Home Blog Page 58

15 వేల మందిని చంపాలనుకున్నాడు.. వీడికి ఇంకా బతికే హక్కు ఉందా.. సజ్జనార్ మార్క్ న్యాయమే సరి..

Fayyaz Arrest
Fayyaz Arrest

Fayyaz Arrest: పులిలాంటి క్రూర జంతువు ఆకలి వేస్తేనే వేటాడుతుంది. ఆకలి తీరితే పక్కనుంచి జింక వెళ్లినా సరే పట్టించుకోదు. ఎందుకంటే దానికి ఆకలి తీరితే సరిపోతుంది. కానీ మనుషులు అలా కాదు.. మనుషుల్లో ఉన్న లోభం .. అత్యాశ వల్ల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఘోరాలు చేస్తున్నారు. సాటి మనుషులపై ఏమాత్రం సానుభూతి లేకుండా దాడులు చేస్తున్నారు. చివరికి అత్యంత క్రూరంగా చంపేస్తున్నారు. న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా శిక్షలు వేసినా సరే ఈ తరహా వ్యక్తుల వ్యక్తిత్వం మారడం లేదు. పైగా కొత్త కొత్తగా వారిలో క్రూరమైన ఆలోచనలు పుడుతున్నాయి.

మనదేశంలో ఇటీవల మొహర్రం జరిగింది. ఇది ఒక సంతాప సందేశం లాంటి కార్యక్రమం. చనిపోయిన ముస్లింలను తలుచుకుని సాగించే వ్యవహారం. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక వ్యక్తి నరమేధానికి వాడుకోవాలనుకున్నాడు. ఏకంగా 15000 మందిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి మొహర్రం సమయంలో ముస్లింలే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తోటి ముస్లింలనే చంపడానికి అతడు ప్రయత్నించాడు అంటే ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. పైగా పోలీసులు దర్యాప్తులో అతనికి సంబంధించిన అనేకమైన విషయాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.

15 వేల మందిని చంపడానికి ప్రణాళిక రూపొందించిన ఆ వ్యక్తి పేరు ఫయాజ్.. ఇతడు ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విషపు క్యాప్సూల్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే అతని వ్యవహార శైలి ముందుగానే తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని వద్ద నుంచి దాదాపు 14 వేల 900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరో 30 వేల క్యాప్సూల్స్.. 50 కిలోల ఎలుకల మందు అతడు ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. ఇంతమందిని చంపడానికి అతడు గొప్ప కార్యంగా చెబుతున్నాడు.

ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. ఇతడు బీబీఏ వరకు చదివాడు. ఇరాక్ లో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. క్రూరంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. తోటి మనుషులను చంపడానికి తెగబడ్డాడు. సరైన సమయం కోసం చూస్తున్న అతడు మొహర్రం నాడు ఈ దారుణానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు అతడి చేతిలో ఎవరూ చనిపోలేదు. అతడు ఇచ్చిన క్యాప్సూల్స్ ఎవరైనా తింటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇంతటి క్రూరమైన ఫయాజ్ ను జైల్లో పెట్టి మేపడం కంటే.. సజ్జనార్ మార్క్ న్యాయమే సరైనదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్స్ కి జానీ మాస్టర్ రాకపోవడానికి కారణం అదేనా..

Peddi OTT Release
Peddi OTT Release

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతీ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఆయనే. చికిరి చికిరి, రయ్ రయ్ రారా వంటి పాటలు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే సినిమా విజయం లో ఇంతటి కీలక పాత్ర పోషించిన జానీ మాస్టర్, ప్రీ రిలీజ్ విడుదల వేడుక కార్యక్రమంలో కానీ, సక్సెస్ ఈవెంట్స్ లో కానీ పాల్గొనకపోవడం గమనార్హం. రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితుడైన జానీ మాస్టర్ , ఎందుకు ఈ ఈవెంట్స్ లో పాల్గొనలేదని అభిమానులు సైతం అడుగుతున్నారు.

జానీ మాస్టర్ ని ఆహ్వానిస్తే కచ్చితంగా వచ్చేవారు, కానీ మేకర్స్ అంతటి సాహసం చేయలేకపోయారని తెలుస్తోంది. ఎందుకంటే జానీ మాస్టర్ పై పోక్సో కేసు ఉంది. యంగ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ని ఈయన లైంగిక వేధింపులకు గురి చేసారని రెండేళ్ల క్రితం ఈయనపై ఆమె కేసు వేయడం, పోలీసులు కేసు నమోదు చేసి , జానీ మాస్టర్ కోసం గాలించి , బెంగళూరు లోని ఒక రిసార్ట్ లో అరెస్ట్ చేసి దాదాపుగా నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించడం, అంతే కాకుండా వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి పోవడం వంటి సంఘటనలు చూసిన తర్వాత జానీ మాస్టర్ కి భవిష్యత్తు ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే రామ్ చరణ్ నుండి పిలుపొచ్చింది. దేశం మొత్తం ఊగిపోయే రేంజ్ స్టెప్పులు కంపోజ్ చేసి మరోసారి చరిత్ర సృష్టించారు.

అయినప్పటికి జానీ మాస్టర్ ని పెద్ది ఈవెంట్ కి పిలిస్తే , సినిమాపై లేనిపోనీవు నెగెటివిటీని కొంతమంది అంటిస్తారు , ఆ కారణం చేతనే జానీ మాస్టర్ ని ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ కి పిలవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే నెగెటివిటీ వస్తుంది అని తెలిసినప్పుడు , జానీ మాస్టర్ ని ఈ సినిమా కోసం తీసుకోకుండా ఉండాల్సింది, ఆయన చేత పాటలను కంపోజ్ చేస్తే రానటువంటి నెగెటివిటీ, ఈవెంట్స్ కి వస్తే వచ్చేస్తుందా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'పెద్ది' 24 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే..

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi 24 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వీకెండ్స్ వస్తే డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా నమోదు అవుతున్నాయి. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం బట్టి చూస్తుంటే , ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది దాదాపుగా అసాధ్యమే. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 24 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 24 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 24 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , నైజాం ప్రాంతం నుండి 54 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 21 కోతిలా 10 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 23 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 92 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 14 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 64 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 26 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 149 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 231 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 203 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 347 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 350 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టినప్పటికీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు తీవ్రంగా నిరాశపర్చడం వల్ల, ఈ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ అందుకోలేకపోతోంది.

'మా ఇంటి బంగారం' 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. స్టార్ హీరోలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాదు..

Maa Inti Bangaram Collections
Maa Inti Bangaram Collections

Maa Inti Bangaram Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి తలపండిన ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. నాన్ స్టాప్ గా వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుండి కోటి కి పైగా షేర్ వసూళ్లను రాబట్టడం ఈమధ్య కాలం లో కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వలేదు. అలాంటిది సమంత నాన్ స్టాప్ గా వారం రోజులు కాదు , ఏకంగా 9 రోజులు తెలుగు రాష్ట్రాల నుండి కోటి కి పైగా షేర్ వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రెండవ రోజునే బ్రేక్ ఈవెన్ మార్కుని సొంతం చేసుకున్న ఈ చిత్రం , 9 రోజుల్లో ఏ రేంజ్ లాభాలను రాబట్టింది?, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూడబోతున్నాం.

ట్రేడ్ విలాసేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 9 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది మొదటి రోజు వసూళ్లకంటే ఎక్కువ. ప్రాంతాల వారీగా 9 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 8 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 18 కోట్ల 90 లక్షలు షేర్ వసూళ్లు, 32 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇతర ప్రాంతాల నుండి రాబట్టిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 1 కోటి 60 లక్షలు , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 10 లక్షలు , ఓవర్సీస్ నుండి 9 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 33 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 68 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 21 కోట్ల 65 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. బిజినెస్ టర్మ్స్ ప్రకారం చూస్తే ఇదొక ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా పరిగణించొచ్చు. సోమవారం నుండి కలెక్షన్స్ స్టడీ గా ఉంటే , కచ్చితంగా ఈ చిత్రం లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయట. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.

'రావు బహదూర్' మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఊహించడం కూడా కష్టమే..

Rao Bahadur First Review
Rao Bahadur First Review

Rao Bahadur First Review: మన టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని తపన పడే హీరోల్లో ఒకరు సత్య దేవ్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన , ఆ తర్వాత హీరో గా మారి , డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ, తనలోని నటన ప్రతిభకు సానపెడుతూ, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన చిత్రం ‘రావు బహదూర్’. మహేష్ బాబు నిర్మాణ సంస్థ లో, ‘C/O కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఇది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే నెల 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని హైదరాబాద్ లో కొంతమంది సినీ ప్రముఖులకు , మీడియా మిత్రులకు వేసి చూపించారు.

ఈ షోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా విచ్చేశారు. ఈ సినిమాని చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘రావు బహదూర్.. ఇది కేవలం మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేసే చిత్రం మాత్రమే కాదు, మీ నరనరాల్లో గూస్ బంప్స్ రప్పించే సినిమా. స్టన్నింగ్ విజువల్స్ తో , అద్భుతమైన డ్రామా తో , ఒక ప్రపంచాన్నే సృష్టించారు. ఆ ప్రపంచం లో హీరో సత్యదేవ్ ధ్రువతార లాగా మురిసిపోయారు. అతని కన్నా ఈ పాత్రని ఇండస్ట్రీ లో ఎవ్వరూ బాగా చెయ్యలేరు రేంజ్ లో నటించారు. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు నాకు చాలా గర్వం గా ఉంది. జులై 3 న ఈ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

సాధారణంగా మహేష్ బాబు నిజంగా థ్రిల్ కి గురి చేస్తేనే ఇలాంటి ట్వీట్స్ వేస్తుంటారు. ఆయన జడ్జిమెంట్, రివ్యూస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనేది అందరి నమ్మకం. ఈ సినిమాకు ఆయన ఆ రేంజ్ రివ్యూ ఇచ్చారంటే , కచ్చితంగా ఇది అద్భుతమైన సినిమానే అనేది అర్థం అవుతోంది. కరువులో ఉన్న టాలీవుడ్ కి ‘పెద్ది’ చిత్రం కొత్త ఊపిరి పోసింది. ఆ తర్వాత విడుదలైన సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఊపుని ‘రావు బహదూర్’ కొనసాగిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు.

మళ్లీ సూర్య వంశీకి హ్యాండ్ ఇచ్చిన గంభీర్.. ఇద్దరు కొత్త వాళ్లకు ఛాన్స్

Gautam Gambhir, Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : గౌతమ్ గంభీర్ కు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు.. కనీసం మేనేజ్మెంట్ కూడా ఏమీ చేయలేకపోతోందా.. అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోతోందా.. పరిణామాలను చూస్తుంటే అదే విధంగా అనిపిస్తున్నాయి. జట్టులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చివరికి ఏం చేయబోతున్నారో కూడా తెలియడం లేదు.

గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్య వంశీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాజీ క్రికెటర్లకు కూడా అంతు పట్టడం లేదు. అసలు గౌతమ్ గంభీర్ అలా ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఓడిపోయింది.

సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో అవకాశం ఇవ్వకపోవడంతో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. జట్టులో అతడికి చోటు లభించకపోవడంతో ఆ ప్రభావం స్కోర్ మీద పడింది. ఐర్లాండ్ బౌలర్లను ప్రతిఘటించడంలో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ మినహా మిగతా వారంతా చేతులెత్తేశారు. పెద్ద పెద్ద బౌలర్ల మీద భీకరమైన ఇన్నింగ్స్ ఆడిన మన బ్యాటర్లు.. అనా మక ఐర్లాండ్ బౌలర్ల ముందు తలవంచారు. వాస్తవానికి సూర్య వంశీకి గనక చోటు కల్పిస్తే తొలి మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం వల్ల టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.

తొలి మ్యాచ్లో అవకాశం లభించలేదనుకుంటే.. రెండో మ్యాచ్లో కూడా సూర్య వంశీ రిజర్వ్ బెంచ్ పరిమితం కావలసి వచ్చింది. అతడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి అతడు ప్రవేశిస్తాడని అందరు అనుకున్నారు. పైగా ఆడే అవకాశం కల్పిస్తామని చెబితేనే సూర్య వంశీ తల్లిదండ్రులను ఐర్లాండ్ కు బీసీసీఐ పంపించింది. కానీ అతనికి అవకాశాలు ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ గేమ్స్ ప్లే చేస్తున్నాడు. సూర్య వంశీ కి రెండో మ్యాచ్లో చోటు ఇవ్వకపోగా… వాషింగ్టన్ సుందర్.. ప్రసిద్ కృష్ణ ను పక్కనపెట్టి ప్రిన్స్ యాదవ్.. సూర్యాంష్ కు అవకాశం కల్పించాడు గౌతమ్ గంభీర్. దీంతో అతడి తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు ఏం చేద్దాం అనుకొని అతడికి జట్టులో అవకాశం కల్పించారు.. చివరికి ఇలా డ్రింక్స్ బాయ్ గా పని చేయడానికి.. బంగారపు హుండీని చిల్లర వేయడానికి ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో బిర్యానీ తింటున్నారా.. ఈ వీడియో పై ఓ లుక్కేయండి

Pakistan Biryani Price Viral Video
Pakistan Biryani Price Viral Video

Hyderabad Restaurants : హైదరాబాద్ నగర వాసులకే కాదు, తెలంగాణ ప్రజలకు బిర్యానీతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.. రకరకాల బిర్యానీ ఫ్లేవర్లను హైదరాబాద్ వాసులు ఇష్టపడుతుంటారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా బిర్యాని కడుపునిండా లాగించేస్తుంటారు. హైదరాబాదులో బిర్యానీకి ఫేమస్ హోటళ్లు చాలా ఉన్నాయి. అందులో బావర్చి, షా గౌస్, ప్యారడైజ్, మెహెఫిల్ హోటళ్లు ప్రముఖమైనవి.

గతంలో హైదరాబాద్ నగరంలో బిర్యాని తయారుచేసే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు తినే వాళ్ళు పెరిగిపోవడంతో హోటళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వ్యాపారం కూడా లక్షల నుంచి కోట్లకు చేరుకుంది. దీంతో అనేక సంస్థలు హోటల్ ఫీల్డ్ లోకి వచ్చేసాయి. బిర్యానీతోపాటు.. రకరకాల వంటకాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. తయారు చేసే విధానం సక్రమంగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, అపరిశుభ్రమైన వాతావరణంలో వీటిని తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర పరిధిలో హోటళ్ల లో అధికారులు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఈ తనిఖీలలో దారుణమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు తయారు చేయడం.. గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించడం.. బూజు పట్టిన కూరగాయలు వాడటం.. ఫ్రిజ్ లో చాలా రోజులపాటు మాంసం నిల్వ ఉంచడం.. వంటివి వెలుగులోకి వచ్చాయి.. ఇటువంటి వంటకాలవల్ల తినేవాళ్ళకు లేనిపోని రోగాలు వస్తాయి.

హైదరాబాద్ నగరంలో ఇటీవల అధికారులు మెహెఫిల్ రెస్టారెంట్ మీద దాడులు చేశారు. ఈ క్రమంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మురికిగా ఉన్న ఫ్లోర్ మీద చికెన్ గ్రిల్ చేసి.. పెట్టడం.. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న ప్రదేశంలో రుమాలీ రోటీలు చేయడం.. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వంటకాల తయారీలో ఉపయోగించడం.. వంటివి వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి మెహెఫిల్ రెస్టారెంట్లో ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. బిర్యాని తయారీ కూడా అత్యంత దుర్గంధమైన వాతావరణంలో చేయడం అధికారుల తనిఖీలలో బయటపడింది. ఇటీవల కాలంలో హైదరాబాదులో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలలో ఇటువంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అందువల్లే ఇటువంటి హోటల్స్ లో తినకూడదని అధికారులు సూచిస్తున్నారు.

అమెరికా, రష్యాలతో ముప్పు.. సైన్యాన్ని పెంచుకుంటున్న జర్మనీ

Germany Army Expansion
Germany Army Expansion

Germany Army Expansion: జర్మనీ.. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. కానీ క్రమేణా అమెరికా, రష్యా వంటి దేశాలు బలపడ్డాయి. జర్మనీని మించిపోయాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలతోనే జర్మనీకి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తన సైనిక శక్తిని పెంచుకోవాలని నిర్ణయించింది. రష్యా నుంచి భద్రతా ముప్పు, అమెరికా నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడి జర్మనీని ఈ దిశగా నడిపిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాన్ని అనుసరించిన జర్మనీ ఇప్పుడు తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది.

రష్యాతో చారిత్రక శత్రుత్వం..
రెండవ ప్రపంచ యుద్ధం నుంచి జర్మనీ, రష్యా మధ్య ఉన్న చారిత్రక ఉద్రిక్తతలు ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం జర్మనీలో ఆందోళనను పెంచింది. రష్యా తన సైనిక విస్తరణను కొనసాగిస్తే తదుపరి లక్ష్యం జర్మనీ కావచ్చనే భయం జర్మన్‌ నాయకత్వంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జర్మనీ తన సరిహద్దుల భద్రతను బలపరచుకోవాలని భావిస్తోంది.

