Revanth Reddy : తెలంగాణలో రెండు రోజులుగా భద్రత కుదింపు అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కుదించింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను చంపాలని రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగా సమాధానం ఇస్తున్నారు. నిబంధనల మేరకే సెక్యూరిటీ కుదించామని పేర్కొంటున్నారు. భయం ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
తగ్గిన మావోయిస్టుల ప్రభావం..
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో
తెలంగాణ ప్రభుత్వం సుమారు 100 మంది ప్రముఖులకు అందిస్తున్న భద్రతను తొలగించాలని నిర్ణయించింది. ఈ చర్య భద్రతా వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి తీసుకున్న నిర్ణయంగా చూడవచ్చు. రాష్ట్రంలో మావోయిస్టు సంస్థల ప్రభావం, కార్యకలాపాలు గత కొన్నేళ్లుగా బాగా తగ్గాయి. ఇది పోలీసు విభాగం చేపట్టిన వివిధ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. ఈ మార్పు కారణంగా ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు అందిస్తున్న అదనపు భద్రత అవసరం లేదని భావించింది.
భద్రతా తొలగింపు వివరాలు..
ప్రభుత్వం 100 మంది ప్రముఖులకు అందిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్‌లు వంటి సౌకర్యాలను ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు కొందరికి ‘‘వన్ ప్లస్ వన్’’ స్థాయి భద్రత ఉండగా, మరికొందరికి ‘‘టూ ప్లస్ టూ’’ స్థాయి భద్రత ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యాలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుత భద్రతా వ్యవస్థ..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ స్థాయిల్లో భద్రత అందిస్తోంది. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య వ్యక్తులు ఉన్నారు. మావోయిస్టు ముప్పు తగ్గినందున ఈ జాబితాను సమీక్షించి, అవసరం లేని వారికి భద్రతను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వనరులను ఆదా చేయాలని చూస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భద్రతా పరిస్థితిలో మెరుగుదలను సూచిస్తుంది. మావోయిస్టు సమస్యను ఎక్కువగా అదుపులో ఉంచినందున భద్రతా వనరులను ఇతర ముఖ్యమైన అవసరాలకు మళ్లించవచ్చు. అయితే ఈ తొలగింపు కొందరు ప్రముఖుల్లో ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ చర్య ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భద్రతా సిబ్బందిని, వాహనాలను మరింత అవసరమైన ప్రాంతాలకు ఉపయోగించవచ్చు. అయితే భద్రత తొలగించిన వారి వ్యక్తిగత భద్రతా పరిస్థితిని కూడా ప్రభుత్వం నిరంతరం సమీక్షించాల్సిన అవసరం ఉంది.
















చైతన్య, నారాయణతో పాల వ్యాపారం.. కవిత చెప్పిన ఆ గుంట నక్క ఎవరు..
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల ముందుకు వచ్చిందంటే చాలు ఏదో ఒక విషయాన్ని బయటపడుతూనే ఉన్నారు. మీడియాకు కావలసినంత మసాలా అందిస్తూనే ఉన్నారు. తద్వారా మీడియాలో ఆమె విస్తృతంగా చర్చలో ఉంటున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత మొదట్లో కాస్త హుందా గానే మాట్లాడారు. కొన్ని విషయాలను మాత్రమే మీడియాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తిడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు.. నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. అంతేకాదు.. అనేకా అంశాల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా కవిత తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.
ఇటీవల ఇడుపు కాయితం అన్న సినిమాకు సంబంధించి వివాదం ఏర్పడిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ పదానికి అర్థం తెలియాలంటే పవన్ కళ్యాణ్ ను అడగాలని కవిత పరోక్షంగా విమర్శించారు. తద్వారా ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు కవిత. అంతేకాదు ఇటువంటి విషయాల మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని కవిత పేర్కొన్నారు. అక్కడితోనే కవిత ఆగిపోలేదు.. మరో నాయకుడి మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలతో గుంట నక్కలాంటి నాయకుడు పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత ఆరోపించారు. అటువంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితిలో కొనసాగడం ఆ పార్టీ చేసుకున్న దరిద్రమంటూ ఆమె ఆరోపించారు. గుంటనక్క అని కవిత సంబందించిన ఆ వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యాసంస్థల విషయంలో ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల మీద దాడులు కూడా చేశారు.
ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ఓ కీలక నాయకుడు ఆ రెండు విద్యాసంస్థలకు పాలు పోస్తున్నారని.. వ్యాపారం సాగిస్తున్నారని కవిత ఆరోపించారు. ఇటీవల కాలంలో హరీష్ రావు పేరు ప్రస్తావించకుండా గుంట నక్క అని కవిత అంటున్నారు. బహుశా విద్యా సంస్థలతో వ్యాపారం చేస్తున్నది ఆయనేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు. హరీష్ రావు భార్య పాల వ్యాపారం చేస్తున్నారు. ఒక డెయిరీ కూడా ఆమె ఏర్పాటు చేశారు. అందువల్లే కవిత ఈ ఆరోపణలు చేశారని తెలుస్తోంది. మరి దీనిపై హరీష్ రావు వర్గం నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.