Homeవింతలు-విశేషాలుQuebec Forest: మనుషుల్లాగే భూమి ఊపిరి పీల్చుకుంటోంది.. నమ్మడం లేదా? అయితే ఈ వీడియో చూడండి..

Quebec Forest: మనుషుల్లాగే భూమి ఊపిరి పీల్చుకుంటోంది.. నమ్మడం లేదా? అయితే ఈ వీడియో చూడండి..

Quebec Forest: మొబైల్ విప్లవం వచ్చాక..ప్రపచంలో ఏ మూలన ఏం జరిగినా తెలిసోతుంది. కొందరు తమకు ఎదురైన వింత సంఘనలను, విచిత్రాలను ఫోన్ ద్వారా ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మిగతా వాటి కంటే భిన్నంగా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అనుకుండగా జరిగిన ఈ సంఘటననో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. ఈ విషయం గురించి కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు కూడా. అదేంటే.. మనుషులు ఊపిరి పీల్చుకున్నట్లే భూమి కూడా శ్వాస తీసుకుంటుందట. అదెలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగిందంటే?

మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. శ్వాస లేకపోతే ఊపిరి ఆగిపోతుంది. మనుషులతో పాటు చెట్లు, ఇతర జంతువులకు కూడా శ్వాస తప్పనిసరిగా అవసరం. భూమ్మీద ఎన్నో వనరులు ఉన్నాయి. కానీ ప్రాణం ఉన్న వాటికి మాత్రమే శ్వాస అవసరం ఉంటుంది. ప్రాణం లేని వనరులు ఎన్నో విధాలుగా ఉపయోగపడినా వాటికి శ్వాస వ్యవస్థ ఉండదు. అయితే భూమి కూడా శ్వాస తీసుకుంటుందన్న విషయాన్ని ఎవరైనా చెబితే నమ్ముతారా? అస్సలు నమ్మరు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఆశ్చ్యం కలిగిస్తుంది.

DannyDutch అనే ఎక్స్ ఖాతాదారులు ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ఇటీవల వైరల్ గా మారింది. ఈవీడియో ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో చెట్లు నిటారుగా ఉన్నాయి. కానీ అవి ఒక్కసారిగా పైకీ, కిందకి కదిలాయి. కెమెరా చెట్లు మొదళ్లను పరిశీలించగా భూమి పైకి, కిందకీ కదులుతుంది. అక్కడ ఎలాంటి ఎక్విప్ మెంట్ లేదు. అయినా పైకీ, కిందికి కదలడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.దీంతో మనుషులు, జంతువులతో పాటు భూమి కూడా శ్వా తీసుకుంటుందని ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ట్యాగ్ చేశాడు.

భూమి గుండ్రంగా ఉంటుందని సైన్స్ ద్వారా తెలుసుకుందా.. అలాగే భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలుసు. కానీ శ్వాస తీసుకోవడం చాలా అరుదు అని చాలా మంది ఈ వీడియో గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక్కోసాని అనుకోకుండా భూకంపాలు వస్తుంటాయి. దీంతో భఊమి కంపించిందని అంటుంటారు. అలాగే భూమి శ్వాస తీసుకోవడం వల్ల కదులుతుందని మరికొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా భూమి ఇలా కదలడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే దీనిపై పరిశోధనలు జరుగుతాయా? లేదా ఇంతటితో వదిలేస్తారా? అని కొందరు సైన్స్ వాదులు అంటున్నారు. కానీ ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా గ్లోబలైజేషన్ కారణంగా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఇది కూడా ఒక వింతేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అందువల్ల వీటిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version