Pawan Kalyan: ‘అతనొక్కడే’ సినిమాతో దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయిన రవితేజతో చేసిన ‘కిక్’ సినిమా ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత చేసిన రేసుగుర్రం, ధృవ సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సురేందర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు అతని షోల్డర్ కి సర్జరీ జరిగింది. ప్రస్తుతం రైట్ షోల్డర్ కి సర్జరీ చేశారు. మరో మూడు నెలల తర్వాత లెఫ్ట్ షోల్డర్ కి సైతం సర్జరీ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
మరి వీటన్నింటిని దాటుకొని సురేందర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయగలుగుతాడా? పవన్ కళ్యాణ్ హెల్త్ పరంగా, పాలిటిక్స్ పరంగా చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే అతను సురేందర్ రెడ్డి తో చేయబోయే సినిమా మీద ఎన్ని డేట్స్ కేటాయిస్తాడు. మరొక సంవత్సరం పోతే 2029 కి సంబంధించిన ఎలక్షన్స్ పనుల్లో పవన్ కళ్యాణ్ బిజీ కానున్నాడు.
మరి ఈ సంవత్సరకాలంలోనే సురేందర్ రెడ్డితో సినిమా చేసే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక రకంగా చూస్తే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని చాలా రోజులపాటు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు. వేరే హీరోతో సినిమా చేసుకుంటే అతనికి మంచి గుర్తింపు వస్తుందని అలాగే తన సమయం కూడా వృధా కాదని కొంతమంది అతనికి సలహాలను ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీగా ఉన్నప్పుడు అతనితో సినిమా చేసుకుంటే బెటర్ అని చెబుతున్నారు.
ఈ లెక్కన ఏజెంట్ సినిమా రిలీజ్ అయిపోయి మూడు సంవత్సరాలు అయినప్పటికి సురేందర్ రెడ్డి ఇప్పటివరకు మరో సినిమా స్టార్ట్ చేయలేదు. మరి ఇలాగే ఉంటే తన కెరీర్ ని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అని మరి కొంతమంది హెచ్చరిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఏం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ కోసమే తన సమయాన్ని కేటాయిస్తాడా? లేదంటే వేరే హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది…
