Muchu Chhish: అసాధ్యం సుసాధ్యమైంది… ఆ పర్వతాన్ని అధిరోహించారు.. ఆ సాహసయాత్ర సాగిందిలా!

మౌంట్‌ ముచు ఛిష్‌ను అధిరోహించిన ముగ్గురూ చెక్‌ రిపబ్లిక్‌కు చెందినవారే. డెనెక్‌ హక్, రాడోస్లావ్‌ గ్రోహ్, జరోస్లావ్‌ బాన్‌స్కీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో ఎంతోమంది పర్వతారోహకులు దీనిని అధిరోహించేందుకు యత్నించి విఫలమయ్యారు. గతేడాది ఓ బందం 7,200 మీటర్ల వరకు వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కు తిరిగి వచ్చేసింది.

Written By: Raj Shekar, Updated On : July 11, 2024 9:29 am

Muchu Chhish

Follow us on

Muchu Chhish: భూమిపై ఉన్న పర్వతాలను మనిషి అధిరోహిస్తూ వస్తున్నాడు. కొన్ని పర్వాతలను అయితే ఈజీగా ఎక్కేస్తున్నారు. మరికొన్ని మాత్రం అధిరోహించకుండా ఉండిపోయాయి. వాటిలో ఒకటి మన దాయాది దేశం పాకిస్తాన్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఆ పర్వతాన్ని కూడా అధిరోహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన పర్వతారోహకులు. ఇంతకు ఆ పర్వతం ఏంటి.. దాని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..

ముచు ఛిష్‌ మౌంట్‌…
మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది. పాకిస్తాన్‌లో కారకోరం రేంజ్‌లో ఉన్న 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తయిన ముచు ఛిష్‌ పర్వతాన్ని ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించలేదు. అనేక మంది దానిని జయించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన ముగ్గురు పర్వతారోహకులు దీనిని అధిరోహించారు. ఆరు రోజులు శ్రమించి ఈ ఘటన సాధించారు.

ఎవరీ ముగ్గురు..
మౌంట్‌ ముచు ఛిష్‌ను అధిరోహించిన ముగ్గురూ చెక్‌ రిపబ్లిక్‌కు చెందినవారే. డెనెక్‌ హక్, రాడోస్లావ్‌ గ్రోహ్, జరోస్లావ్‌ బాన్‌స్కీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో ఎంతోమంది పర్వతారోహకులు దీనిని అధిరోహించేందుకు యత్నించి విఫలమయ్యారు. గతేడాది ఓ బందం 7,200 మీటర్ల వరకు వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కు తిరిగి వచ్చేసింది.

నాలుగేళ్లలో మూడుసార్లు ప్రయత్నం..
ఇక చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన పర్వతారోహకులు నాలుగేళ్లుగా ముచు ఛిష్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడుసార్లు విఫలమయ్యారు. నాలుగో ప్రయత్నంలో డెనెక్‌ హక్, రాడోస్లావ్‌ గ్రోహ్, జరోస్లావ్‌ బాన్‌స్కీ బందం ఎట్టకేలకు పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది.

అత్యధికంగా అధిరోహించిన పర్వతాలు..
ఇక ప్రపంచంలో ఎక్కువసార్లు మనుషులు అధిరోహించిన పర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవీ..
– జపాన్‌లోని ఎత్తయిన శిఖరం, సాంస్కృతిక చిహ్నంగా ఉన్న ఫుజి పర్వతం. దీనిని ఏటా వందల మంది అధిరోహిస్తున్నారు. జూలై సెప్టెంబర్‌ మధ్య ఇది అధిరోహకులను ఆకర్షిస్తుంది.

– అమెరికాలోని న్యూ హంప్‌షైర్‌లో ఉన్న మౌంట్‌ మెనాడ్నాక్‌ పర్వతం దాని ప్రాప్యత, ట్రయల్స్‌ కారణంగా ప్రపంచంలో నిత్యం అధిరోహకులు ఇక్కడికి వస్తుంటారు.

– టాంజానియాలోని కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో ఎత్తయిన పర్వతం. దీనిని ఇప్పటి వరకు 35 వేల మంది అధిరోహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిరోహకులను దీని వివిధ మార్గాలు ఆకర్షిస్తాయి.

– స్కాట్‌లాండ్‌లోని బెన్‌నెవిస్‌ పర్వతం బ్రిటిష్‌ దీవుల్లో ఎత్తయినది. దీనిని ఏటా 10 వేల మంది అధిరోహిస్తున్నారు.

– అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న మౌంట్‌ హుడ్‌ ఉత్తర అమెరికాలో అత్యంత తరచూ ఎక్కే హిమనీ పర్వతం. ఇది కూడా ఏటా వేలాది మంది అధిరోహకులను ఆకర్షిస్తోంది.

– యునైటెడ్‌ స్టేట్స్‌లో అత్యంత ఎత్తయిన శిఖరం లాగా మౌంట్‌ విట్నీ అనేక మంది హైకర్లను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మౌంట్‌ విట్నీ ట్రైల్‌ ద్వారా వేసవి నెలల్లో అధికంగా ఉపయోగపడుతుంది.

– సౌత్‌ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్న మౌంటైన్‌ కేబుల్‌ కార్‌ అనేక మంది పర్వతారోహకులను ఆకర్షిస్తోంది. దీనిని ఏటా మిలియన్ల మంది సందర్శిస్తారు. వేలాది మంది అధిరోహిస్తారు.

– వేల్స్‌లోని ఎత్తయిన శిఖరం స్నోడన్‌. దీని సుందరమైన మార్గాలు కూడా పర్వతారోహకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి కూడా ఏటా వేల మంఇ అధిరోహకులు వస్తున్నారు.

– యోస్మైట్‌ నేషనల్‌ పార్కులో ఉన్న హాఫ్‌ డోమ్‌ కేబుల్‌ రూట్‌తో సహా సవాలు తో కూడిన పర్వతారోహణకు ఇది ప్రసిద్ధి. ఏటా గణనీయమైన సంఖ్యలో ఇక్కడికి పర్వతారోహకులు వస్తుంటారు.

– ఐరోపాలో ఎత్తయిన శిఖరం ఎల్బ్రస్‌ పర్వతం. వెనిస్‌ సమ్మిట్స్‌ సవాల్‌ను లక్ష్యంగా చేసుకుని అధిరోహకులను ఆకర్షిస్తుంది. సరళమైన క్లైంబింగ్‌కు ఇది అనుకూలం. అందుకే అధిరోహకులు ఏటా వేలాదిగా తరలివస్తారు.

Tags