Rinku Singh Wedding Postponed: ఎంపీ ప్రియా సరోజ్ తో టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు రింకూ బిజీ షెడ్యూలే కారణమని క్రీడావర్గలు అంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ 19న వీరి పెళ్లి కావాల్సి ఉంది. అయితే నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు టీమ్ ఇండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 2 టస్ట్ లు, 3 వన్డేలు, 5 టీ20 లు ఆడనుంది. ఈ క్రమంలోనే పెళ్లిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు సమాచారం.