Homeఎంటర్టైన్మెంట్Peddi 24 Days Collections: 'పెద్ది' 24 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Peddi 24 Days Collections: ‘పెద్ది’ 24 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే..

Peddi 24 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వీకెండ్స్ వస్తే డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా నమోదు అవుతున్నాయి. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం […]

Peddi 24 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వీకెండ్స్ వస్తే డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా నమోదు అవుతున్నాయి. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం బట్టి చూస్తుంటే , ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది దాదాపుగా అసాధ్యమే. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 24 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 24 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 24 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , నైజాం ప్రాంతం నుండి 54 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 21 కోతిలా 10 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 23 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 92 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 14 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 64 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 26 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 149 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 231 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 203 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 347 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 350 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టినప్పటికీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు తీవ్రంగా నిరాశపర్చడం వల్ల, ఈ సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ అందుకోలేకపోతోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper