిస్తుంటే.. కడప జిల్లా బాధ్యతలు వైయస్ వివేకానంద రెడ్డి చూసేవారు. కుటుంబంలో ఎంతోమంది ఉన్నా వివేకాకు ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అన్న ఆదేశాలను క్రమం తప్పకుండా పాటించేవారు వివేకానంద రెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్న రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయారో.. నాటి నుంచి వివేకానంద రెడ్డి ప్రాధాన్యత తగ్గించి.. భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.

* ఆలస్యంగా ఎంట్రీ..
2014 తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే వివేకానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జిల్లా పై ఉన్న పట్టు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి మాదిరిగా వివేకానంద రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు షర్మిలకు ఇద్దామని ప్రతిపాదించారు వివేకానంద రెడ్డి. అటు తరువాత వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం.. అది రాజకీయ లబ్ధి కోసం చేసిన హత్య అని.. అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేయించారంటూ వివేక కుమార్తె సునీత, వైయస్ షర్మిల సైతం ఆరోపించారు. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. అవినాష్ రెడ్డి తక్కువ ఓట్లతో మొన్నటి ఎన్నికల్లో బయటపడ్డారు.

* ప్రతికూల అంశాలతో.
అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ రీఓపెన్ అయింది. ఈసారి ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం ఖాయం. పైగా మునుపటిలా కేంద్ర ప్రభుత్వ సహాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ఈసారి దొరికిపోతామని అవినాష్ రెడ్డికి తెలుసు. ఆపై రాజకీయ ప్రత్యర్ధులు బిటెక్ రవి, రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పట్టు బిగిస్తున్నారు రాజకీయంగా. మునుపటిలా జిల్లాలో రాజకీయాలు చేయలేమని అవినాష్ రెడ్డి గుర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు. తనకు బాధ్యతలు నుంచి తప్పించాలని.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనని కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

వైసీపీ అమరావతి ఉద్యమాన్ని నమ్ముతారా?

YSRCP
YSRCP

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో ఎంత తగ్గితే అంత మేలు. ఎందుకంటే ఆ పార్టీకి అమరావతి పై మాట్లాడే అర్హత కూడా లేదు. అమరావతిని వ్యతిరేకించింది కాకుండా అక్కడి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో మోపాలని చూసింది జగన్ సర్కార్. అమరావతిని స్మశానంతో పోల్చారు బొత్స లాంటి సీనియర్ నేత. ఇక అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని అడ్డుకునే ప్రయత్నంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే అమరావతి రైతులపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే మాత్రం నమ్మే స్థితిలో అక్కడి రైతులు లేరు.

* పదేపదే మాట మార్పు..
ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు చంద్రబాబు. నిండు శాసనసభలో ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని కూడా హేళన చేశారు. మూడు రాజధానులు కట్టలేకపోయారు. అమరావతి రాజధానిని ఐదేళ్లపాటు పడుకోబెట్టరు. అడవిని తలపింప చేశారు. అయితే కూటమి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూ సమీకరణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. మొన్ననే కొందరు రైతులను పిలిపించుకొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ వేదిక పేరుతో వైసీపీ నేతలు అమరావతిలో అడుగుపెట్టారు. అమరావతి రైతుల్లో ఆగ్రహం కట్టలు పెంచుకుంది.

* కొత్తగా ప్రేమ..
అమరావతి విషయంలో ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాటకాని.. వైసిపి నేతలు చెప్పే మాటలకు ప్రజలతో పాటు అమరావతి రైతులు వినే పరిస్థితిలో లేరు. ఒకవేళ అమరావతి రైతులకు నిజంగా న్యాయం చేయాలని వైసిపి ముందుకు వచ్చినా ఫలితం ఉండదు. అంతలా అమరావతి రైతుల నమ్మకాన్ని కోల్పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటికి మొన్న మావిగన్ అనే ప్రతిపాదన చేసి.. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ పేరుతో రాజకీయాలు మొదలుపెట్టడం ఏంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కుట్రలు చేస్తూ.. మరోవైపు మీకు అండగా ఉంటానని ముందుకు వస్తే నమ్మే స్థితిలో లేమని తేల్చి చెబుతున్నారు. అయితే నిన్న ఉండవల్లి జంక్షన్లో అమరావతి రైతుల ఆగ్రహాన్ని స్వయంగా చవిచూశారు వైసీపీ నేతలు. వారు వచ్చారు కాబట్టి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇదే తరహాలో ప్రతికూలత రావడం ఖాయం. అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయలేకపోతున్నారు.

వైభవ్ సూర్య వంశీకి 12 కోట్లు కావాలట.. వామ్మో బుడ్డోడు మహా ఘటికుడే

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల బాలుడని.. నూనూగు మీసాలు కూడా రాణి బుడ్డోడని.. ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్య వంశీ గురించి చెప్పుకున్నాం కదా. కానీ మనం ఇకనుంచి అతడిని అలా అనకూడదు. ఎందుకంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. అతడు చేసే చేష్టలు మామూలుగా లేవు. ఏకంగా కోట్లకు ఎసరు పెట్టాడు. అంతేకాదు రూపాయి తక్కువైనా చేసేది లేదని.. ఇది వ్యాపారం అని చెబుతున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో ఈ సంవత్సరం గట్టిగానే వెనుక వేసుకున్నాడు. రఫ్ గా ఒక ఆరు కోట్లు జేబులో వేసుకున్నాడు. అంతరంగిక వర్గాల ప్రకారం ఆ లెక్క ఇంకా గట్టిగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సూర్య వంశీ కెరియర్ పీక్స్ లో ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు అదే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు మాత్రమే అభిమానులు వచ్చారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేసి.. సూర్య వంశీ పేరుతో ప్లకార్డులను అభిమానులు పట్టుకొచ్చారు. మైదానంలో ప్రదర్శన చేశారు.

సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. రెండో మ్యాచ్లో అవకాశం ఇవ్వక తప్పడం లేదు. అతడు లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ మ్యాచ్లో కచ్చితంగా అతడికి అవకాశం లభిస్తుంది.

వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీకి సంబంధించిన బ్యాట్ వాడుతున్నాడు. అయితే అతడు త్వరలోనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడితో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ సూర్య వంశీకి 6 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సూర్య వంశీ 12 కోట్లు అయితేనే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓకే చెబుతానని చెప్పినట్లు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. మరోవైపు సూర్య వంశీ.. ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సూర్య వంశీ 15 సంవత్సరాల వయసులోనే కోట్లు వెనకేసుకుంటున్నాడు. తన తోటి పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే.. అతడేమో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. బుడ్డోడు అంటే చిన్నోడు కాదు.. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న బలవంతుడు.