Homeబిజినెస్India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే.

India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే.

India Car Color Trends: చాలా మంది కార్లు కొనే సమయంలో మైలేజ్ కోసం ఇంజిన్.. స్టైలిష్ గా ఉండడానికి డిజైన్ చూస్తారు. అయితే కొందరు తమకు నచ్చిన కలర్ లో ఉండే కారును మాత్రమే కొనుగోలు చేస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం వారికి ఇష్టమైన రంగుల్లో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. అయితే ప్రముఖ అంతర్జాతీయ కెమికల్ మరియు రంగుల తయారీ సంస్థ BASF విడుదల చేసిన తాజా ‘ఆటోమోటివ్ కలర్ పాపులారిటీ రిపోర్ట్’ […]

India Car Color Trends: చాలా మంది కార్లు కొనే సమయంలో మైలేజ్ కోసం ఇంజిన్.. స్టైలిష్ గా ఉండడానికి డిజైన్ చూస్తారు. అయితే కొందరు తమకు నచ్చిన కలర్ లో ఉండే కారును మాత్రమే కొనుగోలు చేస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం వారికి ఇష్టమైన రంగుల్లో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. అయితే ప్రముఖ అంతర్జాతీయ కెమికల్ మరియు రంగుల తయారీ సంస్థ BASF విడుదల చేసిన తాజా ‘ఆటోమోటివ్ కలర్ పాపులారిటీ రిపోర్ట్’ ప్రకారం, భారతీయ కార్ల మార్కెట్లో రంగుల ఎంపికకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రంగురంగుల కార్ల హవా పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం వాహనదారులు ఇప్పటికీ తెలుగు రంగు కార్లనే ఎక్కువగా కొంటున్నట్లు తెలుస్తోంది. అలా ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలుసా..?

భారతదేశంలో కార్ల కొనుగోలుదారులలో అత్యధికులు తెల్ల రంగు కార్లనే ఇష్టపడుతున్నారు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో ఏకంగా 48 శాతం మంది ఈ కార్లనే కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. మన దేశంలో ఉన్న విపరీతమైన ఎండలు, ధూళి వంటి వాతావరణ పరిస్థితుల్లో తెల్ల రంగు కారును మెయింటెన్ చేయడం సులభం కావడం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, రీసేల్ (మళ్లీ అమ్మేటప్పుడు) సమయంలో కూడా తెల్ల రంగు కార్లకు మంచి డిమాండ్ మరియు ధర లభిస్తుండటంతో సగానికి పైగా ప్రజలు దీనికే జై కొడుతున్నారు.

వైట్ కలర్ తర్వాత భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న రంగు Grey. దాదాపు 17 శాతం మంది ఈ కలర్ కార్లను ఎంచుకుంటుండడంతో ఇది రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్టైలిష్ లుక్ కోసం, ఎలిగెంట్ లుక్ కోసం చూసేవారు సిల్వర్, బ్లాక్ రంగుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు రంగుల కార్లను 10 శాతం మంది చొప్పున వాడుతున్నట్లు సర్వే తేల్చింది.

అయితే కాస్త ట్రెండీగా, కలర్‌ఫుల్‌గా ఉండాలనుకునే వారు బ్లూ, రెడ్ రంగులను ఎంచుకుంటున్నారు. క్రోమాటిక్ రంగుల విభాగంలో 7 శాతం వాటాతో బ్లూ (నీలం) కలర్ ముందంజలో ఉండగా, 5 శాతం వాటాతో రెడ్ (ఎరుపు) కలర్ తర్వాతి స్థానంలో ఉంది. ముఖ్యంగా యువత, చిన్న హాచ్‌బ్యాక్ కార్లు కొనేవారు ఎరుపు రంగును ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇక మార్కెట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎంచుకునే ప్రత్యేకమైన రంగుల్లో గ్రీన్, బీజ్, ఆరెంజ్ రంగులు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న కొత్త SUV మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో గ్రీన్, డ్యూయల్ టోన్ , మ్యాట్ ఫినిషింగ్ రంగుల వైపు మొగ్గు చూపుతున్నట్లు BASF తెలిపింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper