https://oktelugu.com/

Currency: కరెన్సీ నోట్లు ప్రింటింగ్ ఎక్కడ.. మనదేశంలోనా? లేకపోతే ఇతర దేశంలోనా?

దేశంలో కరెన్సీ నోట్లను మొత్తం నాలుగు చోట్లలో ముద్రిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్, మధ్య ప్రదేశ్‌లోని దేవాస్, కర్ణాటకలోని మైసూర్ నగరం, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనిలో కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2024 / 04:16 AM IST

    indian currency

    Follow us on

    Currency: దేశంలో వేల కోట్ల డబ్బు ఉంది. అసలు డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. అన్నింటికి కూడా డబ్బుతోనే పని. ఆహారం, చదువు ఇలా అన్నింటికి కూడా డబ్బు ఉండాలి. ఆఖరికి నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరూ కూడా విలువ ఇస్తారు. లేకపోతే చాలా చీప్‌గా చూస్తారు. ఈ రోజుల్లో అయితే  ప్రతీ దానికి రూపాయితోనే పని ఉంటుంది. ఆ రూపాయి లేకపోతే అసలు జీవితంలో దేనికి పనికి రారు. ఆఖరికి చదువు కూడా సరిగ్గా చదువుకోలేరు. దేశంలో ధనిక, పేద, మధ్యతరగతి వారు అంటూ ఇలా ఎందరో ఉన్నారు. అందరికీ కూడా డబ్బు అవసరం తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. అయిన కూడా కరెన్సీతో పని ఉంది. చాలా మంది కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు రూ.2000 నోట్లు కూడా ఉండేవి. కానీ అవి ప్రస్తుతం చలామణీలో లేవు. అయితే మనం ప్రతీ దానికి కరెన్సీ నోట్లు వాడుతుంటాం. మరి ఈ కరెన్సీ నోట్లను ఎలా? ఎక్కడ తయారు చేస్తారనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ఆ విషయాలేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    దేశంలో కరెన్సీ నోట్లను మొత్తం నాలుగు చోట్లలో ముద్రిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్, మధ్య ప్రదేశ్‌లోని దేవాస్, కర్ణాటకలోని మైసూర్ నగరం, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనిలో కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తారు. వీటిలో నాసిక్, దేవాస్ ప్రింటింగ్ ప్రెస్‌లు భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. మైసూర్, సల్బోని ప్రింటింగ్ ప్రెస్‌లు రిజర్వ్ బ్యాంక నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఉంటాయి. ఈ కరెన్సీ పేపర్లు తయారు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. పత్తి, కాటన్‌తో ప్రత్యేకంగా ఓ పదార్థాన్ని తయారు చేస్తారు. వీటిలో కాస్త లెనిన్, జెలటిన్, సింథటిక్ ఫైబర్స్ కలుపుతారు. వీటివల్ల నోట్లు చెరగకుండా గట్టిగా ఉంటాయి. ఈ నోట్లకు ఉన్న క్వాలిటీ సాధారణ పేపర్లకు రాదు. ఎవరైనా నకిలీ నోట్లు తయారు చేసిన కూడా ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఎందుకంటే వీటి అంతా క్వాలిటీతో నకిలీ కరెన్సీలు ఉండవు. అలాగే కరెన్సీ నోట్లపై మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ లేకపోతే అవి నకిలీ నోట్లే అని గుర్తు పట్టవచ్చు.

    దేశంలో కేవలం నాణేలు మాత్రమే ఉండేవి. అవే దేశంలో అన్ని చోట్ల చలామణీ అయ్యేవి. అయితే మన దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత దేశంలోని నాణేలను నోట్లుగా మార్చారు. 1969లో మహాత్మా గాంధీ 100వ జయంతి సందర్భంగా ఇంగ్లాండ్ రాజు జార్జ్ రాజు ఫొటో ఉన్న నాణేలను వాడటం ఆపేశారు. ఇక అప్పటి నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి. అప్పటి నుంచి నోట్లు వాడకం పెరిగింది. ఇక మోదీ ప్రభుత్వం 2014లో పాత నోట్లను ఆపేసింది. వాటి స్థానంలో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కొత్త నోట్లనే వాడుతున్నారు.