Snakes: పాములు చాలా భయంకరమైనవి అనుకుంటారు చాలా మంది. కానీ నిజం చెప్పాలంటే వాటి దగ్గరి ఎవరైనా వెళ్లినా సరే లేదంటే వాటికి హాని చేయాలని చూసినా సరే అవి వెంటనే రియాక్ట్ అవుతాయి. లేదంటే ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టవు. రక్షించుకోవడానికి మాత్రమే ఇతరులకు హాని చేస్తాయి పాములు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతుల పాములు ఉన్నాయి. మరి ఇందులో ఏలాంటి పాములు భయంకరమైనవి? ఏవి తెలివైనవి అని ఎప్పుడైనా ఆలోచించారా? పాములకు మెదడు ఉండదని అంటారు నిపుణులు. పాములు ఎవరిని గుర్తించవు అని.. వాటికి కంటి చూపు కూడా సరిగ్గా ఉండదని అంటారు. అన్ని పాములకంటే భిన్నమైన పాము ఒకటి ఉంది. కానీ ఇది మనల్ని గుర్తించగలదు ఇతర పాముల కంటే ఎక్కువ కంటి చూపును కూడా కలిగి ఉంటుంది. సమయానికి అనుగుణంగా తన వ్యూహాన్ని మారుస్తుంది. ఇంతకీ అదేంటంటే..
పాములను హిందూమతంలో దేవతగా కొలుస్తుంటారు. కానీ పాములు అంటే భయం కూడా చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు తెలివైన పాములు, కంటి చూపును ఎక్కువగా కలిగిన పాములు నిజంగా ప్రత్యేకమైనదే అని చెప్పవచ్చు. మరి ఆ పాము ఏంటి అనుకుంటున్నారా? కింగ్ కోబ్రా. ఇండియన్ కోబ్రా కంటే భిన్నంగా ఉంటుంది కింగ్ కోబ్రా. ఈ పాము పరిస్థితికి అనుగుణంగా తన వేట వ్యూహాన్ని మార్చుకుంటుంది. భూకంపాలు వచ్చే సమయంలో లేదంటే ఏవైనా ప్రకంపనలను వచ్చినా వెంటనే గుర్తించగలుగుతాయట. ఇది 330 అడుగుల దూరం నుంచి కూడా ఎలాంటి శబ్దాన్ని అయినా సులభంగా గుర్తిస్తుంది. ఈ పాములు కదలికను గుర్తిస్తే.. వారు దానిని గుర్తించడానికి వాటి నాలుకను కదిలిస్తాయి.
నాలుక సరైన స్థానాన్ని సూచించడానికి నాలుక యాంటీనా మాదిరి పనిచేస్తుంది. సాధారణంగా, కింగ్ కోబ్రాస్ తమను పట్టుకున్నవారిని కాటు వేస్తాయి. అయితే వీటికంటే పెద్ద పరిమాణం ఉన్నాసరే వాటిని పూర్తిగా మింగేస్తాయి. కింగ్ కోబ్రాకు కంటి చూపు కూడా చాలా గొప్పగా ఉంటుంది. ప్రమాదం సంభవిస్తున్నప్పుడు పడగవిప్పి బయటకు తీయడానికి వాటి మెడ కండరాలు, పక్కటెముకలను ఉపయోగిస్తాయి ఈ పాములు. ఆడ కింగ్ కోబ్రా తన గుడ్లను రక్షించుకోవడానికి గూడు కట్టుకట్టుంది. ఈ పాములు మాత్రమే ఇలా చేస్తాయి.
ఈ ఆడకోబ్రాలు వాటి గుడ్లను ఆకులతో కప్పుతుంది. ఈ సమయంలో, ఆడ నాగుపాములు తమ వద్దకు వచ్చే జంతువులు, మనుషుల పట్ల చాలా దూకుడుగా ఉంటాయి. వాటికి కాస్త హానీ కలిగించినా సరే వెంటనే కాటువేస్తాయి. కింగ్ కోబ్రా భారతదేశంలోని అరణ్యాలలో , ఆగ్నేయాసియాలో జీవిస్తుంటాయి. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము.ఇవి 25 సంవత్సరాల వరకు జీవించగలవు . గరిష్టంగా 19 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి ఈ పాములు.
ఇవి చాలా తెలివితో ఉంటాయి. అంతేకాదు పగటిపూట చాలా చురుకుగా ఉంటాయి. రాత్రిపూట కూడా వేటాడతాయి.
ఇతర పాముల కంటే ఈ పాములు మనుషులను ఎక్కువగా గుర్తుపడతాయట. ఇతర పాముల కంటే కింగ్ కోబ్రాకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందని అంటున్నారు నిపుణులు. అంటే ఇవి పగ పడతాయా అని అడుగుతున్నారు ప్రజలు. ఇక రీసెంట్ గా ప్రసిద్ధ హెర్పెటాలజిస్ట్ డిట్మార్స్ కింగ్ కోబ్రాను అత్యంత తెలివైన పాముగా తెలిపారు. ఇదిలా ఉంటే పాములకు నాడీ వ్యవస్థ ఉంటుంది కాబట్టి అవి వాసన చూడగలవు. వాసనతోటి పసిగడతాయి కూడా. ప్రమాదాలను కూడా త్వరగా అర్థం చేసుకుంటాయి. ఇతర జంతువులతో పోరాడటంలో వెనకడుగు వేయవు. ఇవన్నీ చేయడానికి ఈ కింగ్ కోబ్రాలకు అవసరమైన తెలివి ఉంటుంది.