Homeఅంతర్జాతీయంDonald Trump Angry Reaction: ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా...

Donald Trump Angry Reaction: ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా వణికిపోయిందిగా..

Donald Trump Angry Reaction: ఎప్పుడు నవ్వుతాడో తెలియదు.. ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు.. అసలు ఏం చేస్తాడో తెలియదు.. ట్రంప్ గురించి వైట్ హౌస్ వర్గాలలో నిత్యం జరిగే చర్చ ఇది. ఆ మధ్య అమెరికన్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలి మీద కథనాల మీద కథనాలు వచ్చాయి అంటే.. అతడు ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అప్పటికప్పుడు నవ్వుతుంటాడు. అంతలోనే కోపాన్ని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏదైనా చేస్తుంటాడు. మొత్తానికి అపరిచితుడు పాత్రను […]

Donald Trump Angry Reaction: ఎప్పుడు నవ్వుతాడో తెలియదు.. ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు.. అసలు ఏం చేస్తాడో తెలియదు.. ట్రంప్ గురించి వైట్ హౌస్ వర్గాలలో నిత్యం జరిగే చర్చ ఇది. ఆ మధ్య అమెరికన్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలి మీద కథనాల మీద కథనాలు వచ్చాయి అంటే.. అతడు ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అప్పటికప్పుడు నవ్వుతుంటాడు. అంతలోనే కోపాన్ని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏదైనా చేస్తుంటాడు. మొత్తానికి అపరిచితుడు పాత్రను కళ్ళ ముందు ఉంచుతాడు.

ట్రంప్ కోపం తెచ్చుకోవడం కొత్తకాదు. నవ్వడం కూడా కొత్త కాదు. కానీ ఈసారి ట్రంప్ లో కోపం తారస్థాయికి చేరింది. అతని ఆగ్రహానికి అమెరికా మొత్తం కంపించిపోయింది. అమెరికాలో ఎన్బిసి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ అనే జర్నలిస్ట్ ట్రంప్ తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా రకరకాల ప్రశ్నలను వెల్కర్ అడిగారు. దానికి ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త మధ్యలోనే ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాలిఫోర్నియా ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించాడు. దానికి వెల్కర్ ఆధారాలు ఉన్నాయా అని పదేపదే ప్రశ్నించారు. దీంతో ట్రంప్ లో ఆగ్రహం పెరిగిపోయింది. మరో మాటకు తావు లేకుండా మైక్ ను నేలకు విసిరి కొట్టాడు..”నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తివి.. మీ పత్రిక రంగం మొత్తం అవినీతి మయంగా మారిపోయింది. మీట్ ది ప్రెస్ అనేది అత్యంత మోసపూరితం. ఇక ఇక్కడితోనే ఆపేద్దాం.. థాంక్యూ డార్లింగ్” అంటూ ట్రంప్ వెళ్ళిపోయాడు.

మీట్ ది ప్రెస్ లో గతంలో ట్రంప్ బాగానే మాట్లాడేవాడు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ట్రంప్ చాలా సమయమనంతో ఉండేవాడు. ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో.. అమెరికా మీడియా మొత్తం ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద ప్రశ్నించడం మొదలుపెట్టిందో ట్రంప్ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. దీంతో మీడియా కనిపించగానే ఇలా రుస రుసలాడుతున్నాడు. అంతేకాదు తన ఆగ్రహాన్ని ఈసారి ఏకంగా మైక్ విసిరి కొట్టి ప్రదర్శించాడు. దీంతో ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరోవైపు తన మైకు విసిరి కొట్టడాన్ని ట్రంప్ సమర్ధించుకోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper