Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh: పారిపోతున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. వేటాడి పట్టుకున్న పోలీసులు.. వీడియో...

Jogi Ramesh: పారిపోతున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. వేటాడి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్..

Jogi Ramesh: మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వేటాడి వెంటాడి మరీ పట్టుకొని అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూస్తుంటే ఒక యాక్షన్ సినిమాని తలపిస్తుంది. బైక్ లో తన అనుచరుడితో కలిసి పారిపోతున్న జోగి రమేష్ ని, పోలీసులు జీప్ లో వచ్చి ఆపడం , […]

Jogi Ramesh: మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వేటాడి వెంటాడి మరీ పట్టుకొని అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూస్తుంటే ఒక యాక్షన్ సినిమాని తలపిస్తుంది. బైక్ లో తన అనుచరుడితో కలిసి పారిపోతున్న జోగి రమేష్ ని, పోలీసులు జీప్ లో వచ్చి ఆపడం , ఆపినప్పటికీ కూడా ఆగకుండా జోగి రమేష్ పారిపోవడం తో పోలీసులు అతన్ని ఆపి , ఈడ్చుకొని జీపు ఎక్కించాల్సి వచ్చింది. ఎందుకు అరెస్ట్ చేశారు వంటి వివరాలు పూర్తిగా బయటకు రాలేదు కానీ , పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం పైన మాత్రం వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు . పోలీసులు రౌడీలు లాగా ప్రవర్తిస్తున్నారని , ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం లో భాగం గానే జోగి రమేష్ ని అక్రమంగా అరెస్ట్ చేసారని అంటున్నారు. అయితే జోగి రమేష్ అధికారం లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను చూస్తే , సామాన్యులకు కూడా ఇతని మీద జాలి కలగదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై , మంత్రి నారా లోకేష్ లపై గతం లో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి మరీ. పవన్ కళ్యాణ్ ని అయితే పిచ్చి కుక్క అంటూ సంబోధించాడు , అదే విధంగా అంబటి రామ్ బాబు అరెస్ట్ అయినప్పుడు కూడా నారా లోకేష్ పై నోరు పారేసుకున్నాడు. ఇలా నోరు పారేసుకున్నందుకే కార్యకర్తలు వేసిన కేసుల కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper