Home Blog Page 207

భారత భూభాగాలు ఆక్రమించాం.. నేపాల్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

Balen Shah comments on India
Balen Shah comments on India

Balen Shah comments on India: భారత్‌ చుట్టూ శత్రు దేశాలే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా మనపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనకు మిత్ర దేశం ఏదైనా ఉంది అంటే అది నేపాల్‌. ఇరు దేశాల సరిహద్దులో కూడా పెద్దగా ఆంక్షలు ఉండవు. ప్రీగా రాకపోకలు సాగుతాయి. అయితే ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయినే పాప్‌ సింగర్‌ బాలేంద్రషా చైనాకు తొత్తుగా మారుతున్నాడు. అయినా భారత్‌ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ తాజాగా భారత్‌తో కెలికి కయ్యం పెట్టుకునే పని మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా నేపాల్‌ పార్లమెంట్‌లో ఆచన చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్లో కొత్త చర్చకు దారితీశాయి. లింపియాధురా, లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలపై చర్చ సందర్భంగా, ‘‘భారత్‌ నేపాల్‌ భూభాగాన్ని ఆక్రమించిందని, నేపాల్‌ కూడా భారత్‌ భూభాగాన్ని అనేక చోట్ల ఆక్రమించింది’’ అని చెప్పారు. ప్రధాని అయ్యాక తనకు ఇటీవలే తెలిసిన విషయమని, ఇరు దేశాలు వాస్తవాలను అధ్యయనం చేసి స్నేహపూర్వకంగా కూర్చొని పరిష్కరించాలని సూచించారు.

బాలెన్ షా వ్యాఖ్యలపై దుమారం..
ఈ వ్యాఖ్యలు నేపాల్‌లోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. విపక్ష నాయకులు ఆధారాలు కోరుతూ, ప్రకటనను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నేపాల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తర్వాత స్పష్టీకరణ ఇచ్చి, ఇది ‘‘నో–మ్యాన్స్‌ ల్యాండ్‌’’ ప్రాంతాలు (ముఖ్యంగా సుస్తా వంటి నదీ ప్రవాహ మార్పుల వల్ల) సంబంధించినదని, ముఖ్య భూభాగ దావాలను మార్చేది కాదని చెప్పింది.

చారిత్రక, రాజకీయ నేపథ్యం..
1816 సుగౌలి ఒప్పందం ఆధారంగా కాలి (మహాకాలి) నది సరిహద్దుగా నిర్ణయించబడింది. కానీ నది మూలం ఎక్కడ ఉందనే విషయంలో అస్పష్టత ఉంది. నేపాల్‌ లింపియాధురా వరకు తన భూభాగమని వాదిస్తుంటే, భారత్‌ కాలాపాని, లిపులేఖ్‌ను ఉత్తరాఖండ్‌లో భాగంగా చూస్తుంది. 2020లో నేపాల్‌ కొత్త రాజకీయ మ్యాప్‌ విడుదల చేసి వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇటీవల 2026లో భారత్‌–చైనా మధ్య లిపులేఖ్‌ ద్వారా కైలాస్‌ మానసరోవర్‌ యాత్ర పునరుద్ధరణ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నేపాల్‌ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది.

ర్యాపర్‌ నుంచి రాజకీయ నేతగా..
ఇదిలా ఉంటే బాలేంద్ర షా రాపర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారి, 2025 జెన్‌–జెడ్‌ ఉద్యమాల తర్వాత మార్చి 2026లో అతి యువ ప్రధానిగా ఎన్నికయ్యారు. అతని స్వతంత్ర, యాంటీ–ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇమేజ్‌ ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తుంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా నిజాలను అంగీకరించి ముందుకు వెళ్లాలనే ధోరణి.

అవకాశమా లేదా సవాలా?
షా వ్యాఖ్యలు వివాదాన్ని ఏకపక్షంగా చూడకుండా, పరస్పర గుర్తింపుతో సమస్యను పరిష్కరించాలనే యావర్‌ ఆఫ్‌ రియలిజంను ప్రతిబింబిస్తాయి. సాటిలైట్‌ ఇమేజరీ, జాయింట్‌ సర్వే, చారిత్రక ఆధారాలు, నిపుణుల కమిటీల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, మానవ సంబంధాలు బలమైనవి. ఇవి ఉద్రిక్తతలను తగ్గించడానికి సహాయపడతాయి.

సరిహద్దు వివాదాలు పొరుగు దేశాల మధ్య సహజం, కానీ వాటిని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం రెండు దేశాల ప్రజలకు మేలు చేయదు. బాలేంద్ర షా వ్యాఖ్యలు ఒక వాస్తవిక మలుపును సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం కోసం ద్విపాక్షిక సంయుక్త కమిటీలను పునరుద్ధరించి, నమ్మకం, పారదర్శకతతో ముందుకు వెళ్లడం రెండు దేశాల బాధ్యత. ఇది మాత్రమే స్థిరమైన స్నేహం మరియు సహకారానికి దారి తీస్తుంది.

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కన్నా తోటమాలే నయం.. వీడియో వైరల్‌

Gardener salary in USA
Gardener salary in USA

Gardener salary in USA: అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలని సంపన్నుడు కావాలని చాలా మంది కలలు కంటారు. అందుకే చాలా మంది చదువు కోవడానికి కూడా అమెరికా వెళ్తుంటారు. తర్వాత అక్కడే కొలువులు సంపాదించి తర్వాత అక్కడే స్థిరపడడంపై దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే వెళ్లే అమెరికాకు ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు కూడా వెళ్తున్నారు. అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఎన్నారై మహిళ చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటేనే అన్ని సమస్యలు పరిష్కారమనుకోవద్దు. గడ్డి కత్తిరించే పని చేస్తే టెక్‌ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చు’’ అని ఆమె వివరించారు. వేసవిలో సొంతంగా పని చేస్తే గంటకు 100 డాలర్లు (సుమారు రూ.8,500), నెలకు రూ.5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సాధ్యమని, ఇతరుల వద్ద పని చేసినా రూ.4 లక్షల వరకు వస్తాయని వివరించింది. చలికాలంలో మంచు తొలగించే (స్నో రిమూవల్‌) పనులు కూడా ఇందులో భాగమని వెల్లడించింది. ఈ వీడియో యువత, ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం ఆశపడేవారి మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

లాన్‌ కేర్‌ బిజినెస్‌తో అంత సపాదనా?
అమెరికాలో లాన్‌ కేర్‌ (గడ్డి కత్తిరించడం, ల్యాండ్‌ స్కేపింగ్‌) ఒక పెద్ద పరిశ్రమ. ఇది సీజనల్‌ బిజినెస్‌ – వేసవిలో డిమాండ్‌ ఎక్కువ. చాలా మంది సొంత బిజినెస్‌ ప్రారంభించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సొంతంగా బిజినెస్‌ చేస్తే గంటకు 50 నుంచి 100 డాలర్లకుపైగా వసూలు చేయవచ్చు. సగటు లాన్‌ కేర్‌ బిజినెస్‌ యజమానుల సంవత్సరాదాయం సుమారు 1,28,000 డాలర్లు (రూ.1.1 కోట్లు) ఉంటుంది. టాప్‌ 10 శాతం వారు ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. చిన్న స్థాయిలో మొదలుపెడితే సంవత్సరానికి 45 వేల నుంచి 60 వేల డాలర్లు(రూ.40–50 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. లాన్‌ కేర్‌తోపాటు చలికాలంలో స్నో రిమూవల్‌ సర్వీస్‌ జోడించడం ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం కొనసాగుతుంది. ఇది లేబర్‌ ఇంటెన్సివ్‌ పని కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ

సాఫ్ట్‌వేర్‌ కన్నా బెటర్‌..
భారతీయులు అమెరికాలో చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల సగటు జీతం సంవత్సరానికి 80 వేల నుంచి 1,50 లక్షల డాలర్లు(రూ.70 లక్షలు నుంచి 1.3 కోట్లు) మధ్య ఉంటుంది. కానీ ఇందులో ట్యాక్స్, హౌస్‌ రెంట్, హెల్త్‌ ఇన్సూరెన్స్, కారు, పెట్రోల్‌ వంటి ఖర్చులు ఎక్కువ. లాన్‌ కేర్‌ బిజినెస్‌లో స్వంత యజమానిగా ఉంటే స్వేచ్ఛ ఎక్కువ, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీ చేతుల్లో ఉంటుంది. కానీ స్థిర జీతం లేదు, వాతావరణం, కస్టమర్లు, పోటీపై ఆధారపడి ఆదాయం మారుతుంది. శారీరక శ్రమ, బయట పని, మెషినరీ నిర్వహణ ఉండాలి.

టెక్‌ ఉద్యోగుల సైడ్‌ బిజినెస్‌..
చాలా మంది టెక్‌ ఉద్యోగులు సైడ్‌ బిజినెస్‌గా లాన్‌ కేర్‌ మొదలుపెడుతున్నారు. కొందరు పూర్తి సమయం మారి మంచి లాభాలు పొందుతున్నారు. ఈ బిజినెస్‌లో విజయం కోసం మార్కెటింగ్‌ (లోకల్‌ ఫ్లైయర్లు, నెక్ట్స్‌ డోర్‌ యాప్, గూగుల్‌ మ్యాప్స్‌), నాణ్యతైన సర్వీస్‌ మరియు రిపీట్‌ కస్టమర్లు. సీజనల్‌ సర్వీసులు అందిస్తున్నారు.

ఈ వైరల్‌ వీడియో ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది – ఉద్యోగం అంటే కేవలం ఏసీ క్యాబిన్, హై సాలరీ మాత్రమే కాదు. కష్టపడి, స్వంతంగా బిజినెస్‌ చేస్తే సంపాదన, సంతృప్తి ఎక్కువ కావచ్చు. అయితే, అందరికీ ఇది సరిపోదు. కొందరికి టెక్‌ ఉద్యోగాల్లో స్థిరత్వం, గ్రోత్‌ ఇష్టం. పని ఏదైనా చేయాలంటే గౌరవంగా, నైపుణ్యంతో చేయాలి. అమెరికా వంటి దేశాల్లో లేబర్‌ షార్టేజ్‌ వల్ల ఇలాంటి సర్వీసులకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది.

కప్పు గెలిచిన ఆర్సీబీకే కాదు.. ఈ టీంలకు కూడా కోట్ల డబ్బు.. దేనికి ఎంతంటే..

RCB IPL prize money 2026
RCB IPL prize money 2026

RCB IPL prize money 2026: బెంగళూరు రెండవసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. తద్వారా ఐపిఎల్ హిస్టరీలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఐదేసి సార్ల చొప్పున ముంబై, చెన్నై జట్లు ట్రోఫీలు గెలిచాయి. కోల్కతా జట్టు కూడా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో 2008 నుంచి మొదలు పెడితే 2024 వరకు అనేక సందర్భాలలో ఫైనల్ దాకా వచ్చినప్పటికీ బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. 2025లో మాత్రం పంజాబ్ జట్టు మీద గెలిచి ట్రోఫీని అందుకుంది.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విలువ మరింత పెరిగింది. విజేత జట్టుకు బిసిసిఐ 20 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తుంది.. ఈ ఆదాయం మాత్రమే కాకుండా.. ప్రకటనలు.. టికెట్లు.. మైదానాలలో బ్రాండ్ ప్రమోషన్లు.. ప్రసార హక్కులలో వాటా.. మిగతా ఒప్పందాలు లెక్కేసుకుంటే యాజమాన్యాలకు భారీగానే ఆదాయం వచ్చింది. ఈ జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 595 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 552,రాజస్థాన్ రాయల్స్ 549, కోల్కతా నైట్ రైడర్స్ 538, పంజాబ్ కింగ్స్ 534, లక్నో 512 కోట్లు, ముంబై ఇండియన్స్ 501, గుజరాత్ టైటాన్స్ 498, ఢిల్లీ క్యాపిటల్స్ 486, సన్రైజర్స్ హైదరాబాద్ 495 కోట్ల ఆదాయాన్ని సంపాదించాయి.

ఈ స్థాయిలో ఆదాయం రావడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రాఫిటబుల్ స్పోర్ట్స్ లీగ్ గా ఐపీఎల్ కొనసాగుతోంది. ఐపీఎల్ 20008 లో మొదలైంది. ఇప్పటివరకు విజయవంతంగా 19 సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రారంభంలో వేల కోట్లుగా ఉన్న ఐపిఎల్ విలువ.. ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లన్న దాటేసింది. బ్రాండ్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయం అంచనాలకు మించి వస్తోంది.

గతంలో చైనా కంపెనీలు ఐపీఎల్ ట్రోఫీని స్పాన్సర్ చేసేవి. ఇప్పుడు టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అనేక కార్పొరేట్ కంపెనీలు ప్రకటన కర్తలుగా ఉన్నాయి. కంపా నుంచి మొదలు పెడితే గూగుల్ వరకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. బ్రాండ్ విలువ పెరగడంతో మార్కెటింగ్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. బీసీసీఐ మీద కనక వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు.. ఇతర టోర్నీలు నిర్వహణలో వచ్చే ఆదాయం కంటే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయమే బీసీసీఐకి అధికంగా ఉందంటే.. ఐపీఎల్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చిరు లీక్స్.. బాబీ తో చేసే మూవీ నుంచి మరో లీక్ రాబోతోందా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Bobby movie latest update: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో తన సినిమాలకు సంబంధించిన భారీ లీకులనైతే ఇస్తున్నాడు. గతంలో ‘ఆచార్య’ సినిమా టైటిల్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశాడు. ఒక ఈవెంట్ కి హాజరైన చిరంజీవి స్టేజ్ మీద మాట్లాడుతూ సినిమా టైటిల్ ని ఆచార్యగా ఫిక్స్ చేశాము తొందరలోనే అనౌన్స్ మెంట్ రాబోతుంది అంటూ ఆయన చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి చిరంజీవి లీకులు ఇస్తున్నాడు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించిన కొంత స్టోరీని కూడా చిరంజీవి ఒకానొక సందర్భంలో లీక్ చేశాడు. మొత్తానికైతే చిరు లీక్స్ అంటూ ఏదో ఒక విషయంలో ఆయన ఒక సినిమాకు సంబంధించిన లీక్ కానైతే ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు బాబీ సినిమాకు సంబంధించిన లీక్ ని కూడా వదలబోతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి నుంచి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటి అంటే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏంటి దాని గోల్ ఏంటి అనేది చిరంజీవి తొందర్లోనే లీక్ చేయబోతున్నాడట.

ఇక ఈ సినిమా టైటిల్ ని కూడా చిరంజీవి అనౌన్స్ చేయించబోతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి అభిమానులు సైతం చిరు నుంచి ఎప్పుడు లీక్స్ వస్తాయా ఎప్పుడు ఆ మూవీ మీద హైప్ పెంచుకుందామా అనే ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. దీని వల్ల చిరంజీవి కూడా దాని యొక్క ఇంటెన్స్ ను తెలుసుకొని ఆ సినిమాకు సంబంధించిన లీక్ ని వదలడంలో తను చాలా వరకు ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా సినిమాలోని కొన్ని విషయాలను జనాల్లోకి ఓపెన్ గా చెబితే బాగుంటుంది. అలాగే కొన్ని విషయాలను సినిమాల్లోనే చూపించాలి. అలాంటి వాటిని లీక్ చేయకూడదు. ఇక చిరంజీవి మాత్రం కొన్ని సందర్భాల్లో అలాంటి సెన్సిబుల్ విషయాలను కూడా లీక్ చేస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

ఇక ఏది ఏమైనా కూడా సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపడంలో దర్శకుడు తీసుకునే బాధ్యత చాలా గొప్పది దానిని చిరంజీవి ఎప్పుడు అంగీకరిస్తూ ఉంటాడు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ లేకపోతే సినిమా అనేది అంత ఎఫెక్టివ్ గా రాదనే విషయాన్ని కూడా చిరంజీవి నమ్ముతూ ఉంటాడు. కానీ అనుకోకుండా తన నుంచి వచ్చే లీక్స్ కి తను బాధ్యుడిని కానని కూడా పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన రచ్చ.. స్టెప్పులు వైరల్

Virat Kohli viral dance steps
Virat Kohli viral dance steps

Virat Kohli viral dance steps: బెంగళూరు మరోసారి సత్తా చాటింది. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ఆ జట్టు.. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. తద్వారా వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు క్రీడాకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

బెంగళూరు విజయంలో విరాట్ కోహ్లీ (75) కీలకపాత్ర పోషించాడు
. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసి బెంగళూరు జట్టు ఆశల మీద నీళ్లు చల్లాడు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడ్డాడు. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉన్న గుజరాత్ జట్టుకు చుక్కలు చూపించాడు. గత సీజన్లో కూడా పంజాబ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్ఫూర్తి దాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. తోటి ప్లేయర్లు విఫలమైనప్పటికీ అతడు మాత్రం.. గట్టిగా నిలబడ్డాడు.. దీంతో గిల్ జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని రజత్ పాటిదర్ బృందం సులభంగా చేదించింది. క్వాలిఫైయర్ లో గుజరాత్ జట్టును ఓడించిన బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టును సొంతవేదికపై ఓడించి ట్రోఫీని అందుకుంది.

2008లో ఐపీఎల్ మొదలైతే.. చాలా సందర్భాల్లో బెంగళూరు జట్టు ఫైనల్ దాకా వచ్చింది. కానీ ట్రోఫీలను అందుకోలేకపోయింది. గత సీజన్లో మాత్రం పాత పద్ధతికి చరమగీతం పాడుతూ.. ట్రోఫీ అందుకుంది. ఈ సీజన్లో కూడా ప్రారంభం నుంచి స్థిరమైన ఆట తీరుకొనసాగిస్తూ ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా ఐపీఎల్లో బెంగళూరు తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకుంది.

బెంగళూరు సాధించిన విజయం తర్వాత విరాట్ కోహ్లీ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. బ్యాండ్ చప్పుడుకు అనుగుణంగా డ్యాన్స్ వేశాడు. ఆ సమయంలో భార్య అనుష్క శర్మ తన వెంట ఉండగా.. ఆమెను కూడా తనతో పాటు డాన్స్ చేయాలని కోరాడు. భర్త జోరు చూసి అనుష్క శర్మ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ అవుతోంది.

బ్యాటరీ పర్ఫామెన్ష్ కోరుకునేవారికి సూపర్ ఫోన్..

Vivo S60 battery performance
Vivo S60 battery performance

Vivo S60 battery performance: Vivo మొబైల్ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా Vivo S60, Vivo S60 Vitality Editionలను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ ను ఇవ్వనున్నాయి. ఈ మొబైల్ సిరీస్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

ఈ ఫోన్‌లోని అతి ముఖ్యమైన ఫీచర్ దీని బ్యాటరీ. సాధారణంగా మిడ్ రేంజ్ ఫోన్లలో కనిపించే 5,000mAh బ్యాటరీ కంటే ఇందులో ఏకంగా 7,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ బ్యాటరీకి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, ఇంత పెద్ద బ్యాటరీని కూడా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Vivo S60 సిరీస్ చాలా ప్రీమియం లుక్‌తో, కోల్డ్-కార్వ్డ్ గ్లాస్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ తో అందిస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో అత్యంత స్మూత్ అనుభూతిని ఇస్తుంది. మెరుగైన భద్రత కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. అలాగే, ఈ ఫోన్ IP69, IP68 రేటింగ్‌తో ఉండడం వల్ల ధూళి, నీటి నుంచి పూర్తి రక్షణను కలిగి ఉంటుంది.

స్టాండర్డ్ Vivo S60 మోడల్ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇది గేమింగ్ , మల్టీ టాస్కింగ్ కోసం అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. మరోవైపు, వైటాలిటీ ఎడిషన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో వస్తుంది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS 6పై నడుస్తాయి. అలాగే ఇవి 16GB RAM నుంచి 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

కెమెరా విభాగంలో Vivo S60 తన ప్రత్యేకతను చాటుకుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ , 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అందించారు. అయితే వైటాలిటీ ఎడిషన్‌లో పెరిస్కోప్ లెన్స్ ఉండదు, కానీ మిగిలిన కెమెరా ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి.

చైనాలో Vivo S60 ధర సుమారు 3,599 యువాన్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.50,000) నుంచి ప్రారంభమవుతుండగా,..వైటాలిటీ ఎడిషన్ సుమారు 2,899 యువాన్ల (సుమారు రూ.41,000) ధరతో మొదలవుతుంది. ఈ ఫోన్లు జూన్ 3, 2026 నుండి చైనాలో విక్రయానికి రానున్నాయి. భారత మార్కెట్‌లోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.

‘మన్ కీ బాత్’లో మోదీ చెప్పిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ అంటే ఏంటీ..

Ek Bharat Shreshtha Bharat
Ek Bharat Shreshtha Bharat

Ek Bharat Shreshtha Bharat: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని Narendra Modi తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎక్కువగా నీళ్లు తాగాలని, మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. అదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన లస్సీ, సత్తూ షర్బత్, పానకం, మజ్జిగ వంటి సంప్రదాయ పానీయాలను ప్రస్తావిస్తూ వాటిని వేసవిలో తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” అనే భావనను కూడా గుర్తు చేశారు. మోదీ ఇలా ఎందుకు చెప్పాడు? దీని అర్థం ఏంటీ?

‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ అంటే ఏమిటి?
‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” అంటే’ ఒకే భారత్ అత్యుత్తమ భారత్ అని అర్థం. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు, కళలు, జీవన విధానాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. వివిధ రాష్ట్రాల ప్రజలు ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవడం ద్వారా దేశ సమగ్రత మరింత బలపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 125వ జయంతి సందర్భంగా 2015లో కేంద్ర ప్రభుత్వం “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో జత చేసి భాష, సాహిత్యం, పర్యాటకం, విద్య, కళలు, ఆహార సంస్కృతుల పరస్పర మార్పిడికి ప్రోత్సాహం అందిస్తున్నారు.

పానీయాలకు దీనికి సంబంధం ఏమిటి?
ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న లస్సీ, సత్తూ షర్బత్, పానకం, మజ్జిగ వంటి పానీయాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలను ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు పంజాబ్‌లో లస్సీ, బీహార్‌లో సత్తూ షర్బత్, దక్షిణ భారత రాష్ట్రాల్లో మజ్జిగ, తెలుగు రాష్ట్రాల్లో పానకం విస్తృతంగా వినియోగిస్తారు. ఒక ప్రాంతానికి చెందిన ఆహారం లేదా పానీయం మరో ప్రాంత ప్రజలు కూడా ఆస్వాదించడం ద్వారా దేశ వైవిధ్యాన్ని గౌరవించినట్లవుతుందని ఆయన సూచించారు.

మోదీ ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు?
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సహజమైన, సంప్రదాయ పానీయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వాటి ద్వారా దేశ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్థానికంగా లభించే పానీయాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా భారతీయ సంప్రదాయ జ్ఞానానికి కూడా ప్రతీకలని ఆయన వివరించారు.

జాతీయ ఐక్యతకు ప్రతీక
‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. దేశంలోని ప్రతి ప్రాంతం ప్రత్యేకతను గౌరవించడం, ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకోవడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం అనే గొప్ప సందేశాన్ని ఇది అందిస్తుంది. మోదీ ప్రస్తావించిన సంప్రదాయ పానీయాలు కూడా ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని, ఒక రాష్ట్రపు రుచిని మరో రాష్ట్ర ప్రజలు ఆస్వాదించినప్పుడు భారత ఐక్యత మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అందువల్ల ప్రధాని మోదీ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడమే కాకుండా, భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సంప్రదాయ పానీయాలను ప్రోత్సహిస్తూ “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” భావనను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. భాషలు, సంస్కృతులు, ఆహారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనమంతా ఒకే భారతదేశానికి చెందినవారమనే సందేశమే ఈ కార్యక్రమం సారాంశం.

ఏపీలో రాజ్యసభ.. బిజెపి మాస్టర్ ప్లాన్!

Andhra Pradesh Rajya Sabha Elections

Andhra Pradesh Rajya Sabha Elections : ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో కూటమికి ఏకపక్ష బలం ఉంది. అందుకే ఆ నాలుగు పదవి కూటమి దక్కించుకోనుంది. అయితే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాజ్యసభలో బిజెపికి తగినంత బలం కోసం.. గత రెండేళ్లలో రెండు పదవులను వదులుకొంది తెలుగుదేశం. ఈసారి మాత్రం జనసేనకు ఒక సీటు ఇచ్చి.. మిగతా మూడు పదవులను తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బిజెపి సైతం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవి కోసం చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

* మిత్రుడి రూపంలో ఒత్తిడి..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇందులో 11 పదవులను నేరుగా బిజెపి సొంతం చేసుకోనుంది. మిగతా ఎన్డీఏ పక్షాలు మరో ఆరు పదవులు సొంతం చేసుకుంటాయి. అయితే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సైతం రాజ్యసభ పదవులు కోరుకుంటుంది బిజెపి. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక పదవి కావాలని చంద్రబాబుపై ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది. కానీ అది కూడా మిత్రుడి రూపంలోనే. ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవే గౌడ కు అవకాశం కల్పించాలన్నది బిజెపి ఆలోచన. ఆయన కాకపోతే.. తమిళనాడు నేత అన్నామలైకు కానీ.. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు కానీ ఛాన్స్ ఇవ్వాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* సదానంద గౌడ వైపు మొగ్గు
కర్ణాటక నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అక్కడ మాజీ ప్రధాని దేవే గౌడ్ ఉన్నారు. ఆయన కుమారుడు ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈసారి ఎన్డీఏ తరఫున కర్ణాటక నుంచి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే బిజెపి హై కమాండ్ మాత్రం సదానంద గౌడ వైపు మొగ్గు చూపుతోంది. అందుకే ఏపీ నుంచి చంద్రబాబును ఒప్పించే బాధ్యతను కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామిని అప్పగించింది. ఒకవేళ చంద్రబాబును ఒప్పిస్తే కర్ణాటక నుంచి దేవే గౌడ కు ఒప్పుకొని.. దాని బదులు ఏపీలో బిజెపి ఒకటి తీసుకుని.. అన్నమలైకు కానీ.. మందకృష్ణ మాదిగకు కానీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఎలాగైనా ఏపీ నుంచి ఒక పదవి కోరుకుంటుంది బిజెపి. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.

రిషబ్ శెట్టి వెంట పడుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు...

Rishab Shetty Comments On Ranveer Singh
Rishab Shetty Comments On Ranveer Singh

Rishab Shetty Bollywood : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి…హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇక నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకున్న ఆయన డైరెక్టర్ గా పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు కాంతార, కాంతార చాప్టర్ వన్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే బాలీవుడ్ హీరోలు కొంతమంది రిషబ్ శెట్టి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ లాంటి నటుడు సైతం రిషబ్ శెట్టి డైరెక్షన్లో నటించాలని ఉందని చెప్పారు. ఇక మొత్తానికైతే రిషబ్ శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతోనే తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అక్షయ్ కుమార్ తన సినిమాలో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పాన్ ఇండియాలో సౌత్ సినిమా ఇండస్ట్రీ సత్తా చాటుకోవడం అలాగే మన దర్శకులు సైతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను సాధించడం చూస్తున్న బాలీవుడ్ కి నిద్ర పట్టడం లేదు.

అందుకే మన హీరోలతో సినిమాలను చేయడం మన దర్శకులతో మూవీస్ ని తెరకెక్కించి సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్నాడు…ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటేనే పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు సౌత్ సినిమా దర్శకులతోనే సినిమాలు చేయడం గమనార్హం…అక్కడ హీరోలందరు కూడా డీలా పడిపోయారు.

అక్కడి దర్శకులైతే ఒక సక్సెస్ ని కూడా సాధించడం లేదు. మన దర్శకులకు, హీరోలకు, మన సినిమాలకు డిమాండ్ పెరిగింది… మొత్తానికైతే సౌత్ సినిమా ఇండస్ట్రీ గొప్పతనం ఏంటో ఇప్పుడు బాలీవుడ్ వాళ్లకు తెలిసి వచ్చింది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

దేవినేని అవినాష్ భవిష్యత్ ను సెట్ చేసిన జగన్

devineni avinash
devineni avinash

Devineni Avinash : జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టారు. యువ నేతలను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పై జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం వైసీపీకి చిక్కలేదు. రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. కానీ వారు విముఖత చూపడంతో యువనేత దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.. అయితే ఈ నిర్ణయం పై అవినాష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నట్లు సమాచారం.

* మూడుసార్లు ఓటమి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2014లో ఓ పారిశ్రామికవేత్తతో పోటీ చేయించారు. కానీ టిడిపి అభ్యర్థి కేశినేని నాని గెలిచారు. 2019లో సైతం మరో పారిశ్రామికవేత్తను రంగంలోకి దించారు. అయినా సరే వర్కౌట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీంచింది కానీ.. విజయవాడలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. మళ్లీ నాని గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. అయినా ఫలితం లేకపోయింది. టిడిపి అభ్యర్థి కేసినేని శివనాథ్ గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు.

* కమ్మ సామాజిక వర్గం అధికం..
విజయవాడ పార్లమెంట్ సీటు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం వారికి వరిస్తూ వచ్చింది. ఇక్కడ బీసీలను ప్రయోగించాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. కానీ అది సాధ్యపడలేదు. అందుకే కొడాలి నాని తో పాటు వల్లభనేని వంశీ మోహన్ లను పిలిచారు. విజయవాడ నుంచి పోటీ చేయించాలని సూచించారు. అందుకు వారు విముఖత చూపారు. అందుకే ఆయన దృష్టి దేవినేని అవినాష్ పై పడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అవినాష్. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ప్రస్తుతం జగన్ వెంట చాలా చురుగ్గా తిరుగుతున్నారు. అందుకే ఈసారి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు అవినాష్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. దీనిపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ కావడంతో ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

సూపర్ స్టార్ కృష్ణ - బాలయ్య మధ్య గొడవ జరగడానికి కారణం ఎవరు..?

Balakrishna Krishna controversy

Balakrishna Krishna controversy : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటుల మధ్య విభేదాలు రావడం అనేది సర్వసాధారణం…ఇండస్ట్రీలో అందరు కలిసి సినిమాలను చేస్తూ ఉంటారు. కాబట్టి సినిమాల రిలీజ్ ల విషయంలో గాని వాళ్ళ స్టార్ డమ్ విషయంలో గాని ఒకరితో ఒకరు ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఈ పోటీ కాస్త శృతిమించితే మాత్రం వాళ్ల మధ్య విభేదాలు తలెత్తి ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో చాలామంది హీరోల మధ్య కోల్డ్ వార్స్ నడుస్తుంటాయి. పైకి హీరోలందరు నవ్వుతూ కనిపించినప్పటికి లోపల మాత్రం వాళ్ళు ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటారు. ఇదంత అమ్మ బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు చాలా క్లోజ్ గానే ఉంటున్నారు. ఒకరి మీద ఒకరు విషం కక్కుకునే పరిస్థితులైతే ఇప్పటివరకు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ కి, కృష్ణకి మధ్య గతంలో కొన్ని విభేదాలైతే తలెత్తాయి.

అవి ఏ కారణంగా వచ్చాయి. వాళ్ళు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నారో తెలియదు కానీ ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. ఇక బాలయ్య బాబు, కృష్ణ మధ్య కూడా ఒక చిన్న గొడవ అయితే జరిగిందని అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. బాలయ్య బాబు సుల్తాన్ సినిమాలో కృష్ణ కూడా నటించాడు.

కృష్ణ డిఫరెంట్ పాత్రను పోషించడంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. కానీ బాలయ్య బాబు కృష్ణ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం మీద స్పందించి వాళ్ళ మీద ఎలాంటి విభేదాలు రాలేదని వాళ్ళు పలు సందర్భాల్లో చెప్పారు…

అయినప్పటికి సినిమా మీద ప్రమోషన్స్ పెంచడానికి సినిమా యూనిట్ ఇలాంటి ఒక వార్తను స్ప్రెడ్ చేసింది అంటూ ఆ తర్వాత కాలంలో కొంతమంది దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఏది ఏమైనా కూడా సుల్తాన్ సినిమా ప్లాప్ అవ్వడంతో బాలయ్య బాబు క్రేజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది…

పవన్ కళ్యాణ్.. తెలంగాణలో పెద్ద ప్లాన్.. అందరికీ ఇదో హెచ్చరిక

Pawan Kalyan sensational tweet : తెలంగాణ ఆవిర్భావం రోజున..పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ వైరల్!
Telangana Formation Day

Pawan Kalyan Telangana plan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కెలికితే మామూలుగా ఉండదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ విషయం తెలుసు. ఆది నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో ఆ పార్టీ కొంచెం అతిగా ప్రవర్తించింది. లెక్కలేని తనాన్ని చూపింది. దానికి మూల్యం చెల్లించుకుంది. అయితే నిండా మునిగాక.. చలి ఎందుకు అన్న మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ను శాశ్వత శత్రువు అన్నట్టు చూస్తోంది. మరోవైపు తెలంగాణలో జనసేన పెద్దగా రాజకీయాలు చేయడం లేదు. కానీ ఆ పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా వరకు యాక్టివ్ గా పని చేస్తూ వస్తున్నారు. కానీ పవన్ పై రాజకీయ కుట్రలు జరుగుతున్న తరుణంలో తెలంగాణలో సైతం జనసేన ను విస్తరించాలన్న ఆలోచనకు పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో జనసేన కీలక నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. ఆ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.

* తెలంగాణ సమాజంలో మంచి అభిప్రాయం..
తెలంగాణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సాఫ్ట్ గా ఉంటారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడి వారి భావోద్వేగాన్ని గుర్తించారు పవన్ కళ్యాణ్. వాటిని గౌరవించారే తప్ప ఎన్నడు వ్యతిరేకించలేదు. తెలంగాణ కళాకారులను గౌరవించారు. గద్దర్ లాంటి వారిని ఎంతగానో గౌరవించి సొంత అన్నదమ్ముడు మాదిరిగా చూసుకున్నారు. విపత్తుల సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధులు కూడా ఇచ్చారు. ప్రాంతీయవాదంతో లెక్క లేకుండా తెలంగాణ సమాజానికి ఎంతో సాయం చేశారు పవన్ కళ్యాణ్. అందుకే తెలంగాణ ప్రజలు పవన్ విషయంలో మరో ఆలోచన చేయరు. కానీ అదే తెలంగాణ నుంచి తనపై కుట్రలు జరుగుతుండడంతో.. గట్టిగానే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇలా కుట్రలు చేస్తున్న వారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలంటే పార్టీని యాక్టివ్ చేయడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పార్టీ శ్రేణుల యాక్టివ్..
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో జనసేన నేతలు క్రియాశీలకం అయ్యారు. చాలా దూకుడుతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ ఎలా సాయం చేశారో ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రేపు జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై పూర్తి దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ నెలలోనే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే ఊపు కొనసాగించి కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు పవన్. వాటిలో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకొని.. తెలంగాణ రాజకీయాల్లో మరింత యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. చూడాలి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో..

ఘట్టమనేని ఫ్యామిలీ లో జయకృష్ణ మరో మహేష్ బాబు అవుతాడా..?

Jayakrishna debut movie

Jayakrishna debut movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు స్టార్ హీరోలుగా రాణించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ మాస్ హీరోగా అవతరించాడు. ఇక అతని తర్వాత మహేష్ బాబు సైతం క్లాస్ మాస్ అనే తేడా లేకుండా విభిన్న తరహా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించలేకపోయాడు. కాబట్టి వారణాసి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లో తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఇక మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో అతను ఎలాగైనా సరే మొదటి సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక దానికోసం ఆయన తీవ్రమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే జయకృష్ణ మహేష్ బాబు రేంజ్ లో స్టార్ హీరోగా మారుతాడా? లేదంటే వాళ్ల ఫాదర్ రమేష్ బాబు లాగా వీలైనంత తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…

మొత్తానికైతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే తరం కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుందనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక జయకృష్ణతో పాటు మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే మహేష్ బాబు వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు కొడుకులు సైతం ఇండస్ట్రీలో రాణించడానికి ఇప్పటినుంచే కసరత్తులైతే చేస్తున్నారు…

'సేన గళం'ను రంగంలోకి దించిన పవన్!

Pawan Kalyan Pithapuram Students Free Education
Pawan Kalyan Pithapuram Students Free Education

Pawan Kalyan Sena Galam : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో జరుగుతున్న కుల, వ్యక్తిగత దాడిని నియంత్రించేందుకు గట్టి వ్యూహాన్ని రూపొందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తరువాత తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ పై ఎదురైన వ్యక్తిగత దాడి, సామాజిక దాడి గురించి అందరికీ తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ జనసేన నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. గట్టిగానే బదులిచ్చారు. అయితే ఇలా కాకుండా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పై ఇదే రేంజ్ లో కుట్రలు జరుగుతాయి అన్నది తెలుసు. అందుకే దానిని బలంగా తిప్పికొట్టేందుకు సేన గళం పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా జనసేన పై కాపు, కుటుంబ వ్యవహారాలు వంటి వివాదాలను నెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారి మాటలను తిప్పికొట్టేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

* అన్ని సామాజిక వర్గం నేతలు..
జనసేనలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఉన్నారు.. పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. జనసైనికులు కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తుంటారు ప్రత్యర్థులపై. అయితే ఈసారి రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. పవన్ కళ్యాణ్ ను ప్రత్యర్థి పార్టీల్లో కాపు నేతలు తిడితే.. ఈ సేన గళం లో ఉన్న కాపు నేతలు స్పందిస్తారు. ఒకవేళ ప్రాంతీయవాదం ముసుగులో దాడి చేస్తే అదే ప్రాంతీయవాదాన్ని వినిపించిన జనసేన నేతలతో తిప్పి కొడతారు. మేధావుల ముసుగులో బురదజల్లే ప్రయత్నం చేస్తే.. అదే మేధావి వర్గంతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. అలా అన్ని వర్గాలతో సేన గళం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్.

* అటువంటి వాటికి చెక్..
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగేశ్వర్ కు మద్దతుగా తెలంగాణ ముసుగులో కొందరు మేధావులు, జర్నలిస్టులు వ్యతిరేక గళం వినిపించారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేశారు. అయితే పవన్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నందున ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది సర్వసాధారణమే. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు సేన గళంను రంగంలోకి దించారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

బొల్లా బ్రహ్మనాయుడు ను కాపాడుతోంది ఎవరు?!

Bolla Brahmanaidu
Bolla Brahmanaidu

తెలంగాణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ.1000 కోట్ల విలువైన భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభుత్వ జీవోలను సైతం తారుమారు చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. దొరికిపోవడంతో అడ్డంగా బుక్కయ్యారు. అయితే ఆయన పరారీలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఆయన మాత్రం తన సొంత నియోజకవర్గం వినుకొండలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కుంభకోణం నుంచి ముందస్తు బెయిల్ దక్కించుకునేందుకు ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఆయనకు సహకారం ఉన్నట్లు అర్థం అవుతుంది. పోలీసులు ముందస్తు బెయిల్ దక్కే వరకు ఈ పరారీ నాటకం ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు తెలంగాణలో పెద్ద తలకాయల సహాయం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

* చాలా పెద్ద నేరం..
బ్రహ్మనాయుడు చేసింది చిన్న నేరం కాదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాదు.. ఏకంగా ప్రభుత్వ జీవోలను సైతం మార్చేశారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పక్క రాష్ట్రంలో 1000 కోట్ల భూమికి సంబంధించిన అవినీతికి పాల్పడితే కనీసం నాయకత్వం స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈ మూలం ఇప్పటిది కాదు అని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఈ భూమికి బ్రహ్మనాయుడు టెండర్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బ్రహ్మనాయుడు విషయంలో కాపాడుతుంది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ జీవోలను మార్చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏ ప్రభుత్వమైనా దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే తెలంగాణ పోలీసులు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని.. పట్టుకుంటామని మాత్రమే చెబుతున్నారు. ఆయన మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

* వినుకొండ నియోజకవర్గంలో సైతం..
మరోవైపు వినుకొండ టిడిపి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియా ముందుకు వచ్చారు. బ్రహ్మనాయుడు భూ అరాచకాలు వినుకొండలో సైతం ఉన్నాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని.. జగన్మోహన్ రెడ్డికి సైతం వాటాలు పంపించారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి బ్రహ్మనాయుడు కు మంచి పేరు ఉంది. తిరుమల డైరీ ని అభివృద్ధి చేసి తన వాటాను అమ్ముకొని ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు అవినీతి మరక అంటింది. వైసిపి హయాంలోనే తెలంగాణ లో కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూభాగోతానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే భారీ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత.. ఆయనను తెలంగాణ నుంచి కాపాడుతున్నది ఎవరు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని వివాదాలపై మాట్లాడుతోంది. కానీ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడితే నిమ్మకు నీరెత్తన్నట్టు ఉంది.

రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన స్టార్ హీరోల ఫ్యాన్స్... కారణం ఏంటంటే..?

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi : మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే చాలు తన అభిమానుల ముఖం అందంతో వెలిగిపోతుంది. అలాంటి చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ సైతం చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇకమీదట కూడా ఆయన అదే రేంజ్ లో ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. అయితే కొంతమంది స్టార్ హీరోల అభిమానులు మాత్రం రామ్ చరణ్ సినిమాను తొక్కేయాలనే ప్రయత్నంలో దీని మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక దీని వెనుక కొంతమంది స్టార్ హీరోల హస్తం కూడా ఉందని చెప్పే వాళ్ళు సైతం ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ సినిమా సూపర్ సక్సెస్ అయితే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. కానీ కొంతమంది హీరోల అభిమానులు మాత్రం రామ్ చరణ్ సక్సెస్ ని సాధిస్తే తమ హీరో కంటే ముందు వరుసలో దూసుకెళ్తాడేమో అనే ఉద్దేశ్యంతో అతని సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు.

రిలీజ్ కి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులకు యాంటీ ఫ్యాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ నడుస్తుంది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే రామ్ చరణ్ పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే పర్లేదు. కానీ పొరపాటున నెగెటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం సినిమాని చీల్చి చెందుతారు.

గతంలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది… అందుకని ఈ సినిమా విషయంలో అటు రామ్ చరణ్, ఇటు బుచ్చిబాబు సైతం చాలా వరకు కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు తప్ప సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ కూడా వాళ్ళు లీక్ చేయడం లేదు…

వస్తే లక్షల ఓట్లు.. పోతే వేల ఓట్లు.. డీఎస్సీ పై వైసీపీ ఆలోచన అదే!

Andhra Pradesh Politics
Andhra Pradesh Politics

YSRCP: వస్తే కొండ.. పోతే ఈక.. అన్నట్టు ఆలోచనతో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మెగా డీఎస్సీ 2025 పై భారీగానే ప్లాన్ చేసింది ఆ పార్టీ. ఏడాది తరువాత అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తోంది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఎక్కడ న్యాయపోరాటం చేయడం లేదు. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా స్కెచ్ అర్థం అవుతోంది. కేవలం రాష్ట్రంలో లక్షలాది ఓట్లను టార్గెట్ చేసుకునే ఈ కొత్త ప్రచారానికి తెర తీసింది. పోతే వేల ఓట్లు.. వస్తే లక్షల కోట్లు అన్నట్టు ఆలోచన చేసింది. గట్టిగానే ప్రణాళిక వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. సాక్షి మీడియాలో వ్యతిరేక కథనాలు వడ్డిస్తోంది.

* ఒక్క పోస్ట్ భర్తీ చేయలే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కనీసం అటువంటి ఆలోచన చేయలేదు. అధికారంలోకి వస్తే ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు జగన్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణ పొందిన లక్షలాదిమంది ఆశగా ఎదురు చూశారు. కానీ వారికి అవకాశం ఇవ్వలేదు జగన్. 2024 ఎన్నికలకు నెల రోజుల ముందు 6100 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ రద్దయింది. దీంతో లక్షలాదిమందికి ఎదురుచూపులు మిగిలిపోయాయి.

* మెగా డీఎస్సీ ప్రకటన..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు. నారా లోకేష్ నేతృత్వంలో డీఎస్సీ నియామక ప్రక్రియ గడువులోగా పూర్తి చేయగలిగారు. గత ఏడాది ఉపాధ్యాయులను నియమించారు. అయితే కూటమికి అదో ప్లస్ పాయింట్ గా మారింది. ఉపాధ్యాయ వర్గాల్లో కూడా సంతృప్తి కనిపిస్తోంది. అయితే ఇది అంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. అందుకే కొత్త ప్రణాళిక వేసింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఏదైనా నియామక ప్రక్రియ పై ఆరోపణలు వస్తే వెంటనే కోర్టుకు వెళ్లాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదు. ఎందుకంటే డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. ఆ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేయడం కంటే దీనిని రాజకీయం చేయడానికి ఎక్కువగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* అభ్యర్థుల్లో గందరగోళం..
దాదాపు ఆరు లక్షల మంది డిఎస్సీ పరీక్ష రాశారు. అందులో 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అభ్యర్థుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. పోతే 16,000 ఓట్లు.. వస్తే లక్షల ఓట్లు అన్నది ఆ పార్టీ ఆలోచన. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికైనా రిజర్వేషన్లు అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కుల రిజర్వేషన్లతో పాటు దివ్యాంగులకు కొన్ని పోస్టులు కేటాయించాలి. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా అలానే చేసింది. నిన్ననే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సాక్షి మీడియాలో డీఎస్సీ అక్రమాలంటూ వచ్చిన కేస్ స్టడీ పై కూడా స్పష్టతనిచ్చారు. అయితే ఇదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. డీఎస్సీ పై బురద జల్లి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేయాలి. డీఎస్సీలో ఉద్యోగం రాని వారికి అనుమానం పెంచి వారిని తమ వైపునకు తిప్పుకోవాలి. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇందులో.