Marriage Dates: మాఘమాసం వస్తున్న వేళ మంచి రోజులు వచ్చాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేందకు అనువైన సమయం అని పండితులు చెబుతున్నారు .ముఖ్యంగా వివాహాలు చేసుకునేవారికి కొన్ని రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అధిక శ్రావణం అయినా ఆ సమయంలో మంచి ముహూర్తాలు లేవు. అంతేకాకుండా కొన్ని శుభకార్యాలు నిర్వహించుకునేవారు మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ నెలలో వరుసగా మంచిరోజులు వస్తాయి. ఆవి ఏయే తేదీల్లో ఉన్నాయంటే?
కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత మంచి రోజులు మొదలయ్యాయి. దీంతో ఇప్పటికే చాలా పెళ్లిళ్లు అయ్యాయి. అయితే మరికొన్ని రోజుల పాటు శుభ ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 23, 24, 27, 28, 29 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలమైననవి పండితులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్ నెలలోనూ 3,4, 7, 8,9, 15 తేదీలు మంచి రోజులు. ఆయా తేదీల్లో శుభ కార్యాలతో పాటు వివాహాలు చేసుకోవడానికి సరైన సమయం అని అంటున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో కొన్ని రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు వచ్చాయి. ఈసారి డిసెంబర్ లోనూ శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు చేసుకునేవారు ఈ రెండు నెలల్లో శుభకార్యం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పంక్షన్ హాళ్లు దొరకవేమోనని ముందే బుక్ చేసుకుంటున్నారు. అలాగే పెళ్లి సామాను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. పండుగ సీజన్ కావడంతో మార్కెట్ బిజీగా మారుతోంది.