Telugu Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళను టాప్ లెవెల్లో నిల్చోబెడుతున్నాయి… ఇక మన దర్శకులకు పాన్ ఇండియాలో సూపర్ క్రేజ్ రావడంతో ఎలాగైనా సరే సినిమాలను చేసి భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. వాళ్ళు ఈ సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే మన తెలుగులో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సైతం బాలీవుడ్ హీరో అయిన అజయ్ దేవగన్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అతను రీసెంట్ గా ముంబై వెళ్లి అజయ్ దేవగన్ ని కలిసాడనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం మన తెలుగు దర్శకుల పైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ఇది ఇలా ఉంటే నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన కళ్యాణ్ కృష్ణ సైతం బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇప్పటికే వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే మన తెలుగు దర్శకులను బాలీవుడ్ స్టార్ హీరోలు వదిలిపెట్టడం లేదు. ఎవరు దొరికితే వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప క్రేజ్ ఉంది. తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తే మినిమం గ్యారంటీ సినిమాగా ఆడుతుందని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకి సినిమాలు చేసే అంత కెపాసిటి లేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అందువల్లే మన వాళ్ళ వైపు వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…
