https://oktelugu.com/

Rajini Kanth : కూలీ సినిమాలో రజినీకాంత్ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారా..?

రజినీకాంత్ పేరు చెబితే చాలు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సినిమా అభిమానులు అదొక ఎమోషన్ గా భావిస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 27, 2024 / 03:00 PM IST
    Follow us on

    Rajini Kanth : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న రజనీకాంత్ ప్రస్తుతం ఇప్పటికి కూడా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన కంటూ ఒక గొప్ప చరిత్రను సృష్టిస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదొ ఒక స్టైల్ ని గానీ, ఒక మేనరిజాన్ని క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికి ప్రేక్షకులు గానీ, ఆయన అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కనకరాజు ఇంతకుముందు కమల్ హాసన్ తో ‘విక్రమ్ ‘ అనే సినిమా చేశాడు. ఇక దాంతో పాటుగా విజయ్ తో ‘ లియో ‘ అనే సినిమా చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ సినిమాతో దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. ఇక విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ను ఏ విధంగా అయితే చూపించాడో, ఇప్పుడు రజినీకాంత్ ను కూడా అదే రేంజ్ లో చూపించి భారీ కలెక్షన్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమా మీద హైప్ ను పెంచడానికి చాలా రకాల కసరత్తులను అయితే చేస్తున్నారట. ఇక లోకేష్ కనకరాజు మేకింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన స్టైలిష్ మేకింగ్ తో పాటు సినిమాలో ఎమోషన్స్ ని ఎలివేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఏకతాటి పైకి తీసుకు వస్తు ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాలకి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంటుంది…ఇక ఇప్పుడు కూలీ సినిమాలో రజనీకాంత్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా అయిన ముత్తు సినిమాలో నుంచి ‘తిలానా తిలానా’ అనే సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఈ సాంగ్ తో ఒక్కసారిగా సినిమా మీద భారీ హైప్ ను కూడా క్రియేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అప్పుడు ఎలాంటి స్టెప్పులు అయితే రజినీకాంత్ వేశాడో ఇప్పుడు కూడా అవే స్టెప్పులను మరోసారి రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి లోకేష్ కనకరాజు గత చిత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఆయా హీరోలకు సంబంధించిన వింటేజ్ సీన్స్ గాని, సాంగ్స్ గానీ ఆ సినిమాల్లో వాడుతూ ప్రేక్షకుల్లో గాని, ఆ హీరోల అభిమానుల్లో గాని మంచి జోష్ నింపుతూ ఉంటాడు.

    ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కి ఒక భారీ హిట్ ఇచ్చే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటికి చెక్ పెట్టాలంటే సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సి ఉంది…