UAE Iran Economic Cooperation: అమెరికా–ఇరాన్ వార్ ఇంకా ముగియలేదు. తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ నిన్నటి వరకూ ఇరాన్‌పై దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలు యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌పై దాడులు చేసింది. ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేసింది. ఇలాంటి పరిస్థితిలో యూఏఈ అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్ దాడిని ఎదుర్కొన్న గల్ఫ్ దేశం.. ఇరాన్‌కే ఇప్పుడు ఆర్థిక సహకారం అందించింది. మొత్తం 10 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని, వాటిలో 3 బిలియన్ డార్లకంటే కంటే ఎక్కువ ఇప్పటికే ఇరాన్‌కు అందించింది.
ఖండించిన యూఏఈ…
ఇదిలా ఉంటే యూఈఏ–ఇరాన్ ఆర్థిక సహకారం పునరుద్ధరణ వార్తలను యూఏఈ ఖండించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయిటర్‌లో వచ్చిన వార్తలను పూర్తిగా తిరస్కరించింది. ‘‘ఫ్రోజెన్ ఇరానియన్ ఫండ్స్ ఏవీ విడుదల చేయలేదు, బదిలీ చేయలేదు లేదా సులభతరం చేయలేదు’’ అని అధికారికంగా ప్రకటించింది. వార్తలు వాస్తవాల ఆధారంగా లేవని, మీడియా అధికారిక వనరులపై ఆధారపడాలని సూచించింది.
యూఏఈపై ఇరాన్ దాడులు..
అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో యూఏఈ ఆర్థిక వ్యవస్థకు (లాజిస్టిక్స్, ఎనర్జీ, బ్యాంకింగ్) గణనీయమైన నష్టం కలిగించింది. యూఏఈ చారిత్రకంగా ఇరాన్ ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా ఉంది, కానీ ఇటీవలి దాడుల తర్వాత భద్రతా చర్యలు తీసుకుంది. యూఏఈ మిత్రరాజ్యం (అబ్రహామ్ అకార్డ్స్, ఆయుధ ఒప్పందాలు), అయినప్పటికీ ప్రాగ్మాటిక్ విధానం అనుసరిస్తుంది. చైనా, ఇతర శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ, తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇరాన్‌తో సంభాషణలు జరపడం సాధారణం.
ట్రంప్‌పై నమ్మకం కోల్పోయిన యూఏఈ..
యుద్ధం నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికాపై యూఏఈ నమ్మకం కోల్పోయింది. యూఎస్‌పై ఆధారపడటం ఆర్థిక నష్టం అని భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడుల నుంచి తక్షణ రక్షణ ఇరాన్‌తో సహకారం పునరుద్ధరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఫండ్స్ అన్‌లాక్ అయితే యూఏఈ–ఇరాన్ వాణిజ్యం పుంజుకుంటుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయి. నిజానికి యూఏఈ ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని ముందు ఆలోచించింది.ఇప్పుడు దాడులు ఆపడానికి వ్యతిరేక దిశలో వెళ్తే అది వాస్తవిక భద్రతా అవసరం.
యూఏఈ వంటి దేశాలు తమ ఆర్థిక–భద్రతా ప్రయోజనాల కోసం బహుముఖ విధానం అనుసరిస్తాయి. ట్రంప్ పరిపాలనలో అమెరికాకు మద్దతు ఉన్నప్పటికీ, తన స్వంత ప్రయోజనాలను రక్షించుకోవడం సహజం. ప్రాంతీయ శాంతి కోసం దౌత్యం ముఖ్యం.
SHOCKING! UAE Just Delivered a MASSIVE, HUMILIATING SLAP to TRUMP
UAE no longer Trusts America Under Trump!
UAE is set to unlock $10 billion in sanctioned Iranian funds to renew economic cooperation with Iran .
$3 BILLION already sent!
In return, Iran… pic.twitter.com/GMpFaoze9y
— World updates (@itswpceo) June 12, 2026
















అప్పుడు బూతులు.. ఇప్పుడు భక్తి.. కొడాలి నాని లో ఏం మార్పు!
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ సౌండ్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు. తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన క్రమంలో ఆయన సైలెంట్ గా ఉండలేదు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. వైసిపి పై గొడ్డలి పార్టీ ప్రచారంపై మండిపడ్డారు. అది పరశురాముడి గొడ్డలి అని.. శివుడు చేతిలో ఉన్న గొడ్డలి అని ఆధ్యాత్మిక ప్రబోధం చేశారు. ఆధ్యాత్మిక కామెంట్స్ చేశారు. అందులో కూడా తనదైన దూకుడు తనం చూపించారు. అయితే కొడాలి నాని అన్నింటికి తెగించినట్టు కనిపిస్తున్నారు.
* ఓటమితో ఫుల్ సైలెన్స్..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయేవారు కొడాలి నాని. కానీ అధికారానికి దూరమయ్యేసరికి ఆయన ఫుల్ సైలెన్స్ పాటించాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం మొదలైంది అప్పట్లో. అందుకు తగ్గట్టుగానే ఆయనపై వ్యతిరేక ఫిర్యాదులు బాగానే వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ పేరు మోసిన ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన చాలా రోజులపాటు హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయన విషయంలో పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు కోలుకోవడంతో బయటకు వచ్చి తిరిగి విమర్శలు చేస్తున్నారు.
* మారిన వైఖరి..
కానీ గతం కంటే కొడాలి నాని వైఖరి మారింది. గతంలో బూతులతో రెచ్చిపోయే కొడాలి నాని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారో తెలియదు కానీ.. ఆయన పుణ్యమా అని పార్టీపై బూతుల ప్రభావం కనిపించింది. తటస్తులు సైతం ఆయన వైఖరిని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన నోటి నుంచి ఆధ్యాత్మిక పలుకులు వస్తున్నాయి. ఇటీవల గొడ్డలి పార్టీ అంటూ కూటమి పార్టీ నేతలు వైసిపి పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు కొడాలి నాని. దేవుళ్ళ చేతిలో ఉన్న గొడ్డలిగా దానిని అభివర్ణించారు. ఇదే పాత నాని అయి ఉంటే.. నీ అమ్మ మొగుడు.. అంటూ విరుచుకు పడేవారు. ఇప్పుడు మాత్రం భక్తి మాటలు ఆడుతున్నారు. ఎంతలా కొడాలి నాని మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉంటే బూతులు.. ప్రతిపక్షంలో ఉంటే భక్తి అన్నట్టు ఉంది కొడాలి నాని పరిస్థితి.