Water Flows : నీరు పల్లమెరుగు అంటారు.. అంటే.. ప్రపంచంలో ఎక్కడైనా.. నీటి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు ఉంటుంది. కానీ, ఆ ఊరిలో మాత్రం నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రహిస్తోంది. అలా ఎలా ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో అదో వింత..
నీరు ఎప్పుడైనా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. దాని వెనుక సైన్స్‌కు సంబంధించిన కారణాలు ఉన్నాయి. నదుల నీరు దాని ధృవత్వ లక్షణం కారణంగా ఎత్తుల నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లా మెయిన్‌పట్ సమీపంలో నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
అలా ఎలా..
ఆ ప్రాంతంలోని ఒక బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా నీరు వృద్ధి చెంది సుమారు 2 కిలోమీటర్ల వరకు ఎత్తయిన ఒక ప్రాంతానికి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి దగ్గరలోని ఒక జలపాతంలో కలుస్తుంది. ఈ రహస్యం శాస్త్రవేత్తలకు సైతం అర్థం కావడం లేదు. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఆ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు. అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. ఇక ఈ ప్రదేశాన్ని ఛత్తీస్‌గఢ్ వాసులు మినీ కశ్మీర్‌గా పిలుస్తున్నారు.