Home Blog Page 24

నాని మార్కెట్ ను బీట్ చేయాలని చూస్తున్న అఖిల్...దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడుగా...

Akhil vs Nani
Akhil vs Nani

Akhil vs Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటులలో నాని ఒకరు… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఆయన మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసర సినిమాతో లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది కీలకంగా మారింది…

మొత్తానికైతే నానిని బీట్ చేసి అతని మార్కెట్ ని కబ్జా చేయాలని అఖిల్ చూస్తున్నాడు. ప్రస్తుతం నానికి 100 కోట్లకు పైన మార్కెట్ ఉంది. అఖిల్ కి 30 కోట్ల మార్కెట్ కూడా లేదు. మరి ఇలాంటి క్రమంలో ఆయన నాని ని బీట్ చేయడం సాధ్యమవుతుందా? లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే లేవు.

మరి ఇలాంటి క్రమంలో అఖిల్ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకోగలిగే కెపాసిటి అఖిల్ కి ఉందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మొత్తానికైతే నాని మాస్ హీరోగా మారుతున్నాడు. కాబట్టి అఖిల్ తన మార్కెట్ ను బీట్ చేయగలిగితే నాని కంటే పెద్ద హీరో అయిపోవచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు.

ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు అతనికి ఏ రకంగాను హెల్ప్ కాలేదు. మరి ఇకమీదటైనా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తూ కథల విషయంలో క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

రావణ్ కు బ్రతికేహక్కు లేదు.. మరణశిక్ష పడే సెక్షన్ల కింద సంచలన కేసు

YouTuber Ravan
YouTuber Ravan

Joseph Ravan: జోసెఫ్ రావణ్ అరెస్టు ఒక ఎత్తు అయితే.. ఆయనపై నమోదైన కేసులు మరో ఎత్తు. ఏకంగా మరణశిక్షపడేలా సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరుపు వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పటివరకు ఆయన సాధారణ సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేసినట్లు అంతా భావించారు. కానీ ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉపా చట్టం కింద కేసు నమోదయింది. ఈ అఫీషియల్ అరెస్ట్ నోటీసు ప్రకారం.. చట్టంలోని సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారం ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చిన కారణంగా ఈ కేసులు పెట్టారు. అత్యంత కఠినమైన దేశద్రోహం ముద్ర కలిగిన సెక్షన్లను చేర్చారు. వీటితోపాటు భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విశేషం.

* బలమైన వాదనలు..
ప్రస్తుతం జోసెఫ్ రావణ్ తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా 25 మంది న్యాయవాదులు ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగడంతో శ్రావణ్ కుమార్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా ఉపా చట్టం కింద కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు తప్పనిసరిగా స్థానిక మేజిస్ట్రేట్ లేదా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఈ ఉపా చట్టం కింద నిర్బంధించినప్పుడు పోలీసులకు లీగల్ గా అదనపు సమయం, కొన్ని మినహాయింపులు లభిస్తాయి. నిందితుడిని కోర్టు అనుమతితో గరిష్టంగా 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణ కేసుల్లో 60 నుంచి 90 రోజుల్లోగా చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఉపా కేసుల్లో దర్యాప్తు సంస్థలకు కోర్టు అనుమతితో 180 రోజుల వరకు చార్జ్ షీట్ దాఖలు చేసే గడువు ఇస్తుంది.

* బెయిల్ సులభం కాదు..
ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదు అయితే నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించదు. ఈ చట్టంలోని సెక్షన్ 43డ్ (5) ప్రకారం నిందితుడిపై మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజం అని కోర్టు భావిస్తే.. సదరు నిందితుడికి బెయిల్ నిరాకరించే సంపూర్ణ హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. సాధారణ కేసుల్లో బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది ఒక మినహాయింపు. కానీ ఈ చట్టం కింద మాత్రం అది వర్తించదు. ఈ కేసులో నిందితుడు తరుపు వాదించే లాయర్లకు కూడా కోర్టులో తక్షణ ఉపశమనం లేదా బెయిల్ తీసుకురావడం చట్టపరంగా అతిపెద్ద సవాల్. ఇప్పుడు అదే
నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు జోసఫ్ రావణ్ తరఫున వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్. మరణశిక్షతో సమానమైన సెక్షన్లు పెట్టారని.. 25 మంది న్యాయవాదులు వాదిస్తున్నారని.. వందలాదిమంది పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పట్లో రావణ్ బయటకు రావడం అసాధ్యం అని సంకేతాలు ఇస్తున్నారు.

వైసీపీకి ఆ సీనియర్ నేత గుడ్ బై!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబాలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటువంటి వారంతా పార్టీని వీడలేక.. ఉండలేక సతమతం అవుతున్నారు. జగన్ సీరియస్ రాజకీయాలు చేయకపోవడం, మళ్లీ అధికారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండడం, అందుకు ఎటువంటి కృషి చేయకపోవడంతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక పార్టీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

* కాంగ్రెస్ ను విభేదించి..
కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో చాలా కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని అనుసరించింది. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు మేకపాటి. అయితే మేకపాటి ఫ్యామిలీకి క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని మేకపాటి ఫ్యామిలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి వైపు ఎటువంటి బుజ్జగింపులు లేవు. అదే సమయంలో టిడిపి నుంచి సానుకూలత రావడంతో మేకపాటి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పట్టున్న నేత..
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించేవారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఎంపీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆయనది చెరగని ముద్ర. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆయన అకాల మృతితో మరో కుమారుడు విక్రమ్ రంగంలోకి దిగారు. ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రమ్ రెడ్డి సైతం పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. మేకపాటి గౌతంరెడ్డి మరణం తర్వాత ఆ ఫ్యామిలీకి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రస్తుతం మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.

* ఆ కారణంతోనే..
జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ ఆ జూనియర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు సీనియర్లకు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీరు మారాలని ఎక్కువగా కోరుకున్నారు. కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా ఆహ్వానం పలుకుతామని చంద్రబాబు నుంచి సమాచారం రావడంతో తీవ్ర నిర్ణయం దిశగా మేకపాటి రాజమోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో..

'పెద్ది' మూవీ కి ఇప్పటి వరకు థియేటర్ల లో వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే కంగుతింటారు...

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi Movie Collections: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన నని జాగ్రత్తలు తీసుకున్న అతనికి ఫ్లాపులు వస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేశాడు. ఈ సినిమా కూడా డివైడ్ టాక్ తో రన్ అయింది.

మొత్తానికైతే 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 350 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. ఇండియాలో 325 కోట్లు రాబట్టగా ఓవర్సీస్ లో 25 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.

దాంతో ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ మధ్య కాలంలో సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకొని కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ను సాధించిన టైర్ వన్ హీరో సినిమా ఇదే కావడం విశేష…ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక సుకుమార్ సైతం కథ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ముందు ఒక కథ ఫైనల్ అయిన తర్వాతే ఆయన సెట్స్ మీదకు వెళ్తాడు. కాబట్టి సుకుమార్ తోనే సక్సెస్ రావాలి లేకపోతే మాత్రం ఆయన కెరియర్ మరింత డైలామాలో పడిపోయే ప్రమాదం ఉంది. పోయి పోయి బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ చేసిన సినిమా ఇంత తక్కువ కలెక్షన్స్ ని రాబట్టడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…

పాన్ ఇండియాలో అలాంటి కథలకు డిమాండ్ పెరుగుతుందా..?

Pan India Movies
Pan India Movies

Pan India Movies: కొంతమంది దర్శకులు సినిమా తీసే విధానాన్ని మార్చేశారు. రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోయిందని వాళ్ళు భావిస్తున్నారు. డిఫరెంట్ కథల వైపు అడుగులు వేస్తున్నారు. కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి. స్టార్ హీరో అయిన కూడా కంటెంట్ బాగాలేకపోతే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఈ ఒక్క కారణంతోనే మరోసారి కంటెంట్ ఈజ్ కింగ్ అనే పేరైతే వచ్చింది. దాంతో చాలా మంది దర్శకులు సినిమాలు తీసే విధానాన్ని మార్చేశారు. కొంతమంది డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్నారు. హీరోలతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్ లను ఎంచుకోవడమే దర్శకులు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతుండడం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు తీసిన రాని గుర్తింపు కొంత మంది దర్శకులు కొన్ని సినిమాలతోనే గొప్ప ఐడెంటిటిని తెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం కూడా మారిపోయింది.

ఇంతకుముందు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను ఆదరిస్తూ ఉండేవారు. మాస్ మసాలా సన్నివేశాలు, 4 ఫైట్లు, 3 పాటలు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు కంటెంట్ వైవిధ్యంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది.

కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు డిఫరెంట్ కసినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు చూసిన సినిమాలు అన్ని పక్కన పెట్టి మరి ప్రేక్షకుడు వైవిధ్యం కోసం ఆరాటపడుతున్నాడు. వాళ్ళను ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. అందుకే పాన్ ఇండియాలో కొన్ని కథలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

బయోపిక్ లకు అలాగే సోషల్ మెసేజ్ లను ఇచ్చే సినిమాలకు ప్రేక్షకులను పర్ఫెక్ట్ గా ఎంటర్ టైన్ చేసే సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంది. మొత్తానికైతే ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించి ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసుకునే విధానం దర్శకులకు ఉండాలి. లేకపోతే మాత్రం వాళ్లు ఆయా దర్శకుల సినిమాలను చూడటమే మానేస్తారు…

రజినీకాంత్ 'జైలర్ 2' లో మ్యాటర్ ఉందా..? 1000 కోట్ల కల ను నెరవేరుస్తుందా...

Jailer 2 Movie
Jailer 2 Movie

Jailer 2 Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒక రేంజ్ లో ఉంటే రాబోయే రోజుల్లో వాళ్లు క్రియేట్ చేయబోయే సునామీ మరొ రేంజ్ లో ఉండబోతుందట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు రజినీకాంత్… ఆయన ఎన్నో పెను ప్రభంజనాలను సృష్టించినప్పటికి ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టలేదు. గత సంవత్సరం వచ్చిన ‘కూలీ ‘ సినిమాతో ఆ ఫీట్ ని అందుకుంటాడని అందరు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదు. దాంతో ఇప్పుడు ఆయన ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఇక 1000 కోట్ల మార్కును ఈజీగా దాటుతానని ఒక కాన్ఫిడెంట్ తో అయితే ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. నెల్సన్ డైరెక్షన్లో ఇంతకుముందు తెరకెక్కిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అందుకే జైలర్ 2 సినిమాని సైతం పట్టాలెక్కించినట్టుగా తెలుస్తుంది…

నెల్సన్ కమర్షియల్ సినిమాలనే చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించి కలెక్షన్ల సునామిని సృష్టిస్తాడు అనే ఒక పేరైతే ఉంది. ఆయన సినిమాలో ప్రతిదీ మీటర్ మీద ఉన్నట్టుగానే ఉంటాయి. ఒక పాట తర్వాత ఫైట్, ఎలివేషన్స్ పర్ఫెక్ట్ గా సెట్ చేస్తాడు… ఇక జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు క్యామియో రోల్స్ పోషించారు.

‘జైలర్ 2’ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి అతని పాత్ర కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉండబోతుందట. దాదాపు 5 నిమిషాల పాటు ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే రజినీకాంత్ ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది…

2 రోజులకే ఓటీటీ నుంచి తీసేశారు.. అ అసలేంటి సినిమా వివాదం...

Satluj OTT Removal
Satluj OTT Removal

Satluj OTT Removal: ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఏదైనా వివాదంలో చిక్కుకున్న సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించినప్పటికి ఆ వివాదం వల్ల ఆ సినిమా చాలా వరకు నష్ట పోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు దిల్జిత్ నటించిన ‘సట్లూజ్’ అనే మూవీ ఈనెల 3 వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది…

ఇక స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమాని జీ5 వాళ్ళు తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా ని ఓటిటి సంస్థ తొలగించాలి అనుకుంది అది చాలా సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా వాళ్లకు ఓటిటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటారు. కాబట్టి అర్ధాంతరంగా ఆ సినిమాని ఆ ప్లాట్ ఫామ్ నుంచి తీసివేయడం వల్ల అటు సినిమా వాళ్లకి ఇటు ఓటిటి సంస్థకి కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశమైతే ఉంది.

ఇక దానిని ఎందుకని ఓటిటి నుంచి తొలగించారనే విషయం పర్ఫెక్ట్ గా చెప్పలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సినిమాని ఇండియాలో స్ట్రీమింగ్ చేయడం కష్టతరం అంటూ జీ5 వాళ్ళు ఒక క్లారిటి అయితే ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే పంజాబ్ లో జరిగిన హత్యల పేరిట 2022 లో ‘పంజాబ్ 95’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి 127 కట్లను విధించడంతో చేసేది ఏమీ లేక సినిమా పేరుని మార్చి ఓటిటి లో రిలీజ్ చేశారు.

ఇక ఇక్కడ కూడా కాంట్రవర్సీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఓటిటి సంస్థ ఈ సినిమాని తొలగించడం జరిగింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల వాళ్లకి భారీ నష్టమైతే వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. అందుకే సినిమా చేసేటప్పుడు కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సినిమాని తెరకెక్కించగలిగితే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం క్లారిటి ఇస్తున్నారు…

చుక్కలు చూపిస్తున్నారు.. ఆడి గెలవాలి కానీ ఇలా చప్పుడు చేసి గెలుచుడు ఏందిరా బై

England Vs Mexico FIFA World Cup
England Vs Mexico FIFA World Cup

England Vs Mexico FIFA World Cup: ఏ ఆటైనా సరే.. ఆడాలి.. పోరాడాలి.. చివరి వరకు శాయశక్తులను ఒడ్డాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ స్థాయిలో కష్టపడినప్పటికీ విజయం దక్కదు. ప్రతి ఆటలో విజయం దక్కుతుందనే క్రీడాకారులు రంగంలోకి దిగుతారు. చివరి వరకు పోరాటాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఈ కథనంలో తమ జట్టు ఆటగాళ్లు గెలవాలని అభిమానులు సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు..ఎవరూ అంచనా వేయలేని విధానానికి పాల్పడ్డారు. చివరికి వీరి వ్యవహారం మీడియాలో పడి ప్రపంచవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.

ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ లో చోటు తగ్గించుకోవడానికి ఇంగ్లాండ్ తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో మెక్సికో జట్టుతో ఇంగ్లాండు కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెక్సికో అభిమానులు ఓ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఎవరూ ఊహించని విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో వాళ్ళ వ్యవహారం రకరకాల చర్చకు దారితీస్తోంది.

ఇంగ్లాండ్ జట్టు బస చేసిన హోటల్ బయట మెక్సికో అభిమానులు మామూలు హంగామా చేయడం లేదు. డ్రమ్స్ వాయిస్తున్నారు. షార్ట్స్ పేలుస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఈక్వెడార్ జట్టుతో కూడా ఇలానే వ్యవహరించారు. గెలుపు కోసం అనేక రకాల అడ్డదారులు తొక్కారు. మెక్సికో అభిమానులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో గెలవాలని ఇంగ్లాండ్ జట్టుకు యాజమాన్యం ఆ మాత్రలు పంపిణీ చేసింది. రాత్రిపూట ఆ కార్యం పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కార్యం వల్ల ప్లేయర్ల మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుందని.. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతారని మేనేజ్మెంట్ భావించింది. ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.. ఇంగ్లాండ్ జట్టు గురించి మేనేజ్మెంట్ అలా ఆలోచిస్తే.. మెక్సికో గురించి అభిమానులు ఇలా విధ్వంసం ఆలోచన చేశారు. మొత్తానికి తమ జట్టు మాత్రమే గెలవాలని ఇంగ్లాండ్ ప్లేయర్లు బస చేసిన హోటల్ ఎదురుగా రచ్చ రచ్చ చేశారు.

ఒక్క అగ్గిపుల్లతో 11 ఏళ్ల బాలుడు 72మందిని చం*పా*డు.. పాకిస్తాన్ లోనే ఇది సాధ్యం

Pakistan Shopping Mall Fire
Pakistan Shopping Mall Fire

Pakistan Shopping Mall Fire: ఆ బాలుడికి 11 సంవత్సరాలు. ఈ వయసు ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్తారు. బుద్ధిగా చదువుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటారు. పరీక్షలు ఉంటే రాస్తారు.. పుస్తకాలతో కుస్తీపడతారు. అటువంటి ఆ బాలుడు దారి తప్పాడు. ఘోరంగా వ్యవహరించాడు. చివరికి చేయకూడని దారుణం చేసేసాడు.

ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతంలో షాపింగ్ మాల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 72 మంది చనిపోయారు. ఆ ఘటన అప్పట్లోనే సంచలనం కలిగించింది. మొదట్లో ఈ దారుణానికి పాల్పడింది ఉగ్రవాదులని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ దేశంలో ఇటువంటి దాడులు.. బాంబు పేలుడులు సర్వసాధారణం. పైగా ఉగ్రవాదులు అక్కడ నిత్యం మారణహోమం సృష్టిస్తూనే ఉంటారు. కరాచీనగరంలో జరిగిన సంఘటనను కూడా చాలామంది పెద్దగా పట్టించుకోలేదు.

ఈ కేసు వ్యవహారంలో ఇటీవల రాజకీయ ఒత్తిళ్లు వచన నేపథ్యంలో పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులు కాదని.. ఆత్మాహుతి దళాలు కాదని.. అదంతా కూడా 11 సంవత్సరాల బాలుడి పని అని పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈ కేసు విచారణలో భాగంగా అతడి తండ్రిని.. మరో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అంతేకాదు ఆ బాలుడు ఫ్లవర్ షాపులో అగ్గిపుల్లతో ఆడుకుంటుండగా నిప్పు పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఏకంగా 72 మంది చనిపోయారు.. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారు మొత్తం ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారు.

ఈ ఘటన ప్రమాదం వల్ల జ రిగింది కాదని.. ఉద్దేశపూర్వకంగా చేశారని తెలుస్తోంది. ఫలితంగా 72 మంది చనిపోయారని అక్కడ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయంగా ఒత్తిడి రాకపోతే ఇలా ఉండేది కాదని.. చనిపోయిన వారిలో కొంతమంది అక్కడి రాజకీయ నాయకులకు అత్యంత దగ్గరవారని.. అందువల్లే ఈ కేసు దర్యాప్తు జనవరి తర్వాత ఎన్ని రోజులకు మొదలైందని ప్రచారంలో ఉంది. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

రావణ్ గురించి నీతులు చెబుతున్న వైసిపి.. పవన్ కళ్యాణ్ ను ఏం చేసిందో మర్చిపోతే ఎలా

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: నీతులు చెప్పడం ఈజీ. సుద్దపూసలాగా మాట్లాడటం మరింత ఈజీ. కానీ వాటిని అనుసరించడం.. ఆచరించడం అంత ఈజీ కాదు. పాపం ఈ విషయంలో వైసిపి ప్రతిసారి బొక్క బోర్లా పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ పార్టీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు బుద్ధి రాదు.. కనీసం విచక్షణ ఉండదు.

రావణ్ అలియాస్ జోసెఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన హంగామా మామూలుది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అతడు ఏ స్థాయిలో విమర్శించాడు, ఉగ్రవాదులకు ఏ విధంగా వంత పాడాడు, భారతదేశాన్ని ఏ విధంగా తిట్టాడు, పురాణాలను, సనాతన ధర్మాన్ని, హిందువులు గొప్పగా పూజించే దేవుళ్లను ఏ విధంగా విమర్శించాడు.. అనేవి అతని వీడియోలను చూస్తే తెలుస్తుంది. అతనికి వంతపాడే కొంతమందికి ఇవి కనిపించడం లేదా.. కనిపించినప్పటికీ కావాలని నాటకాలు ఆడుతున్నారా అర్థం కావడం లేదు.

ప్రశ్నించడం మంచిదే. కానీ అది సమస్యను ఎత్తి చూపించే విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉండకూడదు. ఇంట్లో వాళ్లను దూషించే విధంగా ఉండకూడదు. కానీ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎంచుకున్న విధానం మాత్రం వేరే విధంగా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడటం.. బండ బూతులు తిట్టడం.. వ్యక్తిగత అంశాలను బజార్లో పెట్టడాన్ని అతడు విమర్శించడం అనుకున్నాడు. పైగా దేశం మీద ప్రేమ లేదు అని చెప్పడాన్ని అతడు చాలా గొప్పగా భావించాడు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడానికి అతడు ఈ దేశం కల్పించిన హక్కుగా అనుకున్నాడు. చివరికి దేశద్రోహం కేసు కింద అరెస్టు అయ్యాడు.

ఇక్కడ జోసెఫ్ కి వంత పాడుతున్న వైసిపి.. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేసిందో మర్చిపోతే ఎలా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. కారు మీద ఎక్కి కూర్చున్నాడని కేసు పెట్టారు. సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి విశాఖపట్టణంలో ఓ హోటల్ ముందు సెక్యూరిటీగా పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులను కాపలాగా పెట్టారు. ఆయన సినిమా విడుదల అవుతుంటే టికెట్ల రేట్లు తగ్గించమని జీవోలు జారీ చేశారు. సర్పంచి నుంచి మొదలు పెడితే ఐఏఎస్ అధికారుల వరకు థియేటర్ల వద్ద సెక్యూరిటీగా పెట్టారు.

జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తన నాలుగవ భార్యగా పేర్కొన్నాడని మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టారు. అప్పట్లో మత్స్యకారులకు సంబంధించిన జీవోను వైసిపి ప్రభుత్వం జారీ చేస్తే.. దానిని చించివేశాడని కేసు నమోదు చేశారు. భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందని కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదల కాకుండా ఉండడానికి కేసులు పెట్టారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కేసులు పెట్టి.. ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు సుద్దపూసలుగా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉందని.. జనసేన నాయకులు అంటున్నారు..

అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతా అని ఆ మధ్య అన్నారు. దేనికోసం అన్నాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని జనసేన నాయకులు చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నాయకులు ఆయన మీద కేసు పెట్టి జడ శ్రవణ్ లేదా రామ్ జెఠ్మాలనీ ని విచారణకు నియమించుకోవాలని జనసేన నాయకులు సూచిస్తున్నారు. అన్నట్టు వైసిపి నాయకులను ఆయన చెప్పుతో కొడతాను అని ఎందుకు అన్నారో కూడా చెప్పాలని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

ఫిఫా వరల్డ్ కప్: ఓడితే ఏంటి.. కోట్లమంది మనసులు గెలిచారు..ఇది కదా పోరాటం అంటే..

Cape Verde FIFA World Cup
Cape Verde FIFA World Cup

Cape Verde FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. పోరాడే జట్లు ట్రోఫీ కోసం చివరి వరకు సర్వశక్తులు ఒడ్డుతాయి. అందువల్లే ఫిఫా మ్యాచ్ లు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది కాబట్టి ఫిఫా మ్యాచ్ లకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. ఇక టీవీలలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. మరింత ఆదరణ ప్రేక్షకుల నుంచి లభిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా టోర్నీలో ఓ జట్టు గొప్ప విజయాలు సాధించకపోయినప్పటికీ.. అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ జట్టు మీద అంతగా అంచనాలు లేకపోయినప్పటికీ.. ఆ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ.. అద్భుతమైన ఆట తీరు కొనసాగించింది. అందువల్లే ఆ జట్టు గురించి సరికొత్త చర్చ మొదలైంది.

ఫిఫా వరల్డ్ కప్ లో ఈసారి కాబో వర్డే జట్టు కొనసాగించిన పోరాట స్ఫూర్తి అసాధారణంగా ఉంది. ప్రపంచ కప్ లోనే అద్భుతమైన ఆట తీరుతో సరికొత్త పేరు తెచ్చుకుంది.. లీగ్ దశలో పటిష్టమైన స్పెయిన్.. ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో మ్యాచ్ లను డ్రా చేసుకుంది. నాకౌంట్లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టుతో జరిగిన పోరులో 2-3 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

కాబో వర్డే దేశంలో నిన్న స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో కాబో వర్డే జట్టు సొంత దేశంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో జట్టు ప్లేయర్లకు ఎయిర్ పోర్ట్ లో వేలాది మంది ప్రజలు ఘనమైన స్వాగతం పలికారు. ఆ దేశంలో జనాభా 5.5 లక్షలు ఉంటారు. దేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. కీలకమైన మ్యాచులలో అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో కాబో వర్డే గురించి గ్లోబల్ వ్యాప్తంగా చర్చ నడిచింది. లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్లు కూడా కాబో వర్డే జట్టు ఆటు తీరును మెచ్చుకున్నారు.

ఇంగ్లాండ్ చేతులారా... అక్కడే మ్యాచ్ టర్న్.. ఆస్ట్రేలియా సెవెంత్ వండర్ కు అదే కారణం

Women's T20 World Cup 2026
Women's T20 World Cup 2026

Women’s T20 World Cup 2026: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ లో ఇండియా చేతుల్లో ఓడిపోయింది. ఆ ఓటమి ఆస్ట్రేలియా జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తన ఆట తీరు పూర్తిగా మార్చింది. ముఖ్యంగా ప్లేయర్ల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఫలితం కూడా ఇప్పుడు కనిపించింది.

మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమేమి ఆవిష్కృతం కాలేదు. వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా మాదిరిగా ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డమీద అద్భుత ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎదుర్కోలేక ఇబ్బంది పడింది. భారీగా పరుగులు చేయక తడబడింది. ఒత్తిడిలో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఎదుట 151 పరుగుల టార్గెట్ మాత్రమే విధించగలరు. ఈ పరుగులు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద లెక్కలోవి కాదు. పైగా ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు భీకరమైన ఫామ్ లో ఉంది. ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

ఒక దశలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ (9) పరుగులకే అవుట్ అయింది. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తే బాగుండేది. బెత్ మూనీ, లిచ్ ఫీల్డ్ అద్భుతం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. కనీసం సొంత గ్రౌండ్ మీద సత్తా చూపించే విధంగా బౌలింగ్ వేయలేకపోయారు. లిచ్ ఫీల్డ్ (48) అవుట్ అయినప్పటికీ.. అప్పటికే ఆస్ట్రేలియాకు జరగాల్సిన లాభం జరిగిపోయింది. మూనీ మాత్రం మరో ఎండ్ లో రెచ్చిపోయింది. 64 పరుగులు చేసి అదరగొట్టింది.

ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. అది కూడా 17.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఆస్ట్రేలియా జట్టుకు మొత్తంగా ఇది ఏడవ వరల్డ్ కప్ టైటిల్.. ఆస్ట్రేలియా జట్టుకు సమీపంలో ఏ జట్టు కూడా లేదు. ఒకరకంగా చెప్పాలంటే మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఏక ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్ ప్లేయర్లు ఈసారి ఆస్ట్రేలియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఒకరకంగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మహిళలు నల్లేరు మీద నడకలాగా తమ విజయప్రస్థానాన్ని కొనసాగించారు. చివరికి ఏడవ వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఒకప్పుడు అపర కుబేరులు.. ఇప్పుడు పాతాళానికి... వీళ్ళ ఆర్థిక మోసం చాలామందికి గుణపాఠం

Indian Businessmen Controversies
Indian Businessmen Controversies

Indian Businessmen Controversies: వారు సెవెన్ స్టార్ హోటల్లో విడిది చేసేవారు. అత్యంత ఖరీదైన వాహనాలలో తిరిగేవారు. ఇతర దేశాలకు ప్రత్యేకమైన విమానాలలో మాత్రమే వెళ్లేవారు. వారు తాగే నీళ్లు.. తినే తిండి.. వేసుకునే దుస్తులు.. ఇలా ప్రతి ఒక్కటి లక్షల్లో ఉండేవి. వారి జీవన విధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కొందరైతే అలా బతకాలని కోరుకునేవారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని.. విజయవంతమైన వ్యాపార తంత్రాన్ని సాగించిన వారు చివరికి ఎలా మిగిలిపోయారంటే..

పెద్ద ఓడను సైతం ముంచేది చిన్న చిల్లే. వీరి వ్యాపారాన్ని కూడా చిన్న నిర్లక్ష్యం నిండా మించింది. ఆగర్భ శ్రీమంతులను కాస్త అనామకులను చేసింది. ఆకాశ హర్మ్యాలలో నివాసం ఉండేవారిని నేలకు దించింది. కొందరు దేశం విడిచి పరారీలో ఉంటే.. మరికొందరు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. అలా నష్టపోయిన వ్యాపారుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో మొదటి స్థానంలో అనిల్ అంబానీ ఉంటారు.

అనిల్ అంబానీ

అనిల్ అంబానీ పోగొట్టుకున్న డబ్బు విలువ అక్షరాల 3.14 లక్షల కోట్లు. 2008లో ఈయన ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద కుబేరుడుగా ఉండేవారు. అయితే ఈయన ఏర్పాటు చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర నష్టాలను చవిచూసింది. తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవడంతో ఈయన డౌన్ ఫాల్ అత్యంత వేగంగా సాగింది. 2008లో ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న ఆయన 2020 నాటికి తన నెట్ వర్త్ జీరో అని బ్రిటన్ కోర్టులో చెప్పుకునే స్థాయికి దిగజారిపోయాడు.

బైజు రవీంద్రన్

ఒకప్పుడు ఈయన సంపద 17500 కోట్లకు ఉండేది. పైగా భారత దేశంలోనే అతిపెద్దదైన ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీగా ఈయన బైజుస్ ఉండేది. ఇది టీమిండియా కు అధికారిక స్పాన్సర్ గా కూడా వ్యవహరించింది. రవీంద్రన్ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడటం.. నిబంధనలు మొత్తం పక్కన పెట్టడం.. పెట్టుబడు ధరలతో గొడవలు పెట్టుకోవడం వల్ల.. 2024లో ఈయన నెట్ వర్త్ జీరో అయిపోయింది.

నీరవ్ మోదీ

ఈయన గుజరాత్ రాష్ట్రంలో పేరుపొందిన వజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ను ఈయన నిండా ముంచారు. నకిలీ పాత్రలతో దాదాపు 13758 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. లండన్ పారిపోయారు.. ప్రస్తుతం లండన్ జైల్లో ఉంటున్నారు. అయితే లండన్ ప్రభుత్వం తనను భారతదేశానికి అప్పగించకుండా ఉండడానికి న్యాయపోరాటం చేస్తున్నారు.

మోహుల్ చోక్సీ

ఈయన గీతాంజలి జెమ్స్ కు అధినేతగా ఉండేవారు. అయితే ఈయన కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిండా ముంచారు. 13వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారు. ఈ స్కాం బయటపడుతున్న నేపథ్యంలో తెలివిగా ఆంటిగ్వా దేశానికి వెళ్లిపోయారు. అక్కడ పౌరసత్వం తీసుకున్నారు. పైగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

విజయ్ మాల్యా

కింగ్ఫిషర్ కంపెనీకి వ్యవస్థాపకులుగా ఉండేవారు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యజమానిగా ఉండేవారు. ఈయన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ ద్వారా 9000 కోట్ల అప్పుల భారాన్ని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులను ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్నారు

వీజీ సిద్ధార్థ

ఈయన 2019లో నేత్రావతి నదిలో దూకి చనిపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఈయన స్వయానా అల్లుడు. సుమారు 7200 కోట్ల అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు. మనదేశంలో చాలామందికి కాఫీ కల్చర్ ను ఈయన అలవాటు చేశారు. అప్పుల భారం పెరిగిపోవడం.. పెట్టుబడులు పెట్టినవారు ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈయన భార్య కాఫీ డే ను టేక్ ఓవర్ చేసుకొని అప్పుల భారాన్ని మొత్తం తగ్గించారు. తెలివిగా సంస్థను నడిపిస్తున్నారు.

సత్యం రామలింగరాజు

ఐటి రంగంలో తెలుగు వ్యక్తిగా.. అధునాతన శక్తిగా ఆవిర్భవించారు రామలింగరాజు. సత్యం కంప్యూటర్స్ ఏర్పాటు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కంపెనీ లాభాలను.. బ్యాంకు బ్యాలెన్స్లను అధికంగా చూపించి పెట్టుబడిదారులను మోసం చేశారు. 2009లో ఈ తప్పును స్వయంగా ఆయనే అంగీకరించారు. జైలుకు కూడా వెళ్లారు. ఈ స్కాం విలువ దాదాపు 7136 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

హర్షద్ మెహతా

ఈయనను స్టాక్ మార్కెట్ చరిత్రలో బిగ్ బుల్ అని పిలిచేవారు. బ్యాంకింగ్ సిస్టంలో అనేకలోసుగులను ఈయన వాడుకున్నారు. నకిలీ బ్యాంకు రసీదుల ద్వారా మార్కెట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేవారు. కుంభకోణం బయటపడిన తర్వాత ఆయన అసలు కోణం వెలుగులోకి వచ్చింది.. దాదాపు 4వేల కోట్ల వరకు ఈయన అక్రమాలకు పాల్పడ్డారు. దీనిని 1992 స్టాక్ మార్కెట్ కుంభకోణం అని పిలుస్తుంటారు. ఇటీవల ఆయన జీవితం జైలులో ముగియడం విశేషం.

వాస్తవానికి వీరందరినీ కూడా ఒకప్పుడు విజయానికి చిరునామాగా పేర్కొనేవారు. మీడియా కూడా వీళ్ళ వార్తలను విపరీతంగా ప్రసారం చేసేది. వీరి విజయవంతమైన కథలను గాధలను గొప్పగా ప్రచురించేది. చేసిన తప్పు వల్ల.. ఆర్థిక అవకతవకలవల్ల చివరికి వీరి పరిస్థితి ఇలా మారిపోయింది.

11,000 పెడితే.. 65 కోట్లు వచ్చాయి.. అదృష్టం అంటే ఈమెదే పో

Kanika Arora UAE Big Ticket Lottery
Kanika Arora UAE Big Ticket Lottery

Kanika Arora UAE Big Ticket Lottery: శీర్షిక చదివారు కదా.. ఇంకా చెప్పాల్సిందేముంది.. అదృష్టం అంటే ఎలా ఉంటుందో.. ధనలక్ష్మి తలుపు తడితే ధన ప్రవాహం ఎలా సాగుతుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. 11000 పెడితే ఒకటి కాదు రెండు కాదు 65 కోట్లు వచ్చాయి. ఇదేదో పదిమందిని మోసం చేస్తే వచ్చిన డబ్బు కాదు. మాయమాటలు చెప్పి ముంచేస్తే వచ్చిన డబ్బు కాదు. సహనాన్ని నమ్ముకుని.. ఓపికను ప్రదర్శించి.. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే వచ్చింది.

ఆమె పేరు కనిక అరోరా. వివాహమైంది. భర్తతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటున్నది. ఈమె భర్త ఓ ప్రవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి ఈమెకు. కాకపోతే ఆర్థిక నేపథ్యం సరిపోవడం లేదు కాబట్టి ఆశలను, ఆకాంక్షలను వాయిదా వేసుకుంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమెకు యూ ట్యూబ్ ద్వారా యూఏఈ బిగ్ టికెట్ లాటరీ గురించి తెలిసింది. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.. ప్రతినెల బిగ్ టిక్కెట్ లాటరీ లో 11000 పెట్టి కనికా టికెట్ కొనుగోలు చేసేది. అయితే ప్రతి సందర్భంలో తన భర్త పేరు మీద మాత్రమే ఆమె టికెట్ కొనుగోలు చేసేది. ఈసారి తన పేరు మీద టికెట్ కొనుగోలు చేసింది.. దాని గురించి మర్చిపోయింది.. మొత్తానికి వారి సహనానికి.. వారి ఓపికకు ప్రతిఫలం లభించింది. కనిక కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలింది. అది కూడా తీగంగా 65 కోట్లు. ఈ విషయాన్ని కనిక భర్త చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

“ప్రతి నెల టికెట్ రిలీజ్ కాగానే కొనుగోలు చేస్తున్నాం. ప్రతి నెలలో కూడా నా భర్త పేరు మీద టికెట్ కొనుగోలు చేసేవాళ్లం. అయితే ఈసారి నా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాం. ఊహించని విధంగా లాటరీ తగిలింది. ఆ లాటరీలో నా పేరు వచ్చింది. కొత్తగా 65 కోట్లు గెలుచుకున్నామని నా భర్త చెప్పగానే ఆనందంగా అనిపించింది. ఈ డబ్బుతో చాలా కలలు నెరవేర్చుకోవాలి. చాలా ఆకాంక్షలను నిజం చేసుకోవాలని ఉంది. ఈ డబ్బులో చాలా భాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెడతాం. కొంతమేర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేస్తాం. బంగారం ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవాలి. సేవ కార్యక్రమాలు కూడా జరపాలని ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి ఈ పనులు మొత్తం చేయాల్సి ఉందని” కనిక చెప్పింది.

యూఏఈ లో బిగ్ టికెట్ లాటరీ కి మంచి పేరు ఉంది. అక్కడి ప్రభుత్వం దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతినెల కూడా లాటరీ తీసి విజేతను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా యూట్యూబ్ వేదికగా జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ లోనే ఆ లాటరీ టికెట్ నెంబర్ ను నిర్వాహకులు బయట పెడతారు. తద్వారా విజేతలను ప్రకటిస్తారు. అయితే ఈ లాటరీ టికెట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంటుంది. పైగా ప్రైజ్ మనీ కూడా భారీగా ఉండడంతో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే ఈ నెలలో కనికకు ఆ అదృష్టం లభించింది. అది కూడా 65 కోట్ల రూపాయల అదృష్టం.

ఈ ఐదురాశుల వారికి ఈరోజు మహాశివుడి ఆశీస్సులు.. ఇంట్లో ధన పండుగ జరిగే అవకాశం..

Today 6 July 2026 Horoscope
Today 6 July 2026 Horoscope

Today 6 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక దన లాభం ఉండనుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రశంశాలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య దేవుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహాయం ఉంటుంది. కొందరు అప్పల నుంచి బయటపడతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు తమ ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. దూరపు బంధువులు ఇంటికి రావడంతో సందడిగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురు చూస్తే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగు పనులను పూర్తి చేసుకుంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గ్రహాల అనుకూలతతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని చూసే వ్యాపారులకు ఇదే మంచి సమయం.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి అనుకున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పాత బకాయిల నుంచి విముక్తి కలుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తు పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. తోటి వారి సహాయంతో ఉద్యోగులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. వ్యాపారులకు ప్రత్యర్థులతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు విదేశాల్లో కంపెనీలు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి బంధువుల సహాయం ఉంటుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభయోగం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు ఇతర భాగస్వాముల సహాయం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. బదిలీల విషయంలో కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

EPFO ఉన్న ఉద్యోగులకు ఇది తప్పనిసరి.. లేకుంటే..

EPFO Inactive Accounts Claim Process
EPFO Inactive Accounts Claim Process

EPFO new rules : ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం దాచుకునే డబ్బు సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) అంటారు. ఇప్పుడు ఈఫీఎఫ్ వో సభ్యులకు మరింత సులభమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా UAN యాక్టివేషన్, ఆధార్ ధ్రువీకరణ, డెత్ క్లెయిమ్ వంటి సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలను ప్రతీ ఈపీఎఫ్ వో ఉద్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితె..

UAN యాక్టివేషన్ ఇక..
ఇప్పటి వరకు EPFO సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మర్చిపోయినా.. లేదా యాక్టివేట్ చేయాల్సి వచ్చినా నేరుగా EPFO పోర్టల్‌లోనే ఆ సౌకర్యం ఉండేది. ఇందులో తమ వివరాలు అందించి మాడిఫికేషన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు కొత్త మార్పులతో ఆ ఫీచర్‌ను పోర్టల్ నుంచి తొలగించారు. ఇకపై UAN యాక్టివేషన్ లేదా సంబంధిత సేవలను UMANG యాప్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. దీంతో అన్ని ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి..
కొత్త యూనిఫైడ్ పోర్టల్‌లో సభ్యుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. సభ్యుల వివరాలు, క్లెయిమ్‌లు, ఖాతా సంబంధిత సేవలు పొందేందుకు ఆధార్‌తో ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో నకిలీ క్లెయిమ్‌లు, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

డెత్ క్లెయిమ్ ఫెసిలిటీకి ప్రత్యేక సౌకర్యం..
EPFO సభ్యుడు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు లేదా నామినీలు నిధులను పొందేందుకు ఇప్పుడు కొత్త పోర్టల్‌లో ప్రత్యేకంగా డెత్ క్లెయిమ్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి క్లెయిమ్‌ను సులభంగా సమర్పించవచ్చు.