అమెరికా నుంచి ఒత్తిడి…
అమెరికా జర్మనీపై ఒత్తిడి పెంచడానికి కారణం నాటో సంకల్పం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జర్మనీని తీవ్రంగా విమర్శించారు. నాటో దేశాల భద్రత కోసం అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుండగా, జర్మనీ తన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో జర్మనీ చైనాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించడం అమెరికాకు నచ్చడం లేదు. ఈ రెండు అంశాలు కలిసి అమెరికా నుంచి జర్మనీపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి.

సైనిక బలోపేతానికి ప్రణాళిక..
ఈ ఒత్తిడుల నేపథ్యంలో జర్మనీ తన సైన్యాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సుమారు 1,85,000 సైనికుల సంఖ్యను 2035 నాటికి 2,60,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సైన్యంలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని యువతను ప్రోత్సహిస్తోంది. 18 ఏళ్ల యువకులకు కొంత సమయం ఇచ్చి, వాలంటరీ నియామకం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం విఫలమైతే 2027 నుంచి తప్పనిసరి సైనిక సేవను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది జర్మనీలో చాలా కాలం తర్వాత తప్పనిసరి సైనిక సేవను తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నంగా చూడవచ్చు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?
జర్మనీ ఈ నిర్ణయాలు తీసుకోవడం యూరప్‌ భద్రతా వాతావరణాన్ని మార్చే అవకాశం ఉంది. రష్యా ఆగ్రెషన్‌కు వ్యతిరేకంగా యూరోపియన్‌ దేశాలు మరింత ఐక్యంగా నిలబడేందుకు జర్మనీ సైనిక బలోపేతం సహాయపడుతుంది. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది ఒక మార్గం. అయితే తప్పనిసరి సైనిక సేవను పునరుద్ధరించడం జర్మన్‌ సమాజంలో చర్చలు, విమర్శలను కలిగిస్తుంది. మొత్తం మీద జర్మనీ ఇప్పుడు రెండు పెద్ద శక్తుల నుంచి వచ్చే ఒత్తిడిని సమతుల్యం చేసుకోవడానికి తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇది యూరప్‌లో భద్రతా సమతుల్యతను మార్చే ముఖ్యమైన అభివృద్ధిగా మారే అవకాశం ఉంది.

మోదీ సేషెల్స్‌ పర్యటన.. హిందూ మహాసముద్రంలో మరో వ్యూహం!

Modi Seychelles Visit
Modi Seychelles Visit

Modi Seychelles Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ సేషెల్స్‌కు చేస్తున్న పర్యటన కేవలం దౌత్య సందర్శన మాత్రమే కాదు. ఇది హిందూ మహాసముద్రంలో భారత్‌ తన ప్రభావాన్ని విస్తరించడానికి, చిన్న ద్వీప దేశాలతో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యల్లో ఒకటి.
సేషెల్స్‌ 115 ద్వీపాలతో కూడిన చిన్న ద్వీప దేశం. అయితే దీని ప్రాముఖ్యత దాని పరిమాణంలో కాదు. ఆఫ్రికా తీరం నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన సముద్ర మార్గాల్లో ఇది కీలక స్థానంలో ఉంది. దీని ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ 1.3 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి, ఆఫ్రికా సముద్ర వాణిజ్యంపై గణనీయమైన నియంత్రణ ఇస్తుంది. ఈ భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి భారత్‌ దీనితో సంబంధాలను మరింత బలపరచాలని నిర్ణయించింది.

సాగర్‌(AGAR) వ్యూహం..
భారత్‌ అనుసరిస్తున్న AGAR(Security and Growth for All in the Region) వ్యూహం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, అభివృద్ధి, వాణిజ్యం, కనెక్టివిటీలను సమగ్రంగా చూస్తుంది. ఈ వ్యూహం ప్రకారం చిన్న ద్వీప దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించాలని లక్ష్యం. సేషెల్స్‌ ఈ వ్యూహంలో ముఖ్యమైన భాగస్వామిగా మారింది. ఇది భారత్‌కు హిందూ మహాసముద్రంలో ఉనికిని బలపరచడానికి సహాయపడుతుంది.

చైనా ప్రభావానికి చెక్‌ పెట్టాలాని..
హిందూ మహాసముద్రంలో చైనా పెరుగుతున్న సైనిక, ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాన్ని సర్దుబాటు చేస్తోంది. వనరులు, సముద్ర భద్రత, వాణిజ్య మార్గాలపై నియంత్రణ పెంచుకోవడం ద్వారా చైనా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయాలని భారత్‌ భావిస్తోంది. సేషెల్స్‌ వంటి చిన్న ద్వీప దేశాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ఈ ప్రయత్నంలో ముఖ్యమైన భాగం. ఇది భారత్‌కు ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు సహాయపడుతుంది.

చారిత్రక బంధాలు..కొత్త అధ్యాయం
సేషెల్స్‌ 1976లో స్వాతంత్య్రం పొందిన తర్వాత 1981లో ఇందిరా గాంధీ పర్యటనతో భారత్‌తో సంబంధాలు మొదలయ్యాయి. 2015లో మోదీ మొదటిసారి సందర్శించి ఈ బంధాన్ని బలపరచగా, ప్రస్తుత పర్యటన దాన్ని మరింత లోతుగా తీసుకెళ్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక విశ్వాసం ఈ కొత్త వ్యూహాత్మక సహకారానికి పునాదిగా నిలుస్తోంది.

