Homeవింతలు-విశేషాలుBlack Cat: నల్ల పిల్లి ఎదురైతే చాలు వాళ్లకే పండగే పండగ

Black Cat: నల్ల పిల్లి ఎదురైతే చాలు వాళ్లకే పండగే పండగ

Black Cat: ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తుంటే.. హఠాత్తుగా నల్ల పిల్లి ఏదైనా ఎదురైతే విపరీతంగా భయపడిపోతుంటాం. ఏదైనా కీడు జరుగుతుందని కంగారు పడిపోతుంటాం. నష్ట నివారణ చర్యగా వెనక్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చొని.. మళ్లీ పని మొదలు పెడతాం.

నల్ల పిల్లి అనేది దురదృష్టానికి సంకేతం అని.. చెడుకు ప్రతిరూపమని మనలో చాలామందికి ఒక బలమైన నమ్మకం. నల్ల పిల్లి ఎదురు రావడం మాత్రమే కాదు.. అది కనిపించినా సరే మనలో చాలామందికి భయం కలుగుతుంది. చిన్నప్పటినుంచి మన పెద్దలు మనలో పాదుకొల్పిన ఒక భయం కావచ్చు.. అందువల్ల నల్ల పిల్లి దురదృష్టానికి సంకేతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నల్ల పిల్లిని అపశకునం లాగా భావిస్తుంటారు. మనదేశంలో ఇలా ఉంటే.. ఇంగ్లాండ్ లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి పాత సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగే రోజున వధూవరులకు నల్లపిల్లి ఎదురైతే అదృష్టమని భావిస్తుంటారు. నల్ల పిల్లి ఎదురు కావడం వల్ల కొత్తజంట జీవితంలోకి రాబోయే నష్టాలను.. ముందే గ్రహిస్తుందని.. తనతో పాటు తీసుకెళ్లి పోతుందని.. అప్పుడు వారు సంతోషాలతో ఉంటారని నమ్ముతుంటారు.

నల్ల పిల్లి ఎదురైనప్పుడు కొన్ని ప్రాంతాలలో సంబరాలు కూడా చేసుకుంటారు. వధూవరులు ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని.. మన కష్టాలు తీరిపోయాయని ఆనందంగా గంతులు వేస్తారు. ఇంగ్లాండ్లో ఈ సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం నల్ల పిల్లిని చెడుకు సంకేతంగా చెబుతుంటారు పెద్దలు. పైగా సినిమాల్లో కూడా నల్ల పిల్లిని ప్రమాదానికి హేతువుగా.. అది కనిపిస్తే ఏదో ఘోరం జరిగిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంటారు.

ఇక ఇటీవల కాలంలో మనదేశంలో కూడా పిల్లులను పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారిలో కొంతమంది నల్ల పిల్లులను ఇష్టంగా పెంచుకుంటున్నారు. వాటికోసం ప్రత్యేకంగా సంరక్షకులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫీడ్ ఇవ్వడం… రకరకాల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నల్ల పిల్లుల మీద తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. జాతులను బట్టి పిల్లుల ధరలు ఉంటున్నాయి. కొంతమంది శ్రీమంతులు విదేశాల నుంచి నలుపు రంగు కు చెందిన పిల్లులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవి ఇంట్లో తిరగడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని.. సానుకూల దృక్పథం ఇంట్లో కనిపిస్తూ ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. కాకపోతే ఈ నల్ల పిల్లులకు ఈ కాలంలో విపరీతంగా డిమాండ్ పెరగడమే ఆశ్చర్యం

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular