Homeఅంతర్జాతీయంIran Oil Sanctions Lifted: క్రూడ్ ఆయిల్ సెగతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్...

Iran Oil Sanctions Lifted: క్రూడ్ ఆయిల్ సెగతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్..

Iran Oil Sanctions Lifted: ఇది శుభవార్త. ముమ్మాటికీ ప్రపంచానికి ఉపశమనం కలిగించే వార్త. ధరల సెగతో అల్లాడుతున్న సగటు జీవికి జీవం పోసిన వార్త. ఇలా జరుగుతుందని.. ఇలా ఒక్కసారిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఈ పరిణామంతో ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. కొంతకాలంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ముడి చమరు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ కూడా పెరుగుతున్న నేపథ్యంలో […]

Iran Oil Sanctions Lifted: ఇది శుభవార్త. ముమ్మాటికీ ప్రపంచానికి ఉపశమనం కలిగించే వార్త. ధరల సెగతో అల్లాడుతున్న సగటు జీవికి జీవం పోసిన వార్త. ఇలా జరుగుతుందని.. ఇలా ఒక్కసారిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఈ పరిణామంతో ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

కొంతకాలంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ముడి చమరు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ కూడా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కరెన్సీల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల అన్ని దేశాలు వీపరితమైన ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆర్థికంగా పొదుపు పాటిస్తున్నాయి. అంతేకాదు చమురు ధరలు కూడా పెంచేస్తున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రపంచమున నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పేసింది. శాంతి చర్చల తర్వాత ఇరాన్ ఆయిల్ మీద అమెరికా విధించిన ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా తస్నీం న్యూస్ వెల్లడించింది. అయితే ఈ రిలీఫ్ శాశ్వతంగా ఉండాలని.. దీంతోపాటు మిగతా అంశాలు కూడా ఎత్తివేయాలని ఇరాన్ మీడియా అభిప్రాయపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ ఆంక్షలు తాత్కాలికంగా కాకుండా.. శాశ్వతంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు వేగం పుంజుకున్నాయి. లాభాల బాట పట్టాయి.

ఈ నిర్ణయం అమెరికా ఎప్పుడో తీసుకుంటే చాలా బాగుండేది. యుద్ధం చేసిన అమెరికా సాధించిన లక్ష్యాలు పెద్దగా కనిపించడం లేదు. పైగా అమెరికాకు తత్వం బోధపడింది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందువల్లే ఇరాన్ చమురు మీద కాంక్షలు తొలగించింది. తాత్కాలికంగానైనా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం.. భవిష్యత్ కాలంలో ప్రపంచ దేశాలకు అనేక రకాల మేళ్ళు చేకూర్చుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కు యుద్ధం వల్ల నష్టం ఎదురు కావడంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ప్రపంచ ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper