HomeజాతీయంIT Employee Quits Job: ఐటీ జాబ్ మానేసి ఆటో నడుపుతోంది.. ప్రశాంతంగా బతుకుతోంది..

IT Employee Quits Job: ఐటీ జాబ్ మానేసి ఆటో నడుపుతోంది.. ప్రశాంతంగా బతుకుతోంది..

IT Employee Quits Job: ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐదు అంకెల జీతం అన్న మాటే గాని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. రాత్రికి పగలుకు తేడా లేకుండా పనిచేయాలి. ఆరోగ్యం పాడైతే అంతే సంగతులు. పింకు స్లిప్ చేతిలో పెట్టి వెళ్లిపో అంటూ ఎగ్జిట్ చూపిస్తుంటారు. ఇది కొత్తకాలంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితి. ఐటీ లో ఉన్న దారుణమైన పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా […]

IT Employee Quits Job: ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐదు అంకెల జీతం అన్న మాటే గాని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. రాత్రికి పగలుకు తేడా లేకుండా పనిచేయాలి. ఆరోగ్యం పాడైతే అంతే సంగతులు. పింకు స్లిప్ చేతిలో పెట్టి వెళ్లిపో అంటూ ఎగ్జిట్ చూపిస్తుంటారు. ఇది కొత్తకాలంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితి.

ఐటీ లో ఉన్న దారుణమైన పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది అందులోనే పనిచేస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. నిరంతరంగా ఉండే పని ఒత్తిడి.. తలనొప్పి.. కార్పొరేట్ వ్యవహారాలు ఐటి ఉద్యోగులకు కుటుంబ సంబంధాలను దూరం చేస్తున్నాయి.. దీంతో వారు మర మనుషులుగా మారిపోతున్నారు. సంపాదన సంగతి దేవుడెరుగు. కుటుంబ బంధాలకు.. ఇతర వ్యవహారాలకు దూరమవుతున్నారు. దీనివల్ల వారి మీద ఒత్తిడి పెరిగిపోయి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్న ఐటీ కి ఇండస్ట్రీలో ఉప మహిళ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తుంది.. అంతేకాదు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐటీ విభాగంలో పనిచేసిన ఆ మహిళ స్టోరీని ఓ మహిళా వ్యాపారవేత్త సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆ మహిళ దాదాపు 9 సంవత్సరాలు పాటు ఐతే ఇండస్ట్రీలో మేనేజర్ గా పని చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దానిని ఆమె అనుభవించింది. ఎంత పని చేసినా సరే ఇంకా ఒత్తిడి ఉంటున్న నేపథ్యంలో తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత తను సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుంది.. ఒక ఆటోను పర్చేజ్ చేసింది. పురుషులతో పాటుగా తాను కూడా ఆటోను నడుపుతోంది. బిందాస్ గా నెలకు 60 వేలు వెనకేస్తోంది. గత ఉద్యోగంలో జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో ఒత్తిడి లేకుండా… సాఫీగా జీవితం సాగిపోతుందని… ఫ్యామిలీకి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించింది. ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయని ఈమె చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper