Woman Married 12 Times Story: ఆమె అందరిలాంటి మహిళ కాదు. చాలా డిఫరెంట్. చెమట చుక్క చిందించకుండా.. ఒళ్ళు వంచకుండా డబ్బులు సంపాదించాలనే టైపు. పైగా ఆ డబ్బులు కూడా పది మందిని ముంచి వెనకేసుకోవాలనే టైపు. అలానే చేసింది. అనేక సందర్భాల్లో ఆమె ప్లాన్ వర్కౌట్ అయింది. కాని చివరికి ఒక సందర్భంలో ప్లాన్ రివర్స్ అయింది.
సాధారణంగా ఒక మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి మాత్రం జరుగుతుంది. లేదా అనుకోని సంఘటన జరిగితే రెండవ వివాహం జరుగుతుంది. అప్పటికి పరిస్థితి బాగాలేకపోతే మూడో వివాహం దాకా వెళుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటాయి. పైగా ఏ మనిషి కూడా తన జీవితంలో ఒకటికి మించి ఎక్కువసార్లు పెళ్లి చేసుకోవాలని కోరుకోడు. మగవాళ్ళ విషయాల్లో కాస్త మినహాయింపులు ఉంటాయేమో గాని.. ఆడవాళ్లు రెండవసారి పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. ఆ ఊహలు కూడా భరించలేరు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో మహిళ మాత్రం పూర్తి డిఫరెంట్. ముందుగానే చెప్పినట్టు ఆమెది డిఫరెంట్ వ్యవహార శైలి. విలాసవంతమైన జీవితం కోసం ఆమె రకరకాల ప్రయత్నాలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈమె విడాకులు తీసుకున్న పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకునేది..
మహా ఘటికురాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన నీలి మానే మహిళ ఇప్పటివరకు 12 పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేస్తూ.. వారి వివరాలు తెలుసుకొని.. వారికి ఏదో విధంగా దగ్గరయ్యేది. వారి వీక్ పాయింట్ కనిపెట్టి.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించేది. ఆ తర్వాత వారి ఎదుట పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేది. తనకు ఎవరూ లేరని.. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసుందామని ప్రతిపాదన తీసుకొచ్చేది. ఆ తర్వాత విపరీతమైన ప్రేమను ప్రదర్శించి.. ఎదుటివారిని బుట్టలో వేసుకునేది. ఆ తర్వాత పెళ్లి చేసుకునేది. అనంతరం డబ్బు, బంగారం దోచుకునేది. ఆ తర్వాత ఊడాయించేది. ఒకవేళ బాధితులు ఎదుర్ ప్రశ్నిస్తే తిరగబడేది. వేధింపుల పేరుతో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేది. ఇలా 12 పెళ్లిళ్లు చేసుకుని కోట్లకు ఎదిగింది. భారీగా బంగారాన్ని వెనకేసుకుంది.
Also Read: Marriage Dates: ఈ తేదీలు.. పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు..
ఓ వ్యక్తి నీలిమ చేతిలో మోసపోయిన వ్యవహారాన్ని.. బయట పెట్టడంతో అమ్మగారి బండారం వెలుగు చూసింది. ఆ తర్వాత ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియడంతో అమ్మగారి లీలలు అందరికీ తెలిసాయి. ఏ ఏ ప్రాంతాలలో నీలిమ ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎవరిని మోసం చేసింది? ఏ స్థాయిలో డబ్బులు వసూలు చేసింది? ఎంత మొత్తంలో బంగారం వెనకేసుకొంది? అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు నీలిమపై కేసు నమోదు చేశారు. అయితే నీలిమ వ్యవహారం వివిధ మాధ్యమాల ద్వారా బయటపడడంతో అందరూ అవాక్కవుతున్నారు.. ఈరోజుల్లో పెళ్లిళ్లు కావడమే కష్టం అనుకుంటే.. ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకొని ఇంతమంది మగాళ్లను మోసం చేసిందంటే నీలిమ మామూలు మోసగత్తే కాదని నెటిజన్లు అంటున్నారు. ఇటువంటి మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన 12 మందిని నీలిమ మోసం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దారుణంలో నీలిమ ఒక్కతి మాత్రమే కాకుండా, ఆమె తల్లి, ఇంకా కొంతమంది గ్యాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. నీలిమ వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. అయితే నీలిమ ద్వారా ఇబ్బందులపాలె చాలామంది కోర్టు కేసులు ఎదుర్కొంటున్నట్టు కూడా సమాచారం.
నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు
కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన నీలిమ.
12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.
విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని పెళ్లిళ్లు.
బాధితుల నుంచి అందినకాడికి దోచుకుని, తిరగబడితే తిరిగి వారి మీదే వేధిస్తున్నారంటూ కేసులు. pic.twitter.com/5Qn51XgkT3— ChotaNews App (@ChotaNewsApp) June 23, 2025