Lizard In Samosa: మనలో చాలామందికి సమోసా అంటే చాలా ఇష్టం. కొంతమందికి సమోసా అంటే ఎమోషన్ కూడా. ఎందుకంటే సమోసాలో ఇష్టమైన ఆలూ ఉంటుంది. పచ్చి బఠాణి, ఇతర కూరగాయల మిశ్రమం ఉంటుంది. వేడివేడి సమోసాను చంచుకొని తింటే స్వర్గం సెంటీమీటర్ దూరంలో కనిపిస్తుంది. పైగా సమోసాలు రకరకాలు అందుబాటులో ఉంటాయి. ఆలు సమోసా, ఆనియన్ సమోసా.. పన్నీర్ సమోసా.. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని ఎన్నో వెరైటీలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మన పంటి కింద నలుగుతుంటాయి.
Also Read: పెళ్లిలో అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఇక ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ మొదలైంది పండగ చేసుకోండి
సమోసాలు ఉత్తరాది వంటకం అయినప్పటికీ.. కొన్ని సంవత్సరాలుగా ఈ వంటకం దేశవ్యాప్తంగా విస్తరించింది. పైగా రకరకాల సమోసాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పెద్దపెద్ద నగరాలలో కేవలం సమోసాలనే తయారుచేసే హోటల్స్ వెలిశాయి. ఇందులో వెజ్, నాన్ వెజ్ కేటగిరీలు ఉంటాయి. సాధారణంగా సమోసాను మైదాపిండితో తయారుచేస్తారు. అయితే ఈ హోటల్స్ లో మాత్రం గోధుమ పిండితో తయారు చేస్తున్నారు. ఆలు, ఆనియన్ సమోసా మాత్రమే కాకుండా.. అంతకుమించిన వెరైటీలతో ఆహార ప్రియుల మనసు దోచుకుంటున్నారు. అయితే ఈ సమోసాలు మొత్తం మంచి వాతావరణంలో తయారు చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. అమ్మే వాళ్లకు డబ్బులు.. తినే వాళ్లకు సంతృప్తి లభిస్తాయి. అలాకాకుండా అడ్డగోలుగా తయారు చేస్తే అమ్మిన వాళ్లకు డబ్బులు వస్తాయేమో గాని.. కొన్నవాళ్లకు మాత్రం రోగాలు కచ్చితంగా వస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని తోల్కట్ట ప్రాంతంలో ఓ మిఠాయిల దుకాణంలో ఓ కుటుంబం సమోసాలు కొనుగోలు చేసింది. ఆకలిగా ఉందని ఆ కుటుంబంలోని సభ్యులు సమోసాలను తినడానికి తుంచారు. ఒక సమోసా తిన్నారు. మరో సమోసాను తుంచడానికి ప్రయత్నించగా అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ సమోసా ను తిన్నవారు వాంతులు చేసుకున్నారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మిఠాయిల దుకాణం యజమాని తన షట్టర్ లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. కాలం చెల్లిన పదార్థాలను నిల్వచేసిన హోటల్స్ ను సీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా సరైన పరిశుభ్రత పాటించని హోటల్స్ పై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అపరాధ రుసుము విధిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కొంతమంది హోటల్ నిర్వాహకులు ఏమాత్రం మారడం లేదు. తినే తిండి అని కూడా చూడకుండా కల్తీ చేస్తున్నారు. ఇలా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. దీంతో ఆహారం తిన్న వారంతా అనారోగ్యం బారిన పడుతున్నారు.
View this post on Instagram