Youth Alcohol: రోజంతా ఎంతో కష్టపడి సాయంత్రం హ్యాపీగా ఉండాలని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివారు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడుతున్నారు. ఇందులో ప్రధానంగా మధ్య ఉంటుంది. మద్యం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని.. ఎన్నో కష్టాలను దూరం చేస్తుందని.. చాలామంది దీనికి అలవాటు పడుతున్నారు. అయితే కొందరు కేవలం రిలాక్స్ కోసమే అంటూ మితంగా మద్యం తీసుకుంటుండగా.. మరికొందరు మాత్రం దీనిని ఒక వ్యసనం గా మార్చుకొని పీకలదాకా తాగుతున్నారు. తాగడం మాత్రమే కాకుండా రచ్చ చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ మద్యం తీసుకోవడం చాలా తక్కువ అని ఆస్ట్రేలియా కు చెందిన ప్లీడర్స్ యూనివర్సిటీ తెలిపింది. మరి అలా ఎందుకు తగ్గిందో ఈ వివరాల్లోకి వెళ్లి చూడండి..
ఆస్ట్రేలియా ప్లిండర్స్ యూనివర్సిటీ మద్యం సేవిస్తున్న వారిపై రీసెర్చ్ చేసింది. ఇందులో 23,368 మందిని పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో శతాబ్దాల నుంచి మద్యం సేవిస్తున్న వారి డేటాను సేకరించింది. వీరిలో బేబీ బూమర్లు, మిలీనియల్స్, Gen 2 లను తీసుకున్నారు. వీరిలో బేబీ బూమర్లు ఎక్కువగా మద్యం సేవించినట్లు తేలింది. ఆ తర్వాత మిలీనియల్స్ తక్కువగానే ఆల్కహాల్ తీసుకున్నా.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు. Gen 2 కేటగిరీకి చెందినవారు మిగతా రెండిటితో పోలిస్తే తక్కువ మద్యం తీసుకున్నట్లు తేలింది. Gen 2 కేటగిరికి చెందిన వారు అంటే 1997 నుంచి 2012 సంవత్సరం మధ్య మద్యం తాగిన వారిని పరిణలోకి తీసుకుంటే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గినట్టు తేలింది.
అయితే ఆల్కహాల్ తక్కువ తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేటి యువత ఎక్కువగా కెరీర్ పై ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలో మద్యంపై ఆలోచన ఎక్కువగా ఉండడం లేదు. స్కూల్ చదువుల నుంచే ప్రతిరోజు బిజీగా ఉండడంతో ఇతర వ్యాపకాలపై దృష్టి పడడం లేదు. ఒకవేళ ఉద్యోగం పొందిన యువత సైతం ఖర్చుల విషయంలో భయపడుతూ వృధా ఖర్చులను చేయడం లేదు. ముఖ్యంగా వ్యసనాలపై అవగాహన రావడంతో వాటి జోలికి వెళ్లడం లేదు. అయితే కొందరు వీకెండ్ ఇతర పార్టీలోకి వెళ్లిన సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో మద్యం తీసుకుంటున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే రెండు తరాల నుంచి మూడో తరం వరకు మద్యం వినియోగం తగ్గుతూ వస్తుంది. ముందు తరాల్లో కూడా మద్యంపై మక్కువ తగ్గించే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టేవారు తయారవుతున్నారు. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న క్రమంలో యువతలో ఆశలు, లక్ష్యాలు పెరిగి కేవలం జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.