spot_img
Homeవింతలు-విశేషాలుTrump Real Estate Company: అమెరికా వదిలి హైదరాబాద్ బాట పట్టిన ట్రంప్.. ఇంతకీ ఎందుకంటే

Trump Real Estate Company: అమెరికా వదిలి హైదరాబాద్ బాట పట్టిన ట్రంప్.. ఇంతకీ ఎందుకంటే

Trump Real Estate Company: అమెరికాను గొప్పగా చేస్తానని అధికారంలోకి వచ్చాడు ట్రంప్. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ పూర్తిగా మారిపోయాడు. అమెరికాను గొప్పగా చేస్తానని చెప్పిన ఆయన.. పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల అమెరికా గొప్పగా అవడం ఏంటో తెలియదు గానీ.. ఆర్థికంగా మరింత ఇబ్బంది పడుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ గద్దెనెక్కి సంవత్సరం కూడా కాకముందే.. అమెరికాలో ప్రజలు రోడ్లమీదకి ఎక్కి.. ట్రంప్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా వెనక్కి వెళ్ళిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ నిర్వాకం వల్ల ఇప్పటికే అమెరికా ప్రపంచ వ్యాప్తంగా అప్రతిష్టను మూట కట్టుకుంటున్నది. అమెరికాను ప్రపంచ దేశాలు తిట్టిపోసుకుంటున్నాయి. ఇటువంటి విధానాలు అమెరికాకు ఏమాత్రం మంచిది కావని ప్రపంచ దేశాలు అధినేతలు చెబుతున్నారు. అమెరికా ప్రజలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. అక్రమ వలసదారులు అనే ముద్ర వేసి.. ఇతర దేశాల వారిని యుద్ధ ఖైదీల మాదిరిగా ట్రంప్ బయటికి పంపించాడు. సిరియా మీద బాంబుల వర్షం కురిపించాడు. అవసరం లేకున్నా సరే ఇరాన్ దేశంతో యుద్ధానికి దిగాడు. వెనుజుల అధ్యక్షుడిని అత్యంత దారుణంగా అపహరించి.. తమ దేశానికి తీసుకెళ్లాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ చేసిన నిర్వాకాలు మామూలువి కావు.

ట్రంప్ వ్యవహార శైలి వల్ల అమెరికా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. అమెరికా ప్రజలు కూడా అదే స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కంపెనీకి సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది. ట్రంప్ కు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అది మనదేశంలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఇప్పుడు ఆయన కంపెనీ హైదరాబాదులోని కోకాపేట ప్రాంతంలో అత్యంత ఎత్తైన 63 అంతస్తుల జంట టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిని నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈ టవర్ల నిర్మాణానికి సంబంధం లేదు. ఎందుకంటే ముంబై, పూనే వంటి నగరాలలో ట్రంప్ పేరుతో టవర్లు నిర్మాణమయ్యాయి. అక్కడ ఫ్లాట్ లు వెంట వెంటనే అమ్ముడు పోయాయి. దీంతో అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ టవర్లలో త్రీ బిహెచ్కె నుంచి ఫైబిహెచ్కే వరకు నిర్మిస్తున్నారు. 3000 నుంచి 5000 చదరపు అడుగుల విస్తీర్ణంతో లగ్జరీ ప్లాట్లను నిర్మిస్తున్నారు. వీటి ధర ఎంత ఉంటుందో తెలియదు.. కాకపోతే 63 అంతస్తుల టవర్లు అనగానే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఇక్కడి నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మంచిరేవుల వంటి ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. నెక్నాంపుర ప్రాంతంలో కూడా భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ బహుళ అంతస్తులు భారీగా నిర్మితమవుతున్నాయి. మల్టి నేషనల్ కంపెనీలు పోటీలు పడి ఇక్కడ టవర్లు నిర్మిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. గతంలో కూడా కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమికి వంద కోట్ల వరకు పలికింది. ఇప్పుడు అక్కడ డిమాండ్ అంతకు మించిన స్థాయిలో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version