Korean Kanakaraju Teaser: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ తేజ్ హీరో గా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజ్’. గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకులు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం లో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. వైవిద్యం లేకుండా వరుణ్ తేజ్ సినిమా ఉండదు. ఎన్ని ఫ్లాప్ సినిమాలు ఎదురైనా సరే , ఆయన నమ్మిన వైవిధ్యాన్ని మాత్రం వదిలిపెట్టడు. దురదృష్టం కొద్దీ ఈమధ్య చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయి.
‘కొరియన్ కనకరాజు’ కూడా వైవిద్యం తో కూడిన ప్రయోగాత్మక చిత్రమే అని గ్లింప్స్ సమయం లోనే ఒక క్లారిటీ వచ్చింది. ఇక నేడు విడుదల చేసిన టీజర్ ని చూస్తుంటే , ఈసారి ఎదో వర్కౌట్ అయ్యే ప్రయోగం లాగానే అనిపిస్తుంది. ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ని రెండు విభిన్నమైన కోణాల్లో చూపించారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. రాయలసీమ కుర్రాడిగా ఒక కోణం లో కనిపిస్తే , కొరియన్ డాన్ గా మరో కోణం లో కనిపించారు. కొరియా నుండి ఒక మీడియా రిపోర్టర్ (హీరోయిన్ రితిక నాయక్) తనతో పాటు ఒక జీనీ షేప్ లో ఉన్న ఒక మంత్రిచదగ్గ డబ్బా ని తీసుకొస్తుంది. అందులో ఉన్న ఆత్మ హీరో శరీరం లోకి దూరుతోంది. ఆ ఆత్మా కొరియన్ దేశాలను గడగడా వణికించిన మాఫియా డాన్ కి సంబంధించినది అన్నమాట. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే ఈ సినిమా స్టోరీ అని టీజర్ ని చూస్తుంటే తెలుస్తోంది.
ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ , ఫాంటసీ జానర్లతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ డాన్ గా అదిరిపోయాడు. తమన్ అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఓవరాల్ గా చూస్తుంటే , ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అభిమానులను , ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ సినిమా టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ ఏడాది ఫ్లాప్ హీరోలకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే సూర్య , అఖిల్, రామ్ చరణ్ వంటి వారు భారీ కం బ్యాక్స్ ఇచ్చారు. ‘కొరియన్ కనకరాజ్’ తో వరుణ్ తేజ్ కూడా కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

