YouTube new guidelines: మనీ సంపాదించాలంటే ఏదో ఒక రంగంలోకి వెళ్లాల్సిందే. పని చేస్తే కానీ ఫలితం లభించదు. ఆ ఫలితం కూడా అంత సులభంగా రాదు. కొందరికి లక్ తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చు. లాట్రీ, వైరల్, సక్సెస్ బిజినెస్ తో లక్ కలిసి వస్తుంది కానీ అందరి విషయంలో ఇది నిజం కాకపోవచ్చు. అయితే చాలా మంది యూ ట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారు? ఫ్యాషన్ కోసం కొందరు, డబ్బు కోసం కొందరు ఈ యూట్యూబ్ ను తమ కెరీర్ గా ఎంచుకుంటున్నారు. కొందరు పార్ట్ టైమ్ కు అప్పుడుప్పుడు చేస్తుంటారు.
కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ను పాటిస్తూ వీడియోలు చేయడం చాలా అవసరం. ఇష్టానుసారం వీడియోలు చేస్తే యూట్యూబ్ అసలు ఒప్పుకోదు. తమ రూల్స్, అండ్ రెగ్యూలేషన్స్ ను పాటించాల్సిందే. అయితే కొత్తగా యూట్యూబ్ తన రూల్స్ ను మార్చేసింది. ఒకప్పటి మాదిరి అసలు లైట్ తీసుకోదట. ఇష్టం వచ్చినట్టు కొందరు యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంటారు. అయితే మీకు యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీరు కొన్ని గైడెలెన్స్ ను పాటించకపోతే మీ మానిటైజేషన్ రద్దు చేస్తుంది.
యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈ నెల 15వ తేదీని నుంచి మారుస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఈ నెల నుంచి కఠినతరం చేస్తుంది. ఒరిజినల్ కంటెంట్ ను ప్రోత్సహించడం, రీ యూజ్డ్ కంటెంట్ ను బ్యాన్ చేయడం వంటి వాటి కోసమే ఈ కొత్త మార్గదర్శకాలు అంటోంది యూట్యూబ్. అంతేకాదు ఇప్పుడు చాలా మంది AI వీడియోలు, కాపీ పేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ నిలిపివేస్తారట. ఇలాంటి కంటెంట్ ఉంటే మానిటైజేషన్ కూడా ఇవ్వరట.
Also Read: ఇక దేశంలో ఏ మారుమూలన ఉన్నా ఇంటర్నెట్ సౌకర్యం ..ఇది మస్క్ చేసిన సంచలనం
అందుకే మీరు ఛానెల్ పెట్టాలి అనుకున్నా, లేదా ఛానెల్ పెట్టినా సరే జాగ్రత్త వహించండి. ఏఐ వీడియోలు, కంటెంట్ ను అసలు ఉపయోగించవద్దు. ఇక వేరే కంటెంట్ ను కాపీ చేసి కూడా మీరు యూజ్ చేయకండి. ఇక మీ ఒరిజినల్ కంటెంట్ ను మాత్రమే మీరు వాడండి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ మీద సంపాదించాలి అనుకునే వారు మరింత జాగ్రత్త వహించాల్సిందే. కొన్ని సార్లు తెలిసీ తెలియకుండా కూడా ఇలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే కంటెంట్, క్వాలిటీ, ఒరిజినాలిటీ విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ యూట్యూబ్ ను మీరు రన్ చేసుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.