Viral Video : మాతృ ప్రేమకు ఎన్నో రూపాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మన ఊహకు కూడా అందవు. మన అంచనాలకు కూడా తాకవు. అందుకే తల్లి ప్రేమకు కొలమానం అంటూ ఉండదు. తల్లి ప్రేమను నిర్వచించే గ్రంథం అంటూ కనిపించదు. కేవలం మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా వెలకట్టలేని తల్లి ప్రేమను చూపిస్తాయి. తమ పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాయి. పిల్లల కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంటాయి. చివరికి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తృణప్రాయంగా వదిలేస్తుంటాయి. ఆమధ్య ఈశాన్య ప్రాంతంలోని ఓ రాష్ట్రంలో ఓ లేగ దూడ రోడ్డు ప్రమాదానికి గురైంది. దానిని చూసిన తల్లి ఆవు పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తులను పొడిచింది. చివరికి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ రోడ్డును మొత్తం బ్లాక్ చేసేసింది. దీంతో పశు వైద్యులు వచ్చి ఆ లేగ దూడను తీసుకెళ్లి.. చికిత్స చేసి.. కోలుకునేదాకా తమ వద్దే ఉంచుకున్నారు. చివరికి ఆ లేగ దూడను ఆవు వద్ద విడిచారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ తల్లి తన పిల్లల కోసం ఎంతో త్యాగం చేసింది. చివరికి తన ప్రాణాలను కూడా వదిలేసుకుంది.
Also Read :నల్లమల అడవిలో చెత్త సేకరిస్తుంటే పిచ్చోడన్నారు.. ఇప్పుడు అతడు ఏ పొజిషన్లో ఉన్నాడంటే..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో సెంటి పేడ్ అనే కీటకం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.. సెంటి పేడ్ అనే కీటకం జెర్రీ జాతికి చెందింది. ఇది గుడ్లను పెడుతుంది. ఆ తర్వాత వాటిని పొదుగుతుంది. పొదిగిన తర్వాత తన బలహీనమైన పిల్లల కోసం అది ఏకంగా తన ప్రాణాలను సైతం వదిలేస్తుంది. ఎందుకంటే ఆ కీటకాలు పుట్టిన వెంటనే ఆహారం సంపాదించుకునే శక్తి ఉండదు. అలాంటప్పుడు తన పిల్లలు చనిపోతాయని భావించి.. వెంటనే తన శరీరాన్ని వాటికి ఆహారంగా అర్పిస్తూ ఉంటుంది. ఈ క్రతువులో చివరికి తన ప్రాణాలు పోయినా లెక్క చేయదు. తన పిల్లలు తన శరీరాన్ని చీల్చి తింటున్నా.. ఆ బాధను భరిస్తుంది. తన ప్రాణాలను వదిలేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనగా మారింది.. తల్లిని మించిన యోధురాలు.. తల్లిని మించిన త్యాగమూర్తి.. తల్లి నియమించిన నిత్య స్ఫూర్తి ఈ భూమి మీద ఉండదని.. ఉండబోదని.. ఉండే అవకాశం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు..కాగా, ఈ వీడియో ఇప్పటికే లక్షలలో వీక్షణలు సొంతం చేసుకోవడం విశేషం.
“మనుషులే అనుకున్నాం. చివరికి కీటకాలు కూడా విపరీతమైన మాతృ ప్రేమను చూపిస్తాయి. ఈ వీడియోని చూస్తే అదే అర్థమవుతోంది. ఇన్నాళ్లపాటు కీటకాలు ఇంతటి త్యాగాలు చేస్తాయని తెలియలేదు. ఈ వీడియో చూసిన తర్వాత అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. నిజంగా ఆ కీటకాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా తల్లి అంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తోందని” నెటిజన్లు అంటున్నారు.
God
This centipede mother allows her babies to eat her for nourishment, a rare behavior known as matriphagy.
— Misinformation Crusher (@MisInfoCrusher) June 3, 2025