Women T20 World Cup 2026: నేటి నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నీ కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ శ్రీలంకతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల నుంచి పది గంటల 40 నిమిషాల వరకు ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 11 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపు 12 జట్లు పోటీ పడుతున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ వన్ లో భారత్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ 2 లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఐర్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగుతుంది. ప్రతి గ్రూపులో జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఆయా గ్రూపులలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీస్ వెళ్ళిపోతాయి. లీగ్ స్టేజ్లో 30 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఫస్ట్ సెమి ఫైనల్ మ్యాచ్ జూన్ 30న.. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జూలై 2న జరుగుతాయి. జూలై 5న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి, న్యూజిలాండ్ ఒకసారి పొట్టి ప్రపంచ కప్ అందుకున్నాయి. మా దేశం ఇప్పటివరకు ఒకసారి కూడా t20 వరల్డ్ కప్ అందుకోలేదు. మరోవైపు ఈ టూర్ ని బ్రాడ్ కాస్ట్ రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ లు మొత్తం టీవీలలో స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో వీక్షించవచ్చు.. ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 14న పాకిస్తాన్ తో ఆడుతుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. సెమీస్ లో ఆసీస్ ను మట్టి కరిపించింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. తద్వారా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. ఈసారి కూడా భారత మహిళలు అదే ఘనతను రిపీట్ చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
















జగన్ పేరులో G అంటే Gen G కాదు.. సరికొత్త అర్థం చెప్పిన లోకేష్
Nara Lokesh on Jagan: గతంలో నారా లోకేష్ మాట్లాడితే వైసీపీ వాళ్లు కాచుకుని కూర్చునే వారు. ఆయన మాట్లాడే మాటల్లో తప్పులు వెతికి ట్రోల్ చేసేవారు. దీంతో లోకేష్ తీవ్రంగా ఇబ్బందిపడేవారు. తెలుగుమీద నారా లోకేష్ కు అంతగా పట్టు ఉండేది కాదు. దానిని ఆసరాగా చేసుకుని వైసీపీ నాయకులు ఆయనను రకరకాలుగా విమర్శించేవారు. ఆ విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక లోకేష్ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కాలంమారింది. నారా లోకేష్ మాట్లాడిన ఏ తెలుగునైతే వైసీపీ వాళ్లు విమర్శించారో.. ఇప్పుడు అదే లోకేష్ తెలుగులో ఇరగదీస్తున్నాడు.
తెలుగులో అనర్ఘళంగా మట్లాడుతున్న లోకేష్..వైసీపీ వాళ్లు అంచనా వేయలేని విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రతి సమావేశం చివరిలో నారా లోకేష్ తనదైన పంచ్ లు వేస్తూ మీడియా కావాల్సిన మసాలా అందిస్తున్నారు. దీంతో మీడియాలో, సోషల్ మీడియాలో నారా లోకేష్ పేరు హోరెత్తిపోతోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రెండెళ్లపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం తిరుపతి సమీపంలో సభ నిర్వహించింది. ఈసభలో నారా లోకేష్ అడుగడుగునా పంచ్ లు వేశారు. వైసీపీ నాయకులకు గుక్క తిప్పుకోని పరిస్థితి కల్పించారు.
జగన్ ఇటీవల చంద్రబాబు పరిపాలనను విమర్శిస్తూ కాక్రోచ్ లు వస్తాయని, జన్ జెడ్ తరం ఉద్యమిస్తుందని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి లోకేష్ తిరుపతి వేదికగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తన పేరులో ఉన్న జీ ని చూసి జన్ జీ అనుకుంటున్నారని..కానీ జీ అంటే గొడ్డలి అని లోకేష్ ఆరోపించారు. అందువల్లే వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని లోకేష్ విమర్శించారు.
జగన్ మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ జబ్బు ఉందని లోకేష్ విమర్శించారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ ప్రాజెక్టులను తానే తెచ్చానని చెబుతుంటారని, చివరికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది మా తాతే అంతారేమోనని లోకేష్ విమర్శించారు. తిరుపతి సభలో లోకేష్ తన చెప్పులు విడిచి ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ చేసి.. తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ప్రారంభంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను, పథకాలను వివరించారు. ఆ తర్వాత వైసీపీ రెండేళ్ల పాలనపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ ఎంతలా నష్టపోయిందో అంకెలతో సహా వివరించారు. లోకేష్ ప్రసంగిస్తుంటే చంద్రబాబు, పవన్ ఆసక్తిగా విన్నారు.