Lawrence John Ripple: సంసార జీవితం అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి సంసారం అనేది పూల పాన్పు మాదిరిగా ఉంటుంది. మరికొందరికి ఏమో నిత్య నరకం లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అందమైన సంసార జీవితం ఉన్నవారు తమ భార్యతో గొప్పగా జీవిస్తూ ఉంటే.. సంసార జీవితం అద్వానంగా ఉన్నవారు నిత్యం ఇబ్బంది పడుతూనే ఉంటారు. తమ భాగస్వామితో చీటికిమాటికి గొడవలు పడుతూనే ఉంటారు.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కేవలం మనదేశంలో మాత్రమే ఉండవు. ప్రపంచంలో అంతటా కూడా ఇదే పరిస్థితి. చివరికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీనికి మినహాయింపు కాదు. సూర్యకాంతం లాంటి భార్యలతో ఇబ్బంది పడే భర్తలు నరకం చూస్తుంటారు. ఆ బాధను తట్టుకోలేక ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందేమో అనుకుంటారు. కొందరైతే భార్యలు పెడుతున్న బాధలను చూడలేక.. వారి వేధింపులను తట్టుకోలేక జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడుతుంటారు.. ఈ జాబితాలో ఈ వ్యక్తి ముందు వరుసలో ఉంటాడు. భార్య వేధింపులు తట్టుకోలేక అతడు ఏకంగా జైలుకు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతడికి పరిస్థితి ఎదురు తన్నింది.
అతడి పేరు లారెన్స్ జాన్ రిపిల్. వయసు 70 సంవత్సరాలు. అతని భార్యతో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రిపిల్ ఇంట్లో హెయిర్ డ్రయర్ కింద పడిపోయి పగిలింది. ఈ నేపథ్యంలో దాన్ని బాగు చేయమని అతడి భార్య ఆదేశించింది. కానీ, అతడు దానిని బాగు చేయలేకపోయాడు. దీంతో భర్త నిర్వాకాన్ని చూసి ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడికి ఇంట్లో ఉండడం కంటే జైలుకు వెళ్లడం నయం అనిపించింది. మరో మాట కావాలి లేకుండా తన ఇంటి పక్కనే ఉన్న బ్యాంకు వద్దకు అతడు వెళ్ళాడు. అక్కడ తుపాకి చూపించి క్యాషియర్ కు ఒక చీటీ ఇచ్చాడు. ఆ చీటీలో తనకు 3వేల డాలర్లు ఇవ్వాలని రాశాడు. భయపడిన క్యాషియర్ అలాగే డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న రిపిల్.. “నీకు దమ్ముంటే పోలీసులను పిలువు. నేను ఇక్కడే బల్లమీద కూర్చుంటానని” క్యాషియర్ ను రెచ్చగొట్టాడు.
రిపిల్ ఆ మాట అనడంతో క్యాషియర్ రెచ్చిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి రిపిల్ ను తీసుకెళ్లారు. తన మీద కేసు నమోదు చేయాలని.. తనను జైల్లో పెట్టాలని రిపిల్ పోలీసులను కోరాడు. పోలీసులు అతడిని కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు మొత్తం మీద న్యాయమూర్తి రిపిల్ కు విభిన్నమైన శిక్ష విధించాడు.
రిపిల్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని.. అతడు ఇంట్లోనే ఉండాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అతడు బయటికి రాకుండా ఉండడానికి ఇంటి ఎదుట సెక్యూరిటీ గార్డెను కాపలా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆ తీర్పు ఇవ్వడంతో రిపిల్ కోర్టులో ఏడ్చాడు. భార్య వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రిపిల్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.