https://oktelugu.com/

bird : ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఈ పక్షి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలిస్తే మరికొన్నింటి గురించి ఇప్పటికి కూడా రహస్యంగానే ఉండిపోయింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 17, 2024 / 04:00 AM IST

    bird

    Follow us on

    bird : ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలిస్తే మరికొన్నింటి గురించి ఇప్పటికి కూడా రహస్యంగానే ఉండిపోయింది. ఇక వాటి గురించి కూడా తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తు. అయితే పక్షులు, జంతువులను చూసినప్పుడు భలే అనిపిస్తుంది కదా. వాటి పనులు అవి చేసుకుంటూ కొన్నిసార్లు వింత పనులు చేస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.కొన్ని పక్షుల చరిత్ర తెలిస్తే నమ్మడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. కానీ నమ్మాలి. ఇప్పుడు అలాంటి ఓ పక్షి గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత పురాతన పక్షి విజ్డం. అయితే దీని గురించిన వాస్తవాలు, విషయాలు తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి అవేంటి అనుకుంటున్నారా?

    విజ్డమ్, ఒక లేసన్ ఆల్బాట్రాస్. దాదాపు 74 సంవత్సరాల వయస్సు ఉందట ఈ పక్షి. లేసన్ ఆల్బాట్రోసెస్ అనేది హవాయి దీవులకు చెందిన సముద్ర పక్షుల జాతి. విజ్డమ్ హవాయిలోని మిడ్‌వే అటోల్ నేషనల్ వైల్డ్‌లైఫ్ రెఫ్యూజ్‌ లో ఉంటుంది. ఈ విజ్డమ్ తన జీవితకాలంలో 30 కోడిపిల్లలను పెంచింది. తాజాగా ఈ పక్షి 60వ గుడ్డు కూడా పెట్టింది. విజ్డమ్ తన జీవితాంతం అనేక మంది సహచరులను కూడా కలిగి ఉంది అంటే మీరు నమ్ముతారా? అయితే ఇప్పుడు ఆ పక్షికి చాలా యంగ్ సహచరుడు ఉన్నాడట.

    విస్డమ్ అద్భుతమైన వయస్సు ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో జీవించి ఉన్న అతి పెద్ద అడవి పక్షిగా చోటు సంపాదించింది. విజ్డమ్ దీర్ఘాయువు లేసన్ ఆల్బాట్రోస్, వాటి ఆవాసాల కోసం పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి సహాయపడింది. విజ్డడ్ ను 1956 నుంచి వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు ట్రాక్ చేశారు. ఇది లేసన్ ఆల్బాట్రోసెస్ ప్రవర్తన, జీవావరణ శాస్త్రంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. నివాస క్షీణత, వాతావరణ మార్పులు, వేట వంటి వాటితో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, విజ్డమ్ అభివృద్ధి చెందుతూనే ఉంది.

    ఇక భూమి మీద ఉన్న విలువైన వన్యప్రాణులను రక్షించడం కోసం అంటే ఇలాంటి విజ్డమ్ లను కాపాడటం కోసం స్థితిస్థాపకత, అనుకూలత, పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యతకు మన దేశం చిహ్నంగా మారింది. ఇక ఈ పక్షిని తొలిసారి అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు 1956లో గుర్తించారు. ఆ సమయంలోనే దీని వయసు 5-6 సంవత్సరాలు. అప్పటి నుంచి విస్డమ్ అమెరికాలోని హవాయి ద్వీపాల్లోని మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్ లైఫ్ లో తన జీవితం సాగిస్తుంది. అయితే దీన్ని ఎవరూ బంధించలేదు. ఇది ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేస్తూనే ఉంటుంది. పెద్ద రెక్కలు ఉండే ఈ సముద్ర పక్షి సంవత్సరానికి ఒక గుడ్డును పెడుతుంది. రీసెంట్ గా ఈ పక్షి పెట్టిన 60వ గుడ్డు గురించి పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారికంగా ఫేస్ బుక్ ద్వారా తెలిపింది.