Golden Fish: మాంసాహార కృతుల్లో చేపలు పాలా ప్రోటీన్లు కలవి. చికెన్, మటన్ కంటే ఇవి తక్కువ ఫ్యాట్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా మంది చేపలను ఎక్కువగా తింటూ ఉంటారు. నిత్యం చేపలు తినేవారు అనారోగ్యాల బారిన తక్కువగా పడుతారని కొందరు అంటూ ఉంటారు. వర్షాకాలంలో చేపలు ఎక్కువగా వస్తుంటాయి. వరదల వల్ల నదుల్లోని చేపలు గ్రామాల్లోకి చెరువులకు కొట్టుకు వస్తాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వర్షాకాలంలో ఎక్కువగా చేపలు పడుతూ ఉంటారు. అయితే తాజగా ఓ మత్స్యకారుడికి అరుదైన చేప చిక్కింది. ఇది బంగారం వర్ణంలో ఉంది. సాధారణ చేప కంటే ఇది వింతగా ఉండడంతో అందరూ ఆసక్తి చూశారు. అయితే దీనిని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మొత్తానికి ఓ వ్యక్తి రూ.6 వేలు చెల్లించి మరీ కొనుగోలు చేశాడు. అయితే ఈ చేపకు అంత కాస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? అని చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో ఉండే ప్రోటీన్ల విలువ తెలిస్తే ఎక్కువ ధరను పెట్టొచ్చు.. అని అంటున్నారు. ఈ చేప చిక్కిన మత్స్యకారుల పంట పండిందని సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి చేపలు ప్రతీ వర్షాకాలంలో చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారు. అయితే తాజాగా వలలో చిక్కిన ఈ చేపను తినడం వల్ల ఏం జరుగుతుందో.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
Also Read: ఐఐటీ సీటు వచ్చినా.. గొర్రెలు కాసిన విద్యార్థిని.. మీడియా కథనాలతో స్పందించిన సీఎం.. ఆర్థిక చేయూత
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో వరదలు ఏరులై పారుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటుంది. జీకేవీది మండలంలో ఈ నది నీరు రాగానే ఎర్రగా మారిపోతాయి. అయితే ఈ మండలంలో వర్షాలు పడి వరదలు రావడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. వీరిలో ఒకరు వనములు నర్సింగ్ అనే వ్యక్తికి ఇటీవల అరుదైన చేప వలలో చిక్కింది. ఈ చేపను చూడగానే మత్స్యకారులు సంబరపడిపోయారు. ఎందుకంటే మిగతా వాటి కంటే ఈ చేప విలువ ఎక్కువగా ఉంటుంది. గెలస్కోపి, మిలట్రీ మౌస్ అనే పేరుతో పిలిచే ఈ చేప అరుదైన జాతికి చెందినది. ఇది ఒక్కోటి 5 నుంచి 50 కిలోల బరువు ఉంటుంది. ఇటీవల నర్సింగ్ కు చిక్కిన చేప 25 కిలోలు ఉంది.
ఈ చేపను ఓ వ్యక్తి రూ.6 వేల చెల్లించి మరీ కొనుగోలు చేశాడు. అంత ఖరీదు చెల్లించడానికి ఈ చేపలో ఏముంది? అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ చేపలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో 68 శాతం ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఓమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న కొలాజన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లూరి జిల్లాలోని కొండ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వరదల కారణంగా ఇవి ఆ కొండల నుంచి నదుల ద్వారా గ్రామాల్లోని చెరువుల్లోకి వస్తుంటాయి. ఈ చేప బరువు ఇంకా ఎక్కువగా ఉంటే అత్యధిక రేటు పలుకుతుంది. దీంతో ఇలాంటి చేపలు చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారు.
బంగారు వర్ణంలో ఉన్న ఈ చేపతో ఉన్న మత్స్యకారుల ఫొటోలో సోషల్ మీడియాలో కొందరు అప్లోడ్ చేశారు. దీనిపై సోషల్ మీడియా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి చేపలు ఒక్కసారైనా తినాలని కొందరు అంటున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో లభించి వివిధ రకాల చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. ఫాస్ట్ ఫుడ్, మటన్, చికెన్ కంటే చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
Also Read: ఉధృత గంగకు ఎదురీది.. భక్తుడికి పునర్జన్మ ప్రసాదించిన జవాన్లు; వీడియో వైరల్
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: A glittering golden fish caught in a fishermans net in alluri district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com