Home Blog Page 206

ఐపీఎల్ ట్రోఫీ పై సంస్కృత శ్లోకం.. అందుకే ప్రత్యేకం.. ఇంతకీ దాని అర్థం ఏంటంటే..

IPL trophy Sanskrit shloka
IPL trophy Sanskrit shloka

IPL trophy Sanskrit shloka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గతంలో ఒకే రకమైన ఆకృతిలో ఉండేది. ఆ తర్వాత దానిని మార్చేశారు. ప్రు డెన్షియల్ వరల్డ్ కప్ నమూనాలోనే దాన్ని రూపొందించారు. ఆకృతి కూడా అద్భుతంగా ఉండడంతో చాలా దేశాలు తాము నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్లలో ఇదేవిధంగా ఉండేలా ట్రోఫీని రూపొందిస్తున్నాయి.

ఐపీఎల్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీపడదు. నాణ్యమైన బంగారంతో దీనిని రూపొందిస్తూ ఉంటుంది. గెలిచిన జట్టు ఈ ట్రోఫీని అందుకుంటుంది. ఈ ట్రోఫీకి స్పాన్సర్ గా టాటా కంపెనీ వ్యవహరిస్తోంది. గతంలో చైనా కంపెనీలు వ్యవహరించేవి. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో టాటా కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీకి ప్రధాన ప్రయోజక కర్తగా వ్యవహరిస్తుంది. ట్రోఫీ తయారీలో టాటా కంపెనీ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. పైగా అట్రోఫీని తమ ప్రౌడ్ మూమెంట్ గా ఆ కంపెనీ చెబుతోంది.

టాటా కంపెనీ బీసీసీఐకి ఎంత ఇస్తుందో తెలియదు గానీ.. ఐపీఎల్ ట్రోఫీకి టైటిల్ స్పాన్సర్ గా ఉండడంవల్ల ఆ కంపెనీ కి విపరీతమైన ప్రచారం లభిస్తుంది. అయితే ప్రొఫెషన్ లో అటు బీసీసీఐ, ఇటు టాటా కంపెనీ కాంప్రమైజ్ కావని చెప్పుకున్నాం కదా. ట్రోఫీ పై సంస్కృతంలో ఒక శ్లోకాన్ని రూపొందించింది టాటా కంపెనీ.. ఇందులో బీసీసీఐ ప్రమేయం కూడా ఉంది. ఆట్రోఫీని అత్యంత జాగ్రత్తగా గమనిస్తే సంస్కృతంలో యత్ర ప్రతిభా అవసర ప్రాప్నో తిహి అని రాసిన శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఎక్కడైతే ప్రతిభకు తగ్గట్టుగా అవకాశం దక్కుతుందో అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి.. వారికి సమానమైన అవకాశాలు కల్పించడమే ఈ టోర్నీ ఉద్దేశం. 2008 నుంచి ఇప్పటివరకు నిర్వాహకులు ఇదే విధానానికి కట్టుబడి ఉన్నారు.. మరోవైపు ఆర్ సి బి ఈ సీజన్లో విజేతగా నిలిచిన నేపథ్యంలో ట్రోఫీ మీద బంగారు అక్షరాలతో రాయల్ చాలెంజర్స్ పేరును రూపొందించారు.

టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించిన దగ్గర్నుంచి ఐపీఎల్ రేంజ్ మారిపోయింది.. గ్లోబల్ వ్యాప్తంగా కూడా ఈ ట్రోఫీకి విపరీతమైన స్థాయి వచ్చేసింది. చాలామంది ప్లేయర్లు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. భారీగా డబ్బు రావడం.. పేరు కూడా లభిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడే అవకాశం వస్తే చాలు ఎగిరి గంతులు వేస్తున్నారు. ఆదాయానికి ఆదాయం.. పేరుకు పేరు వస్తున్న నేపథ్యంలో.. ఐపీఎల్ ను తమ టాప్ ప్రయారిటీగా ఆటగాళ్లు భావిస్తున్నారు.

దేశంలో అత్యంత సరసమైన కారు.. క్యూ కడుతున్నారు.. ధర ఎంతంటే..

MG Comet EV price in India
MG Comet EV price in India

MG Comet EV price in India: భారతదేశంలో ప్రస్తుతం EV ల హవా సాగుతోంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఈ వేరియంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరసమైన ధరలో కార్లను అందిస్తున్నాయి. వీటిలో MG Motors కంపెనీ నుంచి రిలీజ్ అయిన విద్యుత్ కారు అందరినీ ఆకర్షిస్తోంది. మిగతా కార్లకంటే దీని ధర బడ్జెట్ కు అనుగుణంగా ఉండడంతో దీని కోసం క్యూ కడుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే?

MG కంపెనీ నుంచి ‘కామెట్ EV’ 2023లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి పట్టణ ప్రయాణాలకు ఒక స్మార్ట్ ఎంపికగా నిలిచింది. గత ఏడాది ఈ సంస్థ ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ (BaaS) వేరియంట్‌ను పరిచయం చేయడం ద్వారా దీనిని మరింత అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండటంతో దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే తాజాగా టాటా మోటార్స్ తన ‘Tiago.ev’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత తక్కువ ధరకే ప్రారంభించడంతో, ఈ విభాగంలో పోటీ మరింత పెరిగింది.

అయితే ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41 bhp పవర్, 110 Nm టార్క్‌ను అందిస్తుంది. ARAI క్లెయిమ్ ప్రకారం.. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, ఇది రోజువారీ సిటీ ప్రయాణాలకు సరిపోయే ఈ కార ఎకో, నార్మల్ , స్పోర్ట్స్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అలాగే 3.3 kW ఛార్జర్‌తో సుమారు 7 గంటల్లో 0 నుండి 100% ఛార్జ్ అవుతుంది.

ఈ బుజ్జి కారు కాంపాక్ట్ పరిమాణంలో ఉన్నప్పటికీ.. దీని క్యాబిన్ మాత్రం ఆధునిక ఫీచర్లతో కలిగి ఉంది. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది.వీటిలో పాటు ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్లు, డిజిటల్ కీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లను కూడా సంస్థ అందించింది.

MG కామెట్ EVకి సంబంధించి BaaS ప్రోగ్రామ్ కింద వినియోగదారులు కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, కిలోమీటరుకు రూ. 2.5 నుండి రూ. 3.2 మధ్య బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీతో కలిపి లభించే వేరియంట్ల ధరలు సుమారు రూ. 7.35 లక్షల నుండి రూ. 7.63 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి. 4-సీటర్ మైక్రో-EV విభాగంలో పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లడానికి ఇది ఒక అద్భుతమైన వాహనం.

15 ఏళ్ల బుడ్డోడికి ఇన్ని ట్రోఫీలా..ఐపీఎల్ ను స్వీప్ చేసి పడేశాడు

Vaibhav Suryavanshi trophies
Vaibhav Suryavanshi trophies

Vaibhav Suryavanshi trophies: అది మామూలు విధ్వంసం కాదు. మాటలకు అందని పరాక్రమం. అంచనాలకు ఉందని అజేయం . పనికిమాలిన తోటి ప్లేయర్ల వల్ల అతని కష్టానికి గుర్తింపు లేకుండా పోయింది కానీ.. ఆ జట్టు ప్లేయర్లు కూడా అతని మాదిరిగా ఆడి ఉంటే రేంజ్ వేరే విధంగా ఉండేది. తను ఒక వజ్రాయుధం ఎలా వాడుకోవాలో రాజస్థాన్ యాజమాన్యానికి తెలియలేదు. రాజస్థాన్ ప్లేయర్లకు కూడా తెలియలేదు. అది వారి దురదృష్టం. ఇంతకంటే పచ్చిగా చెప్పడానికి ఏమీ లేదు.

ఐపీఎల్ లో వైభవ్ సూర్య వంశీ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. మామూలుగా అయితే గొప్ప గొప్ప ప్లేయర్లు ఐపీఎల్లో సత్తా చూపిస్తారు. కానీ ఒక అన్ క్యాప్డ్ ఆటగాడిగా వైభవ్ సునామీని సృష్టించాడు అని చెప్పవచ్చు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అదరగొట్టిన అతడు..ఎమర్జింగ్ ప్లేయర్.. మోస్ట్ సిక్సెస్ (72 సిక్సర్లు), సూపర్ స్ట్రైకర్ (237.31 స్ట్రైక్ రేట్), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్.. ఇలా అయిదు అవార్డులను సొంతం చేసుకున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే ప్లేయర్లు ఉన్నప్పటికీ.. సూర్య వంశీ ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మైదానంలోకి దిగడమే ఆలస్యం ఎదురు దాడి మొదలుపెట్టేవాడు. వాస్తవానికి ఈ సీజన్లో అతడు ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. మూడుసార్లు సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. ఒకవేళ అలా అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే అతని ఖాతాలో మూడు సెంచరీలు ఉండేవి.

సూర్య వంశీ ఈ సీజన్ లో తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు.. జట్టు గెలిచినప్పుడు ఎగిరి సంబరాలు చేసుకోవడం.. ఓడిపోయినప్పుడు కన్నీరు పెట్టడం వంటి గుణంతో చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సీనియర్ ప్లేయర్లు ఎదురు పడినప్పుడు వారి ఆశీర్వాదం తీసుకునేవాడు. అంతటి సునీల్ గవాస్కర్ సూర్య వంశీని ఉద్దేశించి లగేరహో బేటా అన్నారు అంటే.. అతడు ఏ స్థాయిలో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఆడినా సరే ఒదిగి ఉంటున్నాడు. మైదానంలో చిచ్చరపిడుగు మాదిరిగా కనిపిస్తున్న అతడు.. తన లౌక్యమైన గుణంతో అందరి ప్రేమను పొందుతున్నాడు. ఐపీఎల్ లో దాదాపు ఐదు కీలకమైన అవార్డులను అతడు సొంతం చేసుకున్నాడు అంటే.. మామూలు విషయం కాదు.

సూర్య వంశీ ఇదే జోరు కొనసాగిస్తే అతడికి అడ్డు అనేది ఉండదు. ఈ సీజన్లో రాజస్థాన్ మూడో స్థానం వరకు వచ్చేసింది. కానీ వచ్చే సీజన్లో మాత్రం సూర్య వంశీ మరింత షైన్ అవుతాడు. అప్పుడు ఆర్ఆర్ జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అతడు జట్టును ముందుండి నడిపించడంలో ఫియర్లెస్.. రిలెంట్ లెస్.. అన్ స్టాపబుల్ క్రికెట్ ఆడుతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.

చిరంజీవి తో సినిమా చేయకుండానే స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు వీళ్లేనా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi and top Telugu directors: కొంతమంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తర్వాత టాప్ డైరెక్టర్లుగా మారిపోతారు. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు చిరంజీవితో సినిమా చేసిన తర్వాతే వాళ్ళకంటు ఒక స్టార్ డమ్ ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయకుండానే స్టార్ డైరెక్టర్స్ గా మారిపోయారు. ఇంతకీ వారిలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవితో సినిమా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు. దాంతో ఆయనకు దొరికిన హీరోలతో సినిమాలను చేసి వాళ్ళని స్టార్ హీరోలుగా మార్చేశాడు…

ఇక పూరి జగన్నాధ్ సైతం కెరియర్ మొదటి నుంచి చిరంజీవితో సినిమా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు.కానీ అది వర్కౌట్ కాలేదు అయినప్పటికి ఆయన రవితేజ తో వరుస సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక మహేష్ బాబుతో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో ఆయన ఒక్కసారిగా నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా మారిపోయాడు…

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత గా తన కెరియర్ ను మొదలు పెట్టినప్పటికి దర్శకుడిగా మారిన తర్వాత ఆయన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లను ఎక్కువగా రిపీట్ చేస్తూ సినిమాలను చేశాడు.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా తను ఎందుకో ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. చిరంజీవితో సినిమా చేయకుండా స్టార్ డైరెక్టర్ గా మారి టాప్ లిస్టులో కొనసాగుతున్న వాళ్లలో త్రివిక్రమ్ కూడా ఉంటాడు…

ఇక ఇప్పుడున్న కొంతమంది దర్శకులు చిరంజీవితో సినిమా చేయకుండానే టాప్ పొజిషన్ ని అందుకున్నారు. నిజానికి చిరంజీవితో సినిమా చేయాలనేది ప్రతి ఒక్క దర్శకుడు కల అది కొంతమందికి నెరవేరితే మరి కొంత మందికి అందని ద్రాక్ష గానే మిగిలిపోయిందనే చెప్పాలి…

రామ్ చరణ్ కి ఫోన్ చేసిన మహేష్ బాబు... ఆ విషయం మీద అంత సేపు మాట్లాడాడా..?

Mahesh Babu called Ram Charan
Mahesh Babu called Ram Charan

Mahesh Babu called Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబడుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి…

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఒక 30 మినిట్స్ పాటు మాట్లాడట. కారణం ఏంటి అంటే తను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చిస్తూనే తనదగ్గరికి ఒక కథ వచ్చిందని చెప్పాడట. ఆ కథను విన్న మహేష్ బాబు ఆ మూవీ నాకంటే రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అని ఆ దర్శకుడికి చెప్పారట. అందుకే ఆ కథని ఒకసారి వినమని రామ్ చరణ్ కి సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మహేష్ బాబుకి కథ చెప్పిన దర్శకుడు ఎవరు ఎందుకని మహేష్ బాబు ఆ మూవీ రామ్ చరణ్ కి సజెస్ట్ చేశాడు అనే విషయాలు ఇంకా బయటికి రావడం లేదు. కానీ మొత్తానికైతే ఈ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది…

మొత్తానికైతే మహేష్ బాబు రామ్ చరణ్ మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. వీరిద్దరు చాలా పార్టీల్లో కలిసి కనిపించారు. అలాగే ఫోటోలు కూడా దిగి ప్రేక్షకులను, అభిమానులను ఆనందపరిచారు… మొత్తానికైతే మహేష్ బాబు సజెస్ట్ చేసిన కథ తో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

చైనా పక్కలో బ్రహ్మోస్‌ బల్లెం.. భారత్‌ వ్యూహాత్మక మలుపు

BrahMos missile
BrahMos missile

BrahMos missile: మన చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. దీంతో చాలా దేశాలు భారత్‌తో డిఫెన్స్‌ డీల్‌ కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ షాంగ్రి–లా డైలాగ్‌లో చేసిన ప్రకటన ఇండో–పసిఫిక్‌ భద్రతా వ్యవస్థలో కొత్త చర్చనీయాంశమైంది. ఫిలిప్పీన్స్‌ తర్వాత వియత్నామ్‌తో బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ఒప్పందం సంతకం అయిందని, ఇండోనేషియాతో కూడా చివరి దశల్లో ఉందని ఆయన ప్రకటించారు. వియత్నామ్‌ ఒప్పందం సుమారు 60 బిలియన్‌ రూపాయలు (సుమారు 629 మిలియన్‌ డాలర్లు) విలువైనది. ఇందులో మిస్సైల్‌లు, శిక్షణ, లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌ 2022లో సుమారు 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.

చైనాకు చెక్‌ పెట్టే వ్యూహం..
ఈ ఒప్పందాలు కేవలం వ్యాపారం కాదు.. చైనా ఆధిపత్య ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న ప్రాంతీయ నెట్‌వర్క్‌లో భాగం. భారత్‌–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆపరేషనల్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌. సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ప్రయాణం చేసి రాడార్‌లను గుర్తించడం కష్టం. విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలపై శక్తివంతమైన దాడి సామర్థ్యం ఉంది. ఈ మిస్సైల్‌ తీర రక్షణ బ్యాటరీల రూపంలో మోహరించడం వల్ల చైనా నౌకాదళం కార్యకలాపాలకు గణనీయమైన ఆటంకం ఏర్పడుతుంది.

చైనా ఆందోళన..
దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ‘నైన్‌–డాష్‌ లైన్‌’ దావాలు, కృత్రిమ దీవుల నిర్మాణం, మిలిటరైజేషన్‌ ద్వారా ప్రాబల్యం చూపుతోంది. ఫిలిప్పీన్స్, వియత్నామ్‌ వంటి దేశాలు చైనా ఆక్రమణాత్మక చర్యలను ఎదుర్కొంటున్నాయి. బ్రహ్మోస్‌ ఒప్పందాలు ఈ దేశాల సామర్థ్యాలను బలపరుస్తాయి. చైనా ఇలాంటి ఒప్పందాలను ‘‘ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు’’గా, ‘‘బాహ్య శక్తుల జోక్యం’’గా విమర్శిస్తోంది. కానీ ఇది చైనా విస్తరణవాద చర్యలకు సహజమైన ప్రతిస్పందన.

భారత్‌ వ్యూహం..
æఈ ఒప్పందాలు భారత్‌ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, ‘ఆక్ట్‌ ఈస్ట్‌’ పాలసీని బలపరచడం, ఇండో–పసిఫిక్‌లో బహుపాక్షిక భాగస్వామ్యాలు విస్తరించడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. క్వాడ్‌ భాగస్వామ్యం, ఆసియాన్‌ దేశాలతో సహకారం ద్వారా భారత్‌ స్వేచ్ఛాయుతమైన, నియమాల ఆధారిత ఇండో–పసిఫిక్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది భారత్‌ రక్షణ పరిశ్రమకు కూడా మైలురాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కింద స్వదేశీ తయారీని పెంచి, ఎగుమతుల లక్ష్యాలను సాధిస్తోంది.

ఫిలిప్పీన్స్, వియత్నామ్, ఇండోనేషియా వంటి దేశాల్లో బ్రహ్మోస్‌ నెట్‌వర్క్‌ ఏర్పడటం చైనా నౌకల కదలికలపై నిరోధక శక్తిని సృష్టిస్తుంది. ప్రాంతీయ దేశాల సార్వభౌమత్వం, సముద్ర స్వేచ్ఛను రక్షించడంలో భారత్‌ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది. బ్రహ్మోస్‌ ఒప్పందాలు భారత్‌ యొక్క వ్యూహాత్మక పరిపక్వతను, రక్షణ ఎగుమతి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఏ ఒక్క దేశం ఏకపక్ష ఆధిపత్యం చెలాయించకుండా సమతుల్య శక్తి నిర్మాణం జరుగుతోంది.

బెస్ట్ బ్యాటరీ కోరుకునేవారికి అనువైన ఫోన్..

Realme 16T 5G battery performance
Realme 16T 5G battery performance

Realme 16T 5G battery performance: Realme కంపెనీ ఇండియాలో దూసుకుపోతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఈ కంపెనీ నుంచి మొబైల్స్ మార్కెట్లోకి రావడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ తన మొబైల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త తరహాలో ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా తన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయిన Realme 16T 5G ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ప్రధానంగా బ్యాటరీ ఫోకస్డ్ ఫోన్‌గా రూపొందించబడింది. ఇంతకీ ఇందులో ఎలాంటి బ్యాటరీ వేశారు? ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో చూద్దాం..

Realme 16T 5G కొత్త ఫోన్ ప్రీమియం మ్యాట్ ఫినిష్ డిజైన్‌తో కనిపిస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో సెల్ఫీ మిరర్ ఉండటం దీని ప్రత్యేకత. ఈ మొబైల్ లో 8GB RAM తో పాటు 256GB స్టోరేజ్ కెపాసిటీ కనిపిస్తుంది. దీని ధర రూ. 34,999 ఉండడంతో మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కలిగి ఉండటం వల్ల బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా అవసరం.

ఈ మొబైల్‌లో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడంతో చాలా స్మూత్ వీడియోలు, గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. Realme 16T 5G మొబైల్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM ఉండడంతో మల్టీటాస్కింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ Android 16 వెర్షన్ లో రన్ అవుతుంది. దీంతో అవసరమైన యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఫోన్ స్పీడ్ తగ్గదు.

కెమెరా విషయానికొస్తే… ఈ ఫోన్ లో 50MP Sony రియర్ కెమెరా కనిపిస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీలకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే AI ఫీచర్లు స్లో మోషన్, డ్యూయెల్ వ్యూ వీడియో, టైమ్-ల్యాప్స్ సపోర్ట్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం 1080p వరకు మాత్రమే సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌లో బ్యాటరీ ప్రత్యేకం. ఇందులో 8,000 mAh బ్యాటరీ కనిపిస్తుంది. సాధారణ వినియోగదారలు ఒక చార్జ్‌పై మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వీటితో Wi-Fi, Bluetooth 5.3, 5G సపోర్ట్ ఉన్నాయి. IP69 రేటెడ్ ప్రొక్షన్ ఉండటం వల్ల ఈ ఫోన్ ఎటువంటి వాతావరణంలోనైనా వాడుకోవచ్చు. 8GB RAM , 256GB వేరియంట్ కలిగిన ఈ ఫోన్ రూ.34,999 ధరతో వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ బీస్ట్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

RCB గెలిచింది.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో

CSK vs RCB fan war
CSK vs RCB fan war

CSK vs RCB fan war: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. 2008లో ఐపీఎల్ మొదలైతే.. 2024 వరకు బెంగళూరు జట్టు చాలాసార్లు ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్ లో ట్రోఫీ గెలవలేకపోయింది. 2025 సీజన్లో మాత్రం తన రాతను బెంగళూరు జట్టు పూర్తిగా మార్చుకుంది. ఫైనల్ శ్రేయస్ అయ్యర్ జట్టు మీద గెలిచి తొలిసారి ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు స్థాయి ఒకసారిగా మారిపోయింది. జట్టు విలువ ఆకాశాన్ని తాకింది.

బెంగళూరు జట్టు 2024 వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ.. అభిమానులు ఆ జట్టుకు అండగా ఉండుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ జట్టు అధికారిక ఖాతాను అనుసరిస్తున్న అభిమానులు దీనికి బలమైన నిదర్శనం.. బెంగళూరు జట్టుకు వయసుతో తారతమ్యం లేకుండా అభిమానులు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇక మైదానంలో మ్యాచ్ జరుగుతుంటే ఎర్రజెండాలతో నింపేస్తుంటారు. మైదానాన్ని ఎర్ర సముద్రంగా మార్చేస్తుంటారు. గుజరాత్ జట్టుతో తాజా సీజన్లో జరిగిన ప్లే ఆఫ్.. ఫైనల్.. అంతకు ముందు లీగ్.. ఇలా అన్ని మ్యాచ్ల్లో బెంగళూరు ఫ్యాన్స్ తమ జట్టు మీద అభిమానాన్ని చూపించారు. చివరికి అహ్మదాబాద్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగినప్పటికీ.. అభిమానంలో గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కంటే అప్పర్ హ్యాండ్ లో నిలిచారు.

బెంగళూరు అభిమానులు తమ జట్టుకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. తమ జట్టు గురించి ఎవరైనా చెత్తగా మాట్లాడితే చిత్తుచిత్తు చేస్తారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు గురించి కొంతమంది చెడుగా మాట్లాడితే అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఓ పబ్ వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ అభిమానుల మధ్య చర్చ జరిగింది. బెంగళూరు జట్టు గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే.. ఆర్ సి బి అభిమానులు తట్టుకోలేకపోయారు. వెంటనే వారి మీద దాడి చేశారు. పొట్టు పొట్టు కొట్టారు.

“ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్సిబి ఫ్యాన్స్ అంటే ఏమిటో అందరికీ మరొకసారి తెలిసిపోయింది. ఐపీఎల్ లో అన్ని జట్లకు అభిమానులు ఉంటారు. బెంగళూరు జట్టుకు మాత్రమే భక్తులు ఉంటారు. ఇది తాజా ఘటనతో నిరూపితమైంది. మామూలుగానే బెంగళూరు అభిమానులు ఒక స్వింగ్లో ఉంటారు. వారు తమ సత్తాను ఇప్పుడు చూపించారు. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలిచి బెంగళూరు జట్టు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఐపీఎల్ మొత్తాన్ని బెంగళూరు శాసిస్తుందని” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి

కొడుకు తో ముచ్చట పెడుతున్న మెగా హీరో...

Varun Tej son first look
Varun Tej son first look

Varun Tej son first look: మెగా ఫ్యామిలీ హీరోల్లో వరుణ్ తేజ్ కి చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించగలిగే కెపాసిటి తనకు ఉందని నిరూపించుకుంటూ వస్తున్నాడు…తన కొడుకు అయిన వాయువు తేజ్ తో ఒక ఫోటో దిగి ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. జూన్ నెల ప్రారంభమైంది ఈ నెల కూడా చాలా ఎంజాయ్ చేస్తూ గడిపేయండి అంటూ ఆయన మెన్షన్ చేయడంతో అతని అభిమానులు ఆనందపడుతున్నారు. నిజానికి వరుణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు సంబంధించిన ఏ విషయం నైనా అభిమానులతో పంచుకుంటూ వాళ్ళను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన హీరోగా చేస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో సక్సెస్ ను సాధించడం లేదు. దాంతో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఇండియా దక్షిణ కొరియా నేపథ్యాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. హార్రర్ కామెడీ జనాలు తెరకెక్కుతుండటం విశేషం…ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ భారీ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి తొలిప్రేమ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు.

ఇక ఇప్పుడు అర్జెంటుగా తనకి సక్సెస్ రాకపోతే మాత్రం తను చాలా వరకు వెనకబడి పోయే ప్రమాదమైతే ఉంది. కాబట్టి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా మీద తను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఇక మేర్లపాక గాంధీ గతంలో చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆశించిన సక్సెస్ లను సాధించలేదు.

ఆయన మొదట్లో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా పేరునైతే తీసుకురాలేదు. అయినప్పటికి వరుణ్ తేజ్ అతన్ని నమ్మి అతనితో ప్రాజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కథ అద్భుతంగా కుదిరిందని అందువల్లే ఈ సినిమాని చేస్తున్నట్టుగా వరుణ్ తేజ్ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నాడు…

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Motorola Edge 70 Pro మొబైల్ కొనొచ్చా.. దీనికి ఎందుకంత క్రేజ్..

Motorola-Edge-70-Pro-review
Motorola-Edge-70-Pro-review

Motorola Edge 70 Pro review: Motorola ఇటీవల తన ప్రతిష్టాత్మకమైన ఎడ్జ్ సిరీస్‌లో Motorola Edge 70 Proని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో తో వచ్చిన ఈ ఫోన్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Motorola Edge 70 Pro మొబైల్ లో 6.8 అంగుళాల ‘ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్’ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండడంతో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉండడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ నుంచి రక్షణ పొందుతుంది.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ ‘డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్’ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు గేమింగ్‌కు కూడా చక్కగా సరిపోతుంది. ఆండ్రాయిడ్ 16పై పనిచేసే ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్ కోసం 12GB వరకు ర్యామ్, 256GB వరకు UFS 4.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ అనుభవం చాలా క్లీన్‌గా మరియు వేగంగా ఉంటుంది.

ఈ ఫోన్‌లోని అతి ముఖ్యమైన ఫీచర్లలో బ్యాటరీ ఒకటి. ఇందులో 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండడంతో దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎక్కువ సేపు బ్యాకప్ వస్తుంది. అలాగే ఇది వేగంగా ఛార్జ్ చేయడానికి 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP సోనీ LYT-710 మెయిన్ సెన్సార్‌ను అందించారు. అలాగే 50MP అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలను తీయడానికి ఈ సెన్సార్‌ బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.38,999 నుండి మొదలవుతుంది . ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు.

వైభవ్ సూర్య వంశీ సిక్సర్లు కొట్టేందుకు.. రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతాడో తెలుసా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi milk consumption: అప్పట్లో టీమ్ ఇండియా సారధిగా ధోని ఉండేవాడు. సారథిగా ప్రమోషన్ పొందకంటే ముందు అతడు సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. జులపాల జుట్టు.. హెలికాప్టర్ షాట్లతో జార్ఖండ్ డైనమేట్ గా రూపాంతరం చెందాడు. టీమిండియా కెప్టెన్ గా అతడు ప్రమోషన్ కూడా పొందాడు. అతడి నాయకత్వంలో టీ20.. వన్డే వరల్డ్ కప్ లను భారత జట్టు సొంతం చేసుకుంది. అయితే అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వెనుక ఒక సీక్రెట్ ఉంది. అతడు ప్రతిరోజు లీటర్ల కొలది పాలు తాగడం వల్లే ఆ స్థాయిలో సామర్థ్యాన్ని సొంతం చేసుకునేవాడు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అతడు చెప్పాడు.

ప్రస్తుత ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇంకా అనేక రకాల పురస్కారాలను అతడు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రఖ్యాత వ్యాఖ్యాత రవి శాస్త్రి ఇంటర్వ్యూ చేశాడు. నువ్వు ఈ స్థాయిలో సిక్సర్లు కొడుతూ ఉంటావు కదా.. వీరోచితంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటావు కదా.. నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు అంటూ రవి శాస్త్రి ప్రశ్నించాడు. దానికి సూర్య వంశీ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరచింది.

సూర్య వంశీ ప్రస్తుతానికి శరీర సామర్థ్యం మీద దృష్టి సారించాడు. వికెట్ల మధ్యలో వేగంగా పరుగులు పెట్టడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన బీహార్ మటన్ ను పక్కన పెట్టాడు. చికెన్ వంటకాలు కూడా పూర్తిగా తగ్గించాడు. కేవలం డైటీషియన్ చెప్పినట్టుగానే తింటున్నాడు. ఫలితంగా బరువు చాలా బరువు తగ్గాడు. ఒకప్పటితో పోల్చి చూస్తే వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. అంతేకాదు సామర్థ్యాన్ని కూడా సరికొత్తగా పెంపొందించుకుంటున్నాడు.

సూర్య వంశీ గతంలో పాలు తాగేవాడు. అది కూడా లీటర్ల క్వాంటిటీలో లాగించేవాడు. ఎప్పుడైతే అతడు ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిపోయాడో.. రాజస్థాన్ జట్టుకు ఆటగాడిగా మారిపోయిన తర్వాత తన బరువును తగ్గించుకునే పనిలోపడ్డాడు. రాహుల్ ద్రావిడ్ సూచన మేరకు చాలావరకు డైట్ తగ్గించుకున్నాడు. నాన్ వెజ్ పూర్తిగా మానేశాడు. ఆయిల్ ఫుడ్ పూర్తిగా తగ్గించాడు. కేవలం ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. ఫైబర్.. ప్రోటీన్స్.. ఉండే విధంగా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. పాలు తాగే అలవాటును పూర్తిగా మానేశాడు. ఇదే విషయాన్ని రవి శాస్త్రితో చెబితే అతడు నవ్వి ఊరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.

మోడీ అమిత్‌ షాల అసలు స్కెచ్‌ ఇప్పటికైనా అర్థమైందా రాజా!

Modi Amit Shah political strategy
Modi Amit Shah political strategy

Modi Amit Shah political strategy: భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను కేవలం రొటీన్‌ సవరణగా చూడకూడదు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన అక్రమాలు, డూప్లికేట్‌ ఎంట్రీలు, మరణించిన ఓటర్ల పేర్లు, అక్రమ వలసదారుల ప్రవేశం వంటి సమస్యలకు వ్యవస్థాగత పరిష్కారం కోసం చేపట్టిన సమర్థవంతమైన చర్య. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా నాయకత్వంలోని ప్రభుత్వం డేటా–ఆధారిత సంస్కరణల ద్వారా ఓటర్‌ జాబితాలను శుద్ధి చేస్తుండగా, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నాయి. సర్‌పై కోర్టులను ఆశ్రయించాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది.. ఇది ఎన్నికల సంఘం యొక్క చట్టబద్ధమైన బాధ్యత.

సుప్రీం కోర్టు స్పష్టీకరణ..
2026లో సుప్రీం కోర్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ ఎన్నికల సంఘంపై వేసిన కేసులో ఎస్‌ఐఆర్‌ను సమర్థించింది. ఆర్టికల్‌ 324, రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్‌ 1950, సెక్షన్‌ 21(3)
కింద ఎన్నికల సంఘానికి ఓటర్‌ జాబితాల సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఉందని తీర్పు ఇచ్చింది. విదేశీయుల గుర్తింపు విషయంలో పరిమిత పరిశీలన మాత్రమే చేయాలని, పూర్తి పౌరసత్వ నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఫారినర్స్‌ చట్టం ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ(హోం మంత్రిత్వ శాఖ) బాధ్యతను కోర్టు గుర్తించింది. దీంతో బంతిని హోం మంత్రిత్వ శాఖ వైపు మళ్లించడంతో ప్రతిపక్షాల వ్యూహం మారింది.

డేటా ప్రక్షాళణ..
ప్రభుత్వం వివిధ వనరుల నుంచి డేటాను క్రోడీకరిస్తోంది. ఆధార్‌ శుద్ధీకరణ చేసి మరణించిన 2.5 కోట్లకు పైగా ఆధార్‌ నంబర్లు డీయాక్టివేట్‌ చేశారు (2026 ఫిబ్రవరి నాటికి). ఇది మునుపటి 14 సంవత్సరాల కంటే ఎక్కువ. కొత్త ఆధార్‌ జారీని కఠినమైన పర్యవేక్షణలోకి తెచ్చారు. ఇక ముంబైలోనే 87,000కి పైగా నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇవి అక్రమ వలసదారులకు ఇవ్వబడినట్టు ఆరోపణలు. దేశవ్యాప్తంగా ఇలాంటి శుద్ధీకరణ జరుగుతోంది. రేషన్‌ కార్డులు, ఇతర వ్యవస్థలు బిహార్‌లో లక్షలాది నకిలీ కార్డులు తొలగించారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డేటా, పాస్‌పోర్టు రికార్డులు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ పూర్తయింది. మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించడం ఈ ప్రక్రియ తీవ్రతను చూపిస్తుంది.

సరిహద్దు భద్రత పటిష్టం..
హోం మంత్రి అమిత్‌ షా సరిహద్దు రాష్ట్రాల్లో స్మార్ట్‌ బార్డర్‌ వ్యవస్థను బలపరుస్తున్నారు. ట్రాన్స్‌–బార్డర్‌ మైగ్రేషన్‌ను నియంత్రించడం, లోపల ఉన్న అక్రమ నివాసులను గుర్తించడం దీని లక్ష్యం. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)తో ఎస్‌ఐఆర్‌ లింక్‌ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ఇది ఓటర్‌ జాబితా సమగ్రత కోసమేనని ప్రభుత్వం చెబుతోంది.

ఈ సంస్కరణలు కొన్ని రాజకీయ శక్తుల ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అక్రమ వలసలు, నకిలీ ఓటర్లు దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలను మార్చాయి. కానీ ప్రజాస్వామ్యం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అనర్హులు ఓటు వేస్తే అర్హులైన పౌరుల హక్కు దోచుకున్నట్టే. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ విజయవంతమైతే, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్‌ జాబితాలను కలిగి ఉంటుంది.

మొత్తానికి ప్రతిపక్షాలు ఏదో చేయాలనుకుంటే ఇంకోదే అయినట్లు.. సర్‌ ప్రక్రియ ఇప్పుడు అమిత్‌షా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ప్రతిపక్షాలు నోరు మెదపకుండా అయింది.

ఏం ఫోన్ సామీ ఇదీ.. ఫీచర్లు అదరహో.. ఫోన్ కోరుకునేవాళ్లంతా ఇటు లుక్కేయండి

Honor Win Turbo features
Honor Win Turbo features

Honor Win Turbo features: చైనాకు చెందిన చాలా మొబైల్స్ ఇటీవల ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో Honor గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘Honor Win Turbo’ను చైనా మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ ప్రధానంగా భారీ బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని నిర్మాణం కూడా పటిష్టంగా ఉండడంతో రోజూవారీ వినియోగదారులకు ఈ మొబైల్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Honor Win Turbo చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే చాలా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకోగలదు. ఇందులో 6.79 అంగుళాల AMOLED భారీ డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో ఉండడంతో విజువల్ పరంగా గొప్ప అనుభూతి కలుగుతుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 8000 నిట్స్ వరకు ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం తోఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ ఉండడంతో ఇది నీటిలో మునిగినా లేదా అధిక పీడనం కలిగిన నీటి ధారలను తాకినా చెడిపోదు.

గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 16GB వరకు ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండనుంది. ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఇందులో 40,000 చదరపు మిల్లీమీటర్ల భారీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా, నెట్‌వర్క్ సరిగ్గా లేని చోట కూడా కాల్స్ అంతరాయం లేకుండా సాగేందుకు ఇందులో ప్రత్యేకమైన ‘C1+ RF’ చిప్‌ను అమర్చారు.

బ్యాటరీ మరియు ఛార్జింగ్:
ఈ ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ దాని బ్యాటరీ. ఇందులో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల ‘క్వింగ్‌హై లేక్’ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే ఇది అత్యధిక బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 17.3 గంటల నావిగేషన్ లేదా 14.2 గంటల నాన్-స్టాప్ గేమింగ్ చేయవచ్చు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే, ఇది 27W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం Honor Win Turbo మొబైల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను అమర్చారు. 50MP మెయిన్ సెన్సార్‌ను, అదనంగా 5MP వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 6.0, NFC, మరియు USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే, చైనాలో దీని ప్రారంభ ధర సుమారు 3,299 యువాన్లు (సుమారు రూ.46,000) నుంచి మొదలవుతుంది.

పూజ గదిని ఈ వైపు ఉంచడం అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే..

Pooja room vastu tips
Pooja room vastu tips

Pooja room vastu tips: భారతీయ సంస్కృతిలో పూజగదికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి, సానుకూల వాతావరణం నెలకొనాలంటే పూజగది సరైన దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. పూజ చేసే ప్రదేశం కేవలం దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాకుండా, మనసుకు ప్రశాంతతను అందించే ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా భావిస్తారు. అందుకే పూజగది నిర్మాణం, దిశ, విగ్రహాల ఏర్పాటు వంటి అంశాలకు వాస్తులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇలాంటి సమయంలో పూజ గది ఏ దిశలో ఉంటే మంచిది? ఏ దిశలో ఉంచడం మంచిది కాదు?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిని ఇంటి ఈశాన్య (ఉత్తర-తూర్పు) మూలలో ఏర్పాటు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈశాన్య దిశను దేవతల దిశగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో ఉదయపు సూర్యకిరణాలు మొదటగా ప్రవేశిస్తాయి. దీంతో పూజ చేసే సమయంలో సహజ కాంతి లభించడమే కాకుండా, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ధ్యానం, జపం, ప్రార్థనలు ప్రశాంతంగా సాగేందుకు ఈ దిశ అనుకూలంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటి మధ్యలో పూజగది ఉంటే మరింత శుభంఇంట్లో తగినంత స్థలం ఉంటే పూజగదిని ఇంటి మధ్య భాగంలో ఏర్పాటు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు సూచిస్తుంది.

ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లలో ప్రత్యేక పూజగది ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వంటింట్లో ఈశాన్య మూలలో చిన్న పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని వాస్తు చెబుతోంది. అయితే పూజాస్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వంట సామగ్రికి దూరంగా ఉండేలా చూసుకోవడం అవసరం.

వాస్తు ప్రకారం పడకగదిలో పూజగదిని ఏర్పాటు చేయడం మంచిది కాదు. పడకగది విశ్రాంతి, వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ప్రదేశం. పూజా స్థలం పవిత్రత, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ రెండింటి స్వభావాలు వేర్వేరుగా ఉండటంతో పూజగదిని బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేయవద్దని సూచిస్తారు. దీంతో పూజా స్థలం పవిత్రతకు భంగం కలగకుండా ఉంటుంది.

పూజగదిలో దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిశల్లో ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయాన్నే ఈశాన్య, తూర్పు దిశల నుంచి వచ్చే సూర్యకిరణాలు విగ్రహాలపై పడటం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని చెబుతారు. అలాగే సాయంత్రం పడమర దిశ నుంచి వచ్చే కాంతి కూడా పూజామందిరానికి ప్రత్యేక శోభను తీసుకొస్తుంది.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం విగ్రహాలను ఉత్తర దిశలో ఉంచడం అంతగా అనుకూలంగా ఉండదు. ఎందుకంటే అలా చేస్తే పూజ చేసే వ్యక్తి దక్షిణ దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవాల్సి వస్తుంది. దక్షిణ దిశను సాధారణంగా పితృదేవతలకు సంబంధించిన దిశగా భావిస్తారు. అందువల్ల దేవతారాధన సమయంలో తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చోవడం ఉత్తమమని సూచిస్తారు.

పూజగదిలో పాటించాల్సిన మరికొన్ని నియమాలు పూజగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. విరిగిపోయిన విగ్రహాలు, పాడైన ఫోటోలు, ఎండిపోయిన పూలను ఎక్కువ కాలం పూజగదిలో ఉంచకూడదు. పూజ సమయంలో దీపం, అగరబత్తి వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం మరింత మెరుగుపడుతుంది. అలాగే పూజగదిలో ప్రశాంతత ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.

ఉత్తరాంధ్రలో రైల్వే సరికొత్త అధ్యయం!

Uttarandhra railway development
Uttarandhra railway development

Uttarandhra railway development: ఉత్తరాంధ్ర చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం అయ్యింది. విశాఖ రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. విశాఖలోని డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం అయింది. నూతన జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తో పాటు ఇతర అధికారులు డెక్ భవనంలోకి ప్రవేశించారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్న మాదిరిగానే ఈరోజు నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. ఆపై ఏపీ ప్రజలు కూడా ప్రత్యేక రైల్వే జోన్ కోసం దాదాపు పుష్కర కాలంగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఆరోజు రానే వచ్చింది.

* విభజన హామీగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని అప్పట్లో చెప్పారు. కానీ గత పుష్కర కాలంగా జాప్యం జరుగుతూ వచ్చింది. 2018లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంతలో అధికార మార్పిడి జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ పురోగతి అంతంత మాత్రమే. కనీసం రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కూడా కేటాయించలేని స్థితిలో ఉండిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్ వేగవంతం అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేయడమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జోన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముడసర్లోవలో శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. విశాఖ నడిబొడ్డున ఉన్న డెక్ భవనంలో జోన్ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.

* ఇప్పటివరకు రాష్ట్ర రైల్వే లైన్ భూభాగం ఎక్కువ పరిధి దక్షిణ మధ్య రైల్వే లో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే కొనసాగేది.

* మరోవైపు భువనేశ్వర్ కేంద్రంగా ఉండే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో కూడా ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతం ఉండేది.

* అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ లో కొనసాగుతున్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను విశాఖ జోన్లో చేర్పించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాల్తేరు డివిజన్ కనుమరుగు అయింది. దాన్ని స్థానంలో విశాఖ రైల్వే డివిజన్ ప్రారంభం అయింది. అది కూడా కొత్త జోన్ పరిధిలో చేర్చారు.

* ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం పరిధిని కూడా విశాఖ రైల్వే జోన్ లో చేర్చారు.

* ఈ జోన్ నెట్వర్క్ 3,532 కిలోమీటర్ల రైల్వే లైన్.. 382 రైల్వే స్టేషన్లు కలిగి ఉంటుంది. 62,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. రూ.15,500 కోట్ల వార్షిక టర్నవర్ జరగనుంది. తమిళనాడు తో పాటు కర్ణాటక రాష్ట్రాల పరిధిని కూడా విస్తరించనుంది.

* విశాఖ రైల్వే జోన్ తో ఉత్తరాంధ్రకు కొత్త రూపు రానుంది. కొత్త రైలు సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. వస్తు రవాణా కూడా పెరగనుంది. ప్రధానంగా స్థానికంగా పండే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమం కానుంది.

'పెద్ది' మూవీ రిలీజ్ ట్రైలర్ వదలడం లేదా..? కారణం ఏంటంటే..?

Peddi 28 Days Collections
Peddi 28 Days Collections

Peddi movie release trailer: రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమాలన్ని విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన ‘పెద్ది’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ ప్రేక్షకులు ఇప్పటికే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేస్తారు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేయడం లేదట…కారణం ఏంటి అంటే ఇప్పటివరకు ఈ సినిమాకి భారీ హైప్ రాలేదు. ఇక రిలీజ్ ట్రైలర్ వదిలితే భారీ హైప్ క్రియేట్ అవుతుందని ఒకవేళ సినిమా ప్రేక్షకుడికి ఓకే అనిపించినట్టుగా ఉన్నా కూడా ఆ అంచనాలను అందుకోలేక పోతుంది.

కాబట్టి భారీ అంచనాలు పెట్టకుండా సింపుల్ గా ఈ సినిమాకు వచ్చి చూస్తేనే అందరికీ నచ్చుతుందని వాళ్ళు భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచే కోణంలో వాళ్ళు ఆలోచించడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడి నుంచి ఒక సినిమా వస్తుందంటే అది ప్రేక్షకుడిలో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుంది.

కాబట్టి ఈ సినిమా కూడా ఆ రెంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని వదలకపోవడమే బెటర్ అని మరికొంతమంది భావిస్తున్నారు… ఇక ఈ సినిమా మీద చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందనే అంచనాలో ఉన్నాడు… ఇక అందరి అంచనాలను అందుకుంటూ ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టగలిగే కెపాసిటిని సంపాదించుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

బాలయ్య చేసిన ఆ గొప్ప పాత్ర ను రామ్ చరణ్ చేయబోతున్నాడా..?

Ram Charan to reprise Balakrishna role
Ram Charan to reprise Balakrishna role

Ram Charan to reprise Balakrishna role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ సత్తాను చాటుకొని స్టార్ డమ్ ను సంపాదించుకున్న వాళ్లే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళను టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…బాలయ్య బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలు చేశాడు.

ముఖ్యంగా ‘ఆదిత్య 369’ సినిమాలో కృష్ణదేవరాయలు పాత్రను పోషించిన బాలయ్య ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. నిజంగా కృష్ణదేవరాయలు ఉంటే ఇలానే ఉండేవాడేమో అనేంతలా ఆ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య పోషించిన అదే పాత్రని రామ్ చరణ్ చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందట. అది కృష్ణదేవరాయలు పాత్ర కావడం విశేషం… ఈ సినిమాని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చేసిన పాత్రని రామ్ చరణ్ చేయడం అనేది చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది. నిజానికి ఆ పాత్రలో రామ్ చరణ్ ఎలా తన ప్రతిభను చూపిస్తాడు. అందరిని మెప్పించే విధంగా తన నటన ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన ‘పెద్ది’ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాడు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి…