Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu called Ram Charan: రామ్ చరణ్ కి ఫోన్ చేసిన మహేష్ బాబు......

Mahesh Babu called Ram Charan: రామ్ చరణ్ కి ఫోన్ చేసిన మహేష్ బాబు… ఆ విషయం మీద అంత సేపు మాట్లాడాడా..?

Mahesh Babu called Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబడుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి… ఇక సూపర్ స్టార్ […]

Mahesh Babu called Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబడుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి…

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఒక 30 మినిట్స్ పాటు మాట్లాడట. కారణం ఏంటి అంటే తను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చిస్తూనే తనదగ్గరికి ఒక కథ వచ్చిందని చెప్పాడట. ఆ కథను విన్న మహేష్ బాబు ఆ మూవీ నాకంటే రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అని ఆ దర్శకుడికి చెప్పారట. అందుకే ఆ కథని ఒకసారి వినమని రామ్ చరణ్ కి సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మహేష్ బాబుకి కథ చెప్పిన దర్శకుడు ఎవరు ఎందుకని మహేష్ బాబు ఆ మూవీ రామ్ చరణ్ కి సజెస్ట్ చేశాడు అనే విషయాలు ఇంకా బయటికి రావడం లేదు. కానీ మొత్తానికైతే ఈ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది…

మొత్తానికైతే మహేష్ బాబు రామ్ చరణ్ మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. వీరిద్దరు చాలా పార్టీల్లో కలిసి కనిపించారు. అలాగే ఫోటోలు కూడా దిగి ప్రేక్షకులను, అభిమానులను ఆనందపరిచారు… మొత్తానికైతే మహేష్ బాబు సజెస్ట్ చేసిన కథ తో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper