Daivalaguda Raj Kumar: 14 బృందాలు.. ఎంతోమంది పోలీసులు.. సీసీ కెమెరాలు.. వీళ్లే కాక గ్రామస్తులు.. ఇంతమంది బతుకుతున్నప్పటికీ షాబాద్ దైవాలగూడ ఆరు హ*త్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభించలేదు. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ నుంచి.. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. రాజ్ కుమార్ మీద ఫోక్సో సరిగా పెట్టలేకపోవడం.. సెక్షన్లను బలంగా నమోదు చేయలేకపోవడంతో.. అతడికి ఈజీ గానే బెయిల్ వచ్చింది.
బెయిల్ ఈజీగా రావడంతో రాజ్ కుమార్ తన క్రూరత్వాన్ని మరింత పెంచుకున్నాడు. ఆ బాలికను దారుణంగా హత మార్చాడు. ఆమె తల్లిని.. నానమ్మను కూడా అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత భార్యను.. ఇద్దరు పిల్లల్ని కూడా పాశవికంగా చంపేశాడు. అనంతరం రాజ్ కుమార్ తన కారులో పరారయ్యాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన కారును పక్కనపెట్టి పారిపోయాడు.
ఈ హత్యల వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలని.. అతడిని బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మృతుల కుటుంబ సభ్యులు రోడ్డుమీదికి ఎక్కి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. శనివారం తెల్లవారుజామున హత్యల పరంపర జరిగితే.. సోమవారం ఉదయం నాటికి కూడా రాజ్ కుమార్ ఆచూకీ లభించలేదు. మధ్యలో అతడు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ ఎదురుగా నిలుచున్నాడని.. చనిపోవాలని అనుకున్నాడని.. ఆ తర్వాత విరమిచ్చుకున్నాడని సిసి టీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అంతకుముందు ఒక రైతు వద్దకు వెళ్లాడని… అతడు తెచ్చుకున్న క్యారేజ్ తినేందుకు ప్రయత్నించాడని.. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడని తెలిసింది.
రాజ్ కుమార్ ను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి అతడి ఆచూకీ చెబితే రెండు లక్షల రివార్డ్ కూడా ఇస్తామని ప్రకటించింది. ఎందుకు చేసినప్పటికీ రాజ్ కుమార్ ఆచూకీ లభించలేదు. అయితే అతడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పేంజర్ల ప్రాంతంలో చనిపోయాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పేంజర్ల ప్రాంతంలో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం అతడిదే అని పోలీసులు నిర్ధారించారు. అతని శవం పక్కన ఒక పాయిజన్ బాటిల్ లభించింది.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా మరో కారణం చేత చనిపోయాడా అనేది తెలియ రాలేదు.
గతంలో అప్పులు ఎక్కువ కావడంతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా విషం తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి అతడిని బతికించారు . ఇటీవల ఆ బాలిక మీద దారుణానికి పాల్పడ్డ నేపథ్యంలో పోలీసులు అతడి మీద ఫోక్సో కేసు పెట్టారు. ఆ తర్వాత తన పలుకుబడితో బయటికి వచ్చిన తర్వాత.. ఇంటిల్లిపాది మొత్తం ఆత్మహత్య చేసుకుందామని భార్యతో చెప్పాడు. గడ్డి మందు కూడా తెచ్చాడు. అప్పుడు భార్య వారించడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. చివరికి ఆరుగురిని చంపి.. అతడు ఇలా తన ప్రాణాన్ని తీసుకున్నాడు.
