spot_img
Homeలైఫ్ స్టైల్Regular use of high heels health effect: ప్రత్యేకంగా కనిపించాలని.. రెగ్యులర్ గా హై...

Regular use of high heels health effect: ప్రత్యేకంగా కనిపించాలని.. రెగ్యులర్ గా హై హీల్స్ వేసుకుంటున్నారా..

Regular use of high heels health effect: కొంతమంది చూడ్డానికి అందంగా ఉంటారు. అందమైన రూపంతో ఇట్టే ఆకట్టుకుంటారు. కాకపోతే వారిలో ఒక లోపం ఉంటుంది. అందానికి తగ్గట్టుగా ఎత్తు లేకపోవడం వల్ల.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించరు. పైగా ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వారిలో ఆత్మ న్యునతాభావం ఉంటుంది. అటువంటివారు ఎత్తుగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి.. ఎత్తుగా ఉండడానికి చాలామంది మహిళలు హై హీల్స్ వేసుకుంటారు. కొందరైతే అకేషన్ సమయంలో ఇటువంటి వాటిని ధరిస్తుంటారు. మిగతావారేమో నిత్యం ధరిస్తూనే ఉంటారు. అయితే ఈ హై హీల్స్ వేసుకోవడం వల్ల బాడీ షేపు దెబ్బతింటుందని వైద్యుల హెచ్చరిస్తున్నారు. వీటివల్ల శరీర బరువు మొత్తం ముందుకు పడిపోతుంది. వెన్నెముక, మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది. తీరిక కాలంలో వెన్నునొప్పి, మెడ తప్పి వస్తుంటాయి. పాదాల కండరాలు బిగిసుకుపోతాయి. దీని వల్ల నడకలో బ్యాలెన్స్ పూర్తిగా తప్పుతుంది. ఫలితంగా కిందపడడం.. చీల మండ గాయాలు అవుతుంటాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. తక్కువ ఎత్తు ఉన్న హీల్స్ వాడటం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.

“ఎత్తుగా కనిపించడం మంచిదే. కాకపోతే ఎత్తుగా ఉండాలని చెప్పి చాలామంది హై హీల్స్ వేసుకుంటారు. అలా వేసుకోవడంలో అప్పటికప్పుడు ఎటువంటి పరిణామాలు శరీరాన్ని ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందువల్ల హై హీల్స్ ధరించడంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంతవరకు ఎత్తు తక్కువ ఉన్న హీల్స్ ధరించడం వల్ల ఇబ్బంది ఉండదు. వెన్నముక సంబంధమైన సమస్యలు రావని” వైద్యులు అంటున్నారు.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే పలు వేదికల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి.. ఈ కథనాన్ని ప్రచురించాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కథనాన్ని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు వైద్యులను ముందుగా సంప్రదిస్తే ఉత్తమం. వారు సూచించిన చికిత్సను తీసుకుంటే మరింత ఉత్తమం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version