భద్రతా సహకారం..
భారత్‌ సేషెల్స్‌కు సముద్ర భద్రతా సహకారం అందించడం ద్వారా రెండు దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి. భారత్‌కు జియోపొలిటికల్‌ ప్రాప్తి, వాణిజ్య అవకాశాలు, పర్యాటక అభివద్ధి, కనెక్టివిటీ పెరుగుతాయి. సేషెల్స్‌కు ఆధునిక సాంకేతిక సహకారం, శిక్షణ, సముద్ర భద్రతా సామర్థ్యాలు అందుతాయి. ఇది రెండు దేశాల మధ్య సమతుల్యమైన, పరస్పర లాభదాయకమైన సంబంధాన్ని నెలకొల్పుతుంది.

మోదీ సేషెల్స్‌ పర్యటన భారత్‌ యొక్క హిందూ మహాసముద్ర వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగు. చైనా ప్రభావం పెరుగుతున్న ప్రాంతంలో చిన్న ద్వీప దేశాలతో బలమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ద్వారా భారత్‌ తన ఉనికిని బలపరచుకుంటోంది. ఈ చర్య ద్వారా భారత్‌ హిందూ మహాసముద్రంలో నాయకత్వ పాత్రను మరింత సుస్థిరం చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ద్వైపాక్షిక సంబంధాలు భారత్‌కు ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక అవకాశాలు, భద్రతా ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది.

'ఓజీ 2' లో 8 తలలు , 8 తోకల 'డ్రాగన్'.. కాన్సెప్ట్ వింటే మెంటలెక్కిపోవాల్సిందే..వీడియో వైరల్..

OG 2
OG 2

OG 2: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ గురించి తప్ప మరో చర్చ జరగడం లేదు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది , ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ని రీసెంట్ గానే పవన్ కళ్యాణ్, సుజిత్ కలిసి మాట్లాడుకుంటున్న ఒక వీడియో ని విడుదల చేసారంతే, సోషల్ మీడియా దెబ్బకు భగ్గుమంది. ఇందులో సుజిత్ చెప్పిన రెండు సన్నివేశాలను ఆధారంగా తీసుకొని , సోషల్ మీడియా లో నెటిజెన్స్ క్రియేట్ చేసిన AI వీడియోలను చూస్తుంటే, సుజిత్ అభిమానుల అంచనాలను అందుకుంటాడా?, లేదా?, సోషల్ మీడియా AI ద్వారా చూపించిన విజువల్స్ సినిమాలో లేకపోతే అభిమానులు చాలా ఫీల్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి పెట్ గా ‘డ్రాగన్’ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు.

ఆ డ్రాగన్ ని పవన్ కళ్యాణ్ కి పెట్ గా చూపిస్తూ , సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ క్రియేటివిటీ ని చూపిస్తూ కిరియేట్ చేసిన AI వీడియోలను డైరెక్టర్ సుజిత్ చూస్తే ‘ఎవర్రా మీరంతా’ అనే మీమ్ ని ఉపయోగిస్తారు, ఆ రేంజ్ లో ఉన్నాయ్ అన్నమాట. ఇకపోతే ప్రకటన వీడియో కి సంబంధించి చిన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను తెగ ఆకర్షించింది. ఈ మ్యూజిక్ కి సంబంధించిన పూర్తి వెర్షన్ ని నిన్న లిరిక్స్ తో సహా విడుదల చేశారు ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్. ఈ మ్యూజిక్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది అసలు మన ఇండియన్ సినిమాకు సంబంధించిన ట్రాక్ లాగా లేదని , హాలీవుడ్ రేంజ్ లో ఉందని, తమన్ ఓజీ ని మించిన మ్యూజిక్ ఈ చిత్రానికి అందించబోతున్నారని ఈ ఒక్క మ్యూజిక్ వీడియో ని చూసి చెప్పొచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు.

ఇకపోతే ఈ పాటలోని ముఖ్యమైన లిరిక్స్ లో ఒకటి ‘యమటానో ఓరొచ్చి’. దీని అర్థం ఏమిటి అని అభిమానులు గూగుల్ లో వెతకగా , అదొక 8 తలలు, 8 తోకలు ఉన్నతువని డ్రాగన్ అని తెలిసింది. ఒక్కసారి ఊహించుకోండి , 8 తలల డ్రాగన్ , నిప్పుల సునామీ ని కురిపిస్తూ వెండితెర పై కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది , ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. చూస్తుంటే ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ , సుజిత్ పాన్ ఇండియన్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అనిపిస్తోంది , నవంబర్ లో షూటింగ్ మొదలెట్టి , ఏప్రిల్ లోపు పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు సుజిత్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.

బాయ్ ఫ్రెండ్స్ ను అద్దెకు ఇస్తున్నారు..

Boyfriend Rental
Boyfriend Rental

Boyfriend Rental: నేటి కాలంలో డబ్బు సంపాదన కోసం మనుషులు అడ్డదారులు తొక్కుతున్నారు. పిచ్చిపిచ్చి వ్యవహారాలకు పాల్పడుతున్నారు. వీటివల్ల దారుణాల జరుగుతున్నాయి. పోలీస్ కేసులు కూడా నమోదువుతున్నాయి.. అయినప్పటికీ ఈ తరహా వ్యక్తులు మారడం లేదు. కనీసం మారాలి అని అనుకోవడం లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అడ్డమైన పనులు చేస్తున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా ఆధారంగానే గమనం సాగిస్తోంది. సోషల్ మీడియా కేంద్రంగానే వేలకోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇదంతా ఒక కోణం మాత్రమే. మరోకోణం లో దారుణాలు జరుగుతున్నాయి. వీటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొంతమంది దుర్మార్గులు డబ్బులు సంపాదిస్తున్నారు. అమాయకులను మోసం చేస్తున్నారు. మోసపూరితమైన ప్రకటనలు.. కుప్పిస్తూ ఆన్లైన్ వేదికగా నిండా ముంచేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల ను పెంచుకోవడానికి అతడు అడ్డమైన వ్యవహారాలకు పాల్పడ్డాడు. లైంగిక సేవలు అందిస్తామని.. అందమైన యువతులకు అద్దెకు బాయ్ ఫ్రెండ్ లను సరఫరా చేస్తామంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు. కొద్దిరోజుల్లోనే అతడు వ్యూస్ పెంచుకున్నాడు. లైకులు సొంతం చేసుకున్నాడు. పోలీసులు ఈ వ్యవహారాన్ని గుర్తించి అతడి మీద కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి రకరకాల వీడియోలు తీసేవాడు. ఇటీవల అర్ధరాత్రి పూట తిరుగుతూ కొన్ని ప్రాంతాలలో దృశ్యాలను చిత్రీకరించి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. వాటికి వీక్షకులు పెరిగిపోవడంతో.. ఫలానా ప్రాంతంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఒక వీడియో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.

ఈ పై రెండు సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.. సోషల్ మీడియాలో ఫేమస్ ఇవ్వడానికి చాలామంది యువకులు ఇంతకంటే దారుణమైన పనులు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి లిక్కర్ దొరికే ప్రదేశాలు.. ఆన్లైన్లో పెద్దల వీడియోలు లభించే వెబ్సైట్లు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించే ప్రాంతాల గురించి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరంతా కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులు చేస్తున్న వారిలో మొత్తం విద్యార్థులే ఉంటున్నారు. లైకులు.. షేర్ల కోసమే తాము ఈ పని చేస్తున్నామని పోలీసుల విచారణలో ఆ విద్యార్థులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. నిజమైన నమ్మితే నిండా మునగడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జొన్నగిరి శాంపిల్ మాత్రమే.. ఏపీలో అసలైన కేజీఎఫ్ ఇదే.. తవ్వితే ఏపీ రూపు రేఖలే మారిపోతాయి

Andhra Pradesh Gold Mines
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఇటీవల కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్దదైన ప్రైవేట్ బంగారు గొనుల ప్రాజెక్టు ఉత్పత్తి మొదలైంది. 405 కోట్ల ఖర్చుతో ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. జొన్నగిరి ప్రాంతంలో తయారైన బంగారాన్ని బయటకు విడుదల చేశారు. బ్రాండ్ ఏపీ పేరుతో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. రాయల్టీ రూపం లో జొన్నగిరి ద్వారా భారీగానే ఏపీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

జొన్నగిరి వల్ల కర్నూలు జిల్లా స్వర్ణ గిరిగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కేజీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని గడుపల్లె మండలంలోని చిగురు గుంట ప్రాంతంలో ఉంది.

సరిగా 2001లో ఇక్కడ గోల్డ్ మైన్స్ మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని తెరిపించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నారు. గతంలో 263 హెక్టార్లలో ఇక్కడి గనులు విస్తరించి ఉన్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో మరో తొమ్మిది హెక్టార్లను ఇందులో కలిపారు. గత ఎడాది ఇక్కడి బంగారు నిక్షేపాలపై అధికారులు సర్వే చేశారు. నివేదిక కూడా అందించారు. ఆ నివేదిక ప్రకారం ఇక్కడ 18 లక్షల టన్నుల ముడి బంగారు ఖనిజం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.. ఒక టన్ను ముడి ఖనిజం నుంచి దాదాపు 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. ఈ ప్రకారం అక్కడ 8.5 టన్నుల బంగారం ఉండవచ్చని సమాచారం. ఒకవేళ ఈ మైండ్స్ మళ్లీ మొదలయితే 5000 మందికి ఉపాధి లభిస్తుంది.

వాస్తవానికి ఈ గని ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడ ముడి ఖనిజాన్ని తవ్వారు. అప్పట్లో గుడిపల్లె మండలంలో రెండు ప్రాంతాలలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని గుర్తించారు. బిసానత్తం ప్రాంతంలో 1968, చిగురు గుంటలో 1978లో తవ్వకాలు మొదలుపెట్టారు. నాడు ఎంఈసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ లభించే క్వార్జ్ రాయిని వెలికి తీసి.. విక్రయించడం మొదలుపెట్టారు. ఎంఈసిఎల్ దాదాపు 10 సంవత్సరాలపాటు క్వార్జ్ ను వెలికి తీసింది. నాడు కేజీఎఫ్ లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ కు అందించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సంస్థ చెప్పుకోవడంతో ఘనుల నిర్వహణ కష్టంగా మారింది. ఆ తర్వాత ఇక్కడి గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీజీఎమ్ఎల్ 1982లో విక్రయించింది. 2001 వరకు ఇక్కడ బిజీ ఎంఎల్ సంస్థ ముడి ఖనిజాన్ని వెలికి తీసింది. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురు కావడంతో ఈ గనులను మూసివేస్తూ బిజిఎంఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ గనులకు సంబంధించి 263b హెక్టార్ల భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. బంగారం అన్వేషణలో భాగంగా 150 బోర్లు డ్రిల్ చేసింది.

స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి..

Sravanthi Chokarapu Look
Sravanthi Chokarapu Look

హైదరాబాద్ మల్కాజ్ గిరి కాలనీ లో హీరో నితిన్.. ఇంత సింపుల్ గా ఉన్నాడేంటి..

Nithiin Malkajgiri Shooting
Nithiin Malkajgiri Shooting

Nithiin Malkajgiri Shooting: యూత్ లో ఆడియన్స్ లో మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్, ప్రస్తుతానికి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో , పూర్తి స్థాయిలో తన మార్కెట్ ని పోగొట్టుకునే రేంజ్ కి పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రం ‘తమ్ముడు’ కూడా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఈ చిత్ర నిర్మాత , తదుపరి నితిన్ తో చెయ్యాలని అనుకున్న ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ ని కూడా ఆపేయాల్సి వచ్చింది. ఇక నితిన్ కెరీర్ అయిపోయినట్టే, ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత కూడా ఇప్పుడు సిద్ధంగా లేరని అంతా అనుకున్నారు. సరిగ్గా అలాంటి సమయం లోనే వచ్చారు ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై , నితిన్ ని హీరో గా పెట్టి రీసెంట్ గానే ఆయన ఒక సినిమాని మొదలు పెట్టారు. ఈ చిత్రం ద్వారా నరి , సోము అనే ఇద్దరు డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం లోని ఒక కాలనీ లో జరుగుతోంది. ఈ కాలనీ లో హీరో నితిన్ చాలా సామాన్యుడి గెటప్ లో కనిపించడం గమనార్హం. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిగా కనిపించారట. స్థానికులకు కూడా ఆయన అభివాదం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూస్తుంటే నితిన్ కి చాలా కాలం తర్వాత బాయ్ టు నెక్స్ట్ డోర్ తరహా పాత్ర దొరికినట్టుగా అనిపిస్తోందని , కచ్చితంగా ఈ సినిమాతో ఆయన భారీ కం బ్యాక్ ఇస్తారని , ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజెన్స్ అంటున్నారు.

ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా ‘మిరాయ్’ ఫేమ్ రితిక నాయక్ ని ఎంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానం లోకి ఇప్పుడు వైష్ణవి చైతన్య ని ఎంచుకున్నారు. గతం లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ హీరో గా ‘రంగ్ దే ‘ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ , కరోనా ప్రభావం వల్ల లాంగ్ రన్ దక్కలేదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గ్రాసర్ గా నిల్చింది. కానీ ఈసారి గురి తప్పే ఛాన్స్ లేదని , పక్కా హిట్ కొడుతారని అంటున్నారు ఫ్యాన్స్, చూడాలి మరి , అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.

అండమాన్ లో.. కేంద్రం కీలక ప్రాజెక్టు.. ఇక్కడి నుంచే దేశానికి కరెంటు.. ఏం చేయబోతున్నారో తెలుసా..

Andaman Islands
Andaman Islands

Andaman Islands: అండమాన్.. బ్రిటిష్ కాలంలో ఇక్కడ అత్యంత కఠినమైన కారగారాలను నిర్మించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిని ఇందులో వేసి చంపేశారు. నేటి ఆధునిక కాలంలో అండమాన్ పేరు గుర్తుకు వస్తే మనకు వెంటనే సముద్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ దీవులు.. వివిధ రకాల తెగలు.. అవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అండమాన్ ప్రాంతం ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. ఇక్కడ విశాలమైన సముద్ర తీరం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

అండమాన్ కేవలం సముద్ర తీర ప్రాంతంగా.. దీవుల సముదాయంగానే ఉండదు.. ఇకపై ఈ ప్రాంతం దేశం మొత్తానికి సరిపడా కరెంట్ ను ఉత్పత్తి చేయబోతోంది. అలాగని ఇక్కడ విస్తారమైన బొగ్గు గనులు లేవు. జీవ నదులు అంతకంటే లేవు. ఇలాంటి చోట విద్యుత్ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది.. పైగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. అలాంటప్పుడు విద్యుత్ ఎలా తయారు చేస్తారు.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. దీనికి సమాధానమే ఈ కథనం.

ప్రస్తుత కాలంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. థర్మల్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడితే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పుడు మాత్రమే జల విద్యుత్ తయారీ సాధ్యమవుతుంది. గాలి బాగా వీచినప్పుడు మాత్రమే హైడల్ పవర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇక సోలార్ పవర్ అయితే.. వర్షాకాలంలో తగినంత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. పైగా దీనికి భూమి చాలా కావాలి.

ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. విద్యుత్ అవసరాలు తీర్చుకునే మార్గం మీద మన దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అండమాన్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతోంది. అండమాన్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక భాగం. ఇక్కడ కేంద్రం హాట్ స్పాట్లను గుర్తించింది. ఎనర్జీ కన్వర్టర్లు.. హైబ్రిడ్ కన్వర్టర్లు ఏర్పాటు చేస్తారు. సముద్రం మీద ఒక వేదిక నిర్మించి.. వాటిపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది.

ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారంటే

సముద్రంలో కావలసినంత శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలలు.. ఆటుపోట్లు.. ప్రబాహాల ద్వారా సహజ కదలికలు ఏర్పడతాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న నీటి ఉష్ణోగ్రత ల వ్యత్యాసాన్ని కరెంట్ మాదిరిగా మార్చవచ్చు. సముద్ర జలాల్లో ప్రతి ఏడాది 9.2 లక్షల టెరా వాట్ (ఒక్క టెరా వాట్ పది లక్షల మెగా వాట్లకు సమానం) గంటల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.

సముద్రంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి బ్లూ ఎనర్జీ మార్గాలు ఉపయోగపడతాయి. అనేక దేశాలు సముద్రంలో ఆటుపోట్లు.. ప్రవాహాలు.. కెరటాలు.. అలలు వంటి వాటితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే భారత్ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా.. సముద్ర జలల మీద సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా నదులు, సముద్ర జలాల మధ్య ఉన్న సాలినిటీ తేడాల ద్వారా కూడా కరెంటు తయారు చేసే మార్గాలను రూపొందిస్తుంది. భారత రూపొందించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో సంవత్సరానికి టెరా వాట్ అవర్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక మనదేశం ప్రతి ఏడాది 1600 టెరా వాట్ ల విద్యుత్ ను ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రకారం చూసుకుంటే దాదాపు 575 సంవత్సరాలపాటు కోతలు లేకుండా దేశం మొత్తానికి ఇక్కడి నుంచి విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ రూపొందించింది..

సముద్ర జలాల నుంచి విద్యుత్తు తయారు చేయడం మంచి పని అయినప్పటికీ.. దీనికోసం చేసే ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది . ఒక మెగావాట్ టైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ సోలార్ పవర్ కు మూడు నుంచి నాలుగు కోట్లు.. పవన విద్యుత్ కు నాలుగు నుంచి ఐదు కోట్లు సరిపోతాయి. వచ్చే రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సముద్ర జలాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది . భవిష్యత్తు కాలంలో కేవలం సముద్రాలు మాత్రమే మనుషుల కరెంటు అవసరాలు తీర్చుతాయని నిపుణులు అంటున్నారు.

'కల్కి' లో ఆ పాత్రని నేను రిజెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది - కీర్తి సురేష్

Keerthy Suresh
Keerthy Suresh

Keerthy Suresh: ‘వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్ తో , డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉన్నటువంటి అనుబంధం ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహానటి ‘ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది కాబట్టి. అంతే కాకుండా ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గానూ కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందుకే వీళ్ళతో ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభందం ఉంటుంది. అప్పటి నుండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ ని తన ప్రతీ సినిమాలో ఎదో ఒక విధంగా భాగం అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’.

ప్రభాస్ హీరో గా నటించిన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన అద్భుతాలు సాధారణమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కి ఒక బలమైన క్యారెక్టర్ ని వదులుకుంది అట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , ఈ విషయం లో మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో నన్ను నాగ్ ఎదో ఒక విధంగా భాగం చేస్తాడని నాకు ముందే తెలుసు. ముందుగా ఆయన నాకు ఒక పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్ర విన్నప్పుడు ఎందుకో నాకు అంత గొప్పగా అనిపించలేదు , వర్కౌట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశాను. ఇది జరిగిన మరుసటి రోజే నాగ్ అశ్విన్ నాకు ఫోన్ మరో పవర్ ఫుల్ పాత్ర ఉంది , కనీసం ఏదైనా చేస్తావా అని అడిగారు. అయితే ఈ పాత్ర కి షూటింగ్ సెట్స్ వరకు రావాల్సిన అవసరం లేదని , కేవలం గొంతు ఇస్తే చాలని అన్నారు’.

‘ముందుగా ఇది విని షాక్ కి గురయ్యాను. నేను షూటింగ్ కి రాకుండా , నా గొంతు తో పనేమీ ఉంటుందబ్బా అని అనుకున్నాను. కానీ కట్ చేసే బుజ్జి అనే వాయిస్ క్యారెక్టర్ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత నాకు గొప్ప పేరు కూడా తీసుకొచ్చింది. ముందుగా ఆఫర్ చేసిన పాత్ర ని నేను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ సంతోషంగానే ఉన్నాను. ఒకవేళ నేను ఆ పాత్రని రిజెక్ట్ చేయకపోయుంటే నాకు ఇంత పేరు తీసుకొచ్చింది బుజ్జి పాత్ర దొరికేది కాదు కదా’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో, వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది , రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

'లెనిన్' ట్రైలర్ లోని హైలైట్స్ ఇవే..ఒక్క సినిమాలో ఇన్ని ట్రాజడీలా..!

Lenin Box Office Collection
Lenin Box Office Collection

Lenin Movie Trailer: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్న హీరో అక్కినేని అఖిల్. సినీ ఇండస్ట్రీ లోకి భారీ హైప్ తో ఈయన ఎంట్రీ ఇచ్చారు. కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో ఇండస్ట్రీ లోకి రాబోతున్నారు అని ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు తలక్రిందులు అయ్యాయి. స్టార్ హీరో అవుతాడని అనుకుంటే, కనీసం మీడియం రేంజ్ హీరో మార్కెట్ ని కూడా సంపాదించలేకపోయారు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన ఆయన చివరి చిత్రం ‘ఏజెంట్’ కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఆయన ఈసారి ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే కసితో ‘లెనిన్’ అనే చిత్రం లో నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 10 న విడుదల కాబోతుంది.

ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం కోరుతూ జులై 10 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాన్నీ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అక్కినేని నాగార్జున మొదటి నుండి చెప్తూనే ఉన్నారు, ఈ సినిమాలో మీరంతా సరికొత్త అఖిల్ ని చూడబోతున్నారు , చాలా గట్టిగా కొట్టబోతున్నాము అని. ట్రైలర్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి , ఫ్యాన్స్ కి కూడా ఇదే అనుభూతి కలుగుతుందట. అంత గొప్పగా నటించారట అఖిల్. అయితే ఈ చిత్రం లోని కొన్ని అంశాలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని మేకర్స్ లో కాస్త టెన్షన్ ఉందట.

ఎందుకంటే ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ చనిపోతుంది , అదే విధంగా అఖిల్ కి కళ్ళు పోతాయి. సినిమాల్లో ఇలాంటి ట్రాజెడీ సినిమాలు ఉంటే పెద్దగా వర్కౌట్ అవ్వవు , పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతుంటాయి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం ‘లెనిన్’ మేకర్స్ కి కాస్త ధైర్యం ఇచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి ఒక కాలు పోతుంది. అంత పెద్ద సూపర్ స్టార్ కాళ్ళు పోతేనే అడిగిన వాళ్ళు లేరు , సినిమాకు వర్కౌట్ కూడా అయ్యింది. కాబట్టి లెనిన్ కూడా అదే తరహా లో సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ట్రైలర్ లో అఖిల్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్ లాగా అనిపిసాయట.