డిజిటల్ సేవలకు ప్రాధాన్యం
కొత్త పోర్టల్‌లో సభ్యులకు అవసరమైన అనేక సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలో అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఖాతా వివరాల పరిశీలన, KYC అప్‌డేట్, నామినేషన్, క్లెయిమ్ దరఖాస్తులు, ట్రాకింగ్ వంటి సేవలను మరింత వేగంగా పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో సేవల కోసం కార్యాలయాలను ఆశ్రయించే అవసరం తగ్గనుంది.

సభ్యులకు కలిగే ప్రయోజనాలు
కొత్త మార్పులతో EPFO సేవలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారనున్నాయి. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వల్ల ఖాతా భద్రత పెరుగుతుంది. UMANG యాప్ ద్వారా UAN సేవలు సులభంగా పొందవచ్చు. అలాగే డెత్ క్లెయిమ్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.

ఏం చేయాలి?
EPFO సభ్యులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు, KYC సమాచారాన్ని తాజాగా ఉంచుకోవాలి. అలాగే UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని UAN సంబంధిత సేవలను వినియోగించుకోవడం మంచిది. కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లోని మార్పులను తెలుసుకుని వాటికి అనుగుణంగా ఖాతాను నిర్వహిస్తే భవిష్యత్తులో సేవలు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

 

 

వాకింగ్‌కు కొత్త వెర్షన్.. 'రకింగ్'.. వేగంగా బరువు తగ్గొచ్చట.. అసలేంటిది..

Walking
Walking

Rucking : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వాకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇటీవల ఫిట్‌నెస్ ప్రపంచంలో ‘రకింగ్ (Rucking)’ అనే కొత్త వ్యాయామ విధానం ట్రెండ్ అవుతోంది. సైనికులు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ పద్ధతి ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతి పాటించడం వల్ల సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. అసలేంటీ రకింగ్? దీనిని ఎలా చేయాలి?

రకింగ్ అంటే ఏమిటి?
రకింగ్ అనేది వీపుపై బరువున్న బ్యాక్‌ప్యాక్ ధరించి నడిచే వ్యాయామం. ఇందులో శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా బ్యాగ్‌లో బరువు పెట్టుకుని నిర్ణీత దూరం లేదా సమయం పాటు నడుస్తారు. ఇది కార్డియో వ్యాయామంతో పాటు కండరాలపై కూడా ప్రభావం చూపే ఫుల్ బాడీ వర్కౌట్‌గా పరిగణిస్తారు. సాధారణ వాకింగ్‌లో శరీర బరువును మాత్రమే మోస్తూ నడుస్తాం. కానీ రకింగ్‌లో అదనపు బరువును మోయాల్సి ఉండటంతో కాళ్లు, నడుము, వీపు, భుజాలు, పొత్తికడుపు కండరాలు మరింతగా పనిచేస్తాయి. దీనివల్ల శరీరం ఎక్కువ శక్తిని వినియోగించి ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అందుకే తక్కువ సమయంలోనే మంచి ఫిట్‌నెస్ ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మంచి వ్యాయామం
రకింగ్ వల్ల గుండె వేగం క్రమంగా పెరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల గుండె కండరాలు బలపడటంతో పాటు హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడి శరీరంలో ఆక్సిజన్ సరఫరా సమర్థవంతంగా జరుగుతుంది.

బరువు తగ్గడంలో ప్రభావవంతం
బరువు తగ్గాలనుకునే వారికి రకింగ్ మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. అదనపు బరువును మోస్తూ నడవడం వల్ల సాధారణ వాకింగ్‌తో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుదల వేగవంతమై బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడుతుంది. అదే సమయంలో కండరాల బలం కూడా పెరగడం దీని మరో ప్రత్యేకత.

ఎలా ప్రారంభించాలి?
మొదటిసారి రకింగ్ చేసే వారు భారీ బరువుతో ప్రారంభించకూడదు. వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణుల సూచన ప్రకారం శరీర బరువులో 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే బరువు ఉన్న బ్యాగ్‌తో ప్రారంభించడం మంచిది. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి 3 నుంచి 6 కిలోల బరువుతో మొదలు పెట్టవచ్చు. క్రమంగా శరీరం అలవాటు పడిన తర్వాత బరువును కొద్దికొద్దిగా పెంచుకోవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి
రకింగ్ చేసే సమయంలో నాణ్యమైన బ్యాక్‌ప్యాక్‌ను ఉపయోగించాలి. బరువు రెండు భుజాలపై సమానంగా పడేలా బ్యాగ్‌ను సర్దుకోవాలి. నడుస్తున్నప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి, సరైన భంగిమలో నడవడం అవసరం. మోకాళ్లు, నడుము లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే రకింగ్ ప్రారంభించాలి.

ఎవరికి అనుకూలం?
ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు, బరువు తగ్గాలనుకునే వారు, సాధారణ వాకింగ్‌ను మరింత సవాలుగా మార్చుకోవాలనుకునే వారికి రకింగ్ మంచి ఎంపిక. అయితే ప్రారంభంలో తక్కువ బరువుతో, తక్కువ దూరం నడిచి క్రమంగా వ్యాయామ తీవ్రతను పెంచుకుంటేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.