Telugu man Viral Pic: రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలని వెనుకటికి ఓ సామెత ఉండేది. అప్పటి కాలానికి అది వర్తించేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఎవరు ఏది ధరిస్తే అదే ఫ్యాషన్.. తమకు నచ్చిన దుస్తులను ధరించడమే కంఫర్ట్ గా భావిస్తున్నారు. ఇండియాలోనూ ఆడ మగ తేడా లేకుండా పొట్టి నిక్కర్లు ధరించి బయటకు వస్తున్నారు. కొంతమంది దీని విడ్డూరం అన్నప్పటికీ.. ఇదేం పోయేకాలం అని తిట్టినప్పటికీ.. దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మనదేశంలో అధునాతన విధానానికంటే సాంప్రదాయాన్ని బాగా ఇష్టపడుతుంటారు. మొదటి నుంచి కూడా మన దేశం అదే తీరుగా ఉంది. కానీ ఇప్పటి తరం వల్ల మనదేశంలో కూడా వస్త్రధారణ మారిపోతున్నది. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రకరకాల సంస్కృతులకు అలవాటు పడటం వల్ల భాష మాత్రమే కాదు.. వేషధారణ కూడా లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
మనదేశంలో వెస్ట్రన్ కల్చర్ కనిపిస్తున్నట్టు.. వెస్ట్రన్ దేశాలలో కూడా మన ఇండియన్ కల్చర్ కనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ సంచలనం సృష్టిస్తోంది. ఆ ఫోటోలో ఓ వ్యక్తి లుంగీ కట్టుకున్నాడు. హాఫ్ షర్ట్ వేసుకున్నాడు. భుజం మీద కండువా కప్పుకున్నాడు. అతి పెద్ద షాపింగ్ మాల్ లో ఏదో కొనడానికి వెళ్ళాడు.. ఆ లుంగీ కూడా మడిచి కట్టుకున్నాడు. అమెరికాలోని కాస్ట్ కో అనే సూపర్ మార్కెట్ లో ఈ దృశ్యం కనిపించింది.”ఇండియాలో ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు.. తనకు నచ్చిన వేషధారణలో కంఫర్ట్ అనుభవిస్తున్నాడు. బయటి దేశాలకు వెళ్ళినప్పుడు ప్రధాన మంత్రులు.. రాష్ట్రపతులు కూడా వెస్ట్రన్ వేరు ధరిస్తారు. సూటు బూటులో దర్శనమిస్తారు. కానీ ఇతడు తెలుగువాడు.. మొనగాడిలాగా లుంగీ కట్టుకున్నాడు. దానిని మడిచి కట్టుకున్నాడు. ఆ తర్వాత మెడలో కండువా వేసుకున్నాడు.. తెలుగు సింహం లాగా దర్శనమిస్తున్నాడు. అమెరికా ఎందుకు వచ్చాడో తెలియదు. కొడుకు దగ్గరికో లేదా కూతురు దగ్గరికో వచ్చి ఉంటాడు.. ఇక్కడికి వచ్చిన సరే తన కల్చర్ మర్చిపోలేదు. ఎంతైనా తెలుగువాడు కదా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గత కొంతకాలంగా అమెరికా వెళ్లే తెలుగువారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అన్ని ప్రాంతాలలో తెలుగువారు శాశ్వత నివాసాలు ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నారు. అమెరికా వెళ్లిన తెలుగువారిలో మెజారిటీ శాతం ఐటి ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసేందుకు తల్లిదండ్రులు వీలు చిక్కినప్పుడల్లా వెళ్తున్నారు. అలా వెళ్లిన ఓ వ్యక్తి ఇలా ఓ సూపర్ మార్కెట్లో కనిపించాడు. అమెరికాలో కూడా తెలుగు కల్చర్ ను ప్రతిబింబించాడు. అమెరికా వెళ్తే సూటు బూటు వేసుకోవాలా.. లుంగీ కట్టుకోకూడదా.. అని అతడు నిరూపిస్తున్నాడు. పొరపాటున ఎవరైనా అతడిని ప్రశ్నిస్తే కొట్టేలా ఉన్నాడు.. ఎందుకంటే తన కల్చర్ మీద అంత ప్రేమ కాబట్టి.. ఎంతైనా తెలుగువాడు కదా.. ఆమాత్రం ఉంటుంది..