వింతలు-విశేషాలుWater Flows : అద్భుతం.. కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు.. శాస్త్రవేత్తలకూ అంతు చిక్కని...

Water Flows : అద్భుతం.. కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు.. శాస్త్రవేత్తలకూ అంతు చిక్కని రహస్యం!

Water Flows : నీరు పల్లమెరుగు అంటారు.. అంటే.. ప్రపంచంలో ఎక్కడైనా.. నీటి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు ఉంటుంది. కానీ, ఆ ఊరిలో మాత్రం నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రహిస్తోంది. అలా ఎలా ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో అదో వింత..
నీరు ఎప్పుడైనా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. దాని వెనుక సైన్స్‌కు సంబంధించిన కారణాలు ఉన్నాయి. నదుల నీరు దాని ధృవత్వ లక్షణం కారణంగా ఎత్తుల నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ జిల్లా మెయిన్‌పట్‌ సమీపంలో నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

అలా ఎలా..
ఆ ప్రాంతంలోని ఒక బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా నీరు వృద్ధి చెంది సుమారు 2 కిలోమీటర్ల వరకు ఎత్తయిన ఒక ప్రాంతానికి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి దగ్గరలోని ఒక జలపాతంలో కలుస్తుంది. ఈ రహస్యం శాస్త్రవేత్తలకు సైతం అర్థం కావడం లేదు. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఆ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు. అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. ఇక ఈ ప్రదేశాన్ని ఛత్తీస్‌గఢ్‌ వాసులు మినీ కశ్మీర్‌గా పిలుస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version