Homeఅంతర్జాతీయంGardener salary in USA: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కన్నా తోటమాలే నయం.. వీడియో వైరల్‌

Gardener salary in USA: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కన్నా తోటమాలే నయం.. వీడియో వైరల్‌

Gardener salary in USA: అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలని సంపన్నుడు కావాలని చాలా మంది కలలు కంటారు. అందుకే చాలా మంది చదువు కోవడానికి కూడా అమెరికా వెళ్తుంటారు. తర్వాత అక్కడే కొలువులు సంపాదించి తర్వాత అక్కడే స్థిరపడడంపై దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే వెళ్లే అమెరికాకు ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు కూడా వెళ్తున్నారు. అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఎన్నారై మహిళ చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటేనే అన్ని సమస్యలు పరిష్కారమనుకోవద్దు. గడ్డి కత్తిరించే పని చేస్తే టెక్‌ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చు’’ అని ఆమె వివరించారు. వేసవిలో సొంతంగా పని చేస్తే గంటకు 100 డాలర్లు (సుమారు రూ.8,500), నెలకు రూ.5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సాధ్యమని, ఇతరుల వద్ద పని చేసినా రూ.4 లక్షల వరకు వస్తాయని వివరించింది. చలికాలంలో మంచు తొలగించే (స్నో రిమూవల్‌) పనులు కూడా ఇందులో భాగమని వెల్లడించింది. ఈ వీడియో యువత, ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం ఆశపడేవారి మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

లాన్‌ కేర్‌ బిజినెస్‌తో అంత సపాదనా?
అమెరికాలో లాన్‌ కేర్‌ (గడ్డి కత్తిరించడం, ల్యాండ్‌ స్కేపింగ్‌) ఒక పెద్ద పరిశ్రమ. ఇది సీజనల్‌ బిజినెస్‌ – వేసవిలో డిమాండ్‌ ఎక్కువ. చాలా మంది సొంత బిజినెస్‌ ప్రారంభించి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సొంతంగా బిజినెస్‌ చేస్తే గంటకు 50 నుంచి 100 డాలర్లకుపైగా వసూలు చేయవచ్చు. సగటు లాన్‌ కేర్‌ బిజినెస్‌ యజమానుల సంవత్సరాదాయం సుమారు 1,28,000 డాలర్లు (రూ.1.1 కోట్లు) ఉంటుంది. టాప్‌ 10 శాతం వారు ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. చిన్న స్థాయిలో మొదలుపెడితే సంవత్సరానికి 45 వేల నుంచి 60 వేల డాలర్లు(రూ.40–50 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. లాన్‌ కేర్‌తోపాటు చలికాలంలో స్నో రిమూవల్‌ సర్వీస్‌ జోడించడం ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం కొనసాగుతుంది. ఇది లేబర్‌ ఇంటెన్సివ్‌ పని కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ

సాఫ్ట్‌వేర్‌ కన్నా బెటర్‌..
భారతీయులు అమెరికాలో చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల సగటు జీతం సంవత్సరానికి 80 వేల నుంచి 1,50 లక్షల డాలర్లు(రూ.70 లక్షలు నుంచి 1.3 కోట్లు) మధ్య ఉంటుంది. కానీ ఇందులో ట్యాక్స్, హౌస్‌ రెంట్, హెల్త్‌ ఇన్సూరెన్స్, కారు, పెట్రోల్‌ వంటి ఖర్చులు ఎక్కువ. లాన్‌ కేర్‌ బిజినెస్‌లో స్వంత యజమానిగా ఉంటే స్వేచ్ఛ ఎక్కువ, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీ చేతుల్లో ఉంటుంది. కానీ స్థిర జీతం లేదు, వాతావరణం, కస్టమర్లు, పోటీపై ఆధారపడి ఆదాయం మారుతుంది. శారీరక శ్రమ, బయట పని, మెషినరీ నిర్వహణ ఉండాలి.

టెక్‌ ఉద్యోగుల సైడ్‌ బిజినెస్‌..
చాలా మంది టెక్‌ ఉద్యోగులు సైడ్‌ బిజినెస్‌గా లాన్‌ కేర్‌ మొదలుపెడుతున్నారు. కొందరు పూర్తి సమయం మారి మంచి లాభాలు పొందుతున్నారు. ఈ బిజినెస్‌లో విజయం కోసం మార్కెటింగ్‌ (లోకల్‌ ఫ్లైయర్లు, నెక్ట్స్‌ డోర్‌ యాప్, గూగుల్‌ మ్యాప్స్‌), నాణ్యతైన సర్వీస్‌ మరియు రిపీట్‌ కస్టమర్లు. సీజనల్‌ సర్వీసులు అందిస్తున్నారు.

ఈ వైరల్‌ వీడియో ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది – ఉద్యోగం అంటే కేవలం ఏసీ క్యాబిన్, హై సాలరీ మాత్రమే కాదు. కష్టపడి, స్వంతంగా బిజినెస్‌ చేస్తే సంపాదన, సంతృప్తి ఎక్కువ కావచ్చు. అయితే, అందరికీ ఇది సరిపోదు. కొందరికి టెక్‌ ఉద్యోగాల్లో స్థిరత్వం, గ్రోత్‌ ఇష్టం. పని ఏదైనా చేయాలంటే గౌరవంగా, నైపుణ్యంతో చేయాలి. అమెరికా వంటి దేశాల్లో లేబర్‌ షార్టేజ్‌ వల్ల ఇలాంటి సర్వీసులకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular