Shocking Facts About Whales: మీరు ఎప్పుడైనా తిమింగలాన్ని చూశారా? టీవీ, పేపర్, బుక్స్ లో చూసే ఉంటారు కదా. అయితే మీరు ఈ తిమింగలం గురించి కూడా చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు. తిమింగలం చావు, దాని ఉపయోగం గురించి తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు. అయితే ఈ తిమింగలాలు చాలా సంవత్సరాలు కూడా జీవిస్తాయి. ప్రపంచంలో చాలా ఎక్కువ జీవితకాలం ఉన్న జీవులలో ఒకటి తిమింగలం. ఆర్కిటిక్ సముద్రంలో నివసించే బౌహెడ్ తిమింగలం మరింత ఎక్కువ సంవత్సరాలు బతుకుంది. అది ఏకంగా 200 సంవత్సరాలకు పైగా జీవించగలదు. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కువ కాలం జీవించిన తిమింగలం 211 సంవత్సరాలు జీవించింది.
ఈ తిమింగలానికి తన మరణం ముందే తెలుస్తుంది. మరణం తెలిసిన వెంటనే అది ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆశ్చర్యకరమైన విషయాలు తెలిస్తే నిజంగానే వావ్ ఈ తిమింగలం ఇంత హెల్ప్ చేస్తుందా? అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా కొందరికి ఉపయోగపడుతాయి తిమింగలాలు. ఈ తిమింగలం చనిపోతే సముద్రంలో ఉండే ప్రతి జీవికి పండగే. అయితే దీనికి దాని చావు ముందే తెలిసిపోతుందట. దానికి దాని చావు గురించి తెలిసిన వెంటనే బలం మొత్తం ఉపయోగించి లైఫ్ లో చివరి ఫ్లై చేస్తుంది. అంటే నీటిలో ఒకసారి పైకి ఎగిరి సముద్రం అడుగు భాగంలోకి వెళ్తుంది.
Also Read: ఆకలిగా ఉందని సమోసా కొన్నారు.. తుంచి చూడగా షాక్: వైరల్ వీడియో
ఇలా సముద్రం అడుగు భాగానికి వెళ్లి చనిపోయిన తర్వాత షార్క్, చేపలు వంటివి దీని శరీరాన్ని తింటాయి. వాటికి ఆహారం అవుతాయి ఈ తిమింగలాలు. అంతేకాదు చిన్న చిన్న చేపలు, పీతలు కూడా వీటిని ఆహారంగా తీసుకుంటాయి. అయితే దీని మాంసం మొత్తం ఇతర జీవులు తిన్న తర్వాత కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఈ ఎముకల మీద నీటిలో ఉన్న జామ్డీ వామ్స్ వాటి యాసిడ్స్ ను విడిచిపెడతాయి. దీంతో ఆ ఎముకుల కూడా నీటిలో కరిగి పోతాయి. ఈ ఎముకలు నీటిలో కలిసి మొక్కలకు ఆహారంగా అవుతాయి. కొన్ని నెలలకు సరిపోయేలా మొక్కలకు ఆహరం అవుతాయి ఈ తిమింగలాలు. వాటికి న్యూట్రిషన్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇలా ఒక తిమింగలం చనిపోయి ఎన్నో జీవులకు ఆహారం అందిస్తుంది అన్నమాట.
కానీ మీరు ఒకటి గమనించారా? ఆల్మోస్ట్ చాలా జంతువులు, పక్షులు చనిపోయిన తర్వాత ఇతర జంతువులకు ఆహారం అవుతాయి. కానీ ఒక మనిషే కదా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటాడు. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసి పోవడం తప్ప ఇతర ప్రయోజనం ఉండదు. అందుకే బతికి ఉన్నప్పుడే మంచిన పెంచుకుంటూ చెడుకు దూరంగా ఉంటూ బతికేద్దాం. ఉన్నదొక్కటే జిందగీ సో బీ హ్యాపీ.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.