https://oktelugu.com/

X Virus: కరోనా కంటే డేంజర్ వ్యాధి.. మళ్లీ మాస్క్‌లు పెట్టాల్సిందే

ఇటీవల కూడా ఐ బ్లీడింగ్ వైరస్ అనేది వచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు X అనే వ్యాధి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వ్యాధి కరోనా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి బారిన పడిన వారు వెంటనే మరణించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ X వ్యాధిని తెలియని వ్యాధి అని కూడా అంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2024 / 03:11 AM IST

    x virus

    Follow us on

    X Virus: ప్రపంచాన్ని కోవిడ్ ఎంతో భయపెట్టింది. దీనివల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇష్టమైన వ్యక్తులను పొగోట్టుకున్నారు. అయితే దేశంలో వ్యాధులు రావడం కొత్తేమి కాదు. 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2020లో కరోనా అన్ని కూడా ప్రజలను భయపెట్టినవే. వీటివల్ల ఎందరో వాళ్ల ప్రాణాలను కోల్పోయారు. ఇలా ఒక్కోసారి కొత్త కొత్త వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఇటీవల కూడా ఐ బ్లీడింగ్ వైరస్ అనేది వచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు X అనే వ్యాధి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వ్యాధి కరోనా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి బారిన పడిన వారు వెంటనే మరణించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ X వ్యాధిని తెలియని వ్యాధి అని కూడా అంటారు. ఇది వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా మనుషులకు సోకుతుంది. ప్రజలు మళ్లీ మాస్క్‌లు పెట్టుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి కూడా ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకుతుంది. ఎవరైతే నీరసంగా ఉండటం, శుభ్రత పాటించని వాళ్లలో ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?
    రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ అరగంట సేపు ఎండలో కూర్చోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. ఆకుపచ్చ కూరగాయలు డైలీ డైట్‌లో తినడంతో పాటు రాత్రి పసుపు పాలు తాగాలి. అలాగే రోజూ అరగంట పాటు యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తులసి టీ, సీజనల్ పండ్లు, బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. కొందరు రక్తహీనత, ఐరన్, విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్లకి ఈ వ్యాధి తొందరగా సోకుతుంది. కాబట్టి పోషకాలు ఉండే ఫుడ్‌ను తినాలి. తినే ఫుడ్‌లో కాల్షియం అధికంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల విటమిన్ ఎ, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అదే కాల్షియం లోపం ఉంటే డిప్రెషన్, కీళ్ల నొప్పులు బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్క్ పెట్టుకోవాలి. శుభ్రత పాటించాలి. రోజూ వ్యాయామం చేయాలి. పదే పదే ముఖాన్ని చేతులతో తాకకూడదు.

    ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా కరోనా లక్షణాలే కనిపిస్తాయి. రోగుల్లో జ్వరం, తలనొప్పి, రక్తహీనత, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అజాగ్రత్త వహించకుండా వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఫడ్ చేసేటప్పుడే కాకుండా ప్రతీ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కరోనా వ్యాధికి ఎలా శుభ్రత, రోగనిరోధక శక్తి పెంచుకోవాలో దీనికి కూడా అలానే పాటించాలి. అప్పుడే మీరు ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.