Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడడంలో కానీ, నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ది బెస్ట్ ఎవరు అంటే అందరికీ నభీల్ అనే అనిపించింది. ఒక కంటెస్టెంట్ కి అనుకూలంగా ఉంటూ, మరో కంటెస్టెంట్ కి ప్రతికూలంగా ఉండడం వంటివి నభీల్ మొదటి నాలుగు వారాల్లో చేయలేదు, కానీ ఎప్పుడైతే ఆయన మెగా చీఫ్ అయ్యాడో, అప్పటి నుండి ఆయనలో అనూహ్యమైన మార్పులు కనపడ్డాయి. ఆ మార్పులను ఆయన అభిమానులు కూడా తీసుకోలేకపోతున్నారు. అనవసరంగా నభీల్ తన గ్రాఫ్ ని తగ్గించుకుంటున్నాడు అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రేరణ విషయంలో నభీల్ చాలా ఓవర్ యాక్షన్ చేసాడని ఈ వారం లో అర్థం అయ్యింది. ప్రేరణ ని ప్రతీ విషయం లో తొక్కేందుకు ప్రయత్నం చేసి, ఆమె గురించి ప్రతీ కంటెస్టెంట్ వద్దకు వెళ్లి చాడీలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇదంతా గమనించిన ప్రేరణ నభీల్ ని పిలిచి నేరుగా మాట్లాడింది. అసలు నీ సమస్య ఏమిటి నాతో?, మంచి స్నేహితులం అయ్యాం, కానీ నువ్వు మెగా చీఫ్ అయ్యాక బాగా మారిపోయావు, నేను పిలిస్తే కనీసం నువ్వు తల కూడా తిప్పడం లేదు, చీఫ్ అయ్యినందుకు అందరినీ చూసుకోవడం నీ బాధ్యత, కానీ నువ్వు నన్ను సమానంగా చూడడం లేదు ఎందుకు అని అంటుంది.
దానికి నభీల్ ‘నాకు నీ మీద కోపం రావడానికి కారణం హోటల్ టాస్క్ లో నువ్వేమి చీఫ్ రా అని అన్నావు. అలాగే వంటింట్లో నువ్వు సీతతో లొల్లి పెట్టుకోవడం కూడా నాకు నచ్చలేదు, అందుకే నీకు బదులుగా మణికంఠ పేరు చెప్పాను’ అని అంటాడు. అప్పుడు ప్రేరణ ‘అక్కడ జరిగిన సందర్భాలు బట్టి నాకు నువ్వు అలాగే అనిపించావు, కనీసం నువ్వు నేను చెప్పేది కూడా వినాలని అనుకోలేదు’ అని అంటుంది. అలా వీళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉండగా నభీల్ మాట్లాడే మాటలను చూసి నీకు మెచ్యూరిటీ లేదని అంటుంది. దీనికి నభీల్ ఫైర్ అవుతాడు. మెగా చీఫ్ గా ఆయన ఎక్కువగా సీతకు అనుకూలంగా ఉండడాన్ని హౌస్ మేట్స్ అందరూ గమనించారు. ఇక సంచాలక్ గా అయితే నభీల్ డిజాస్టర్ అయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా మెగా చీఫ్ అయ్యేందుకు పెట్టిన ఐటమ్స్ టాస్క్ లో నభీల్ రూల్స్ ప్రకారం హరితేజ గెలిస్తే ఆమెని కాదని మెహబూబ్ ని గెలిపిస్తాడు.
టాస్క్ ఏమిటంటే బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ ని చేతిలో ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కిందపడకుండా బ్యాలన్స్ గా నడవాలి. ఈ టాస్క్ లో మణికంఠ, హరితేజ, అవినాష్ , మెహబూబ్ పాల్గొంటారు. చివరికి హరితేజ, మెహబూబ్ మిగులుతారు. వీరిలో హరితేజ బిగ్ బాస్ చెప్పిన అన్ని ఐటమ్స్ ని పట్టుకొని బ్యాలన్స్ గా నిలబడుతుంది, కానీ కొద్దిసేపటి తర్వాత పడేస్తుంది, కానీ మెహబూబ్ మాత్రం చివరి వరకు ఉంటాడు కానీ, అన్ని ఐటమ్స్ పెట్టుకోడు, రూల్స్ ప్రకారం బిగ్ బాస్ ఇచ్చిన ఐటమ్స్ అన్నిటిని పట్టుకొని నిలబడాలి , కానీ మెహబూబ్ అలా చేయకపోయినా కూడా విన్నర్ గా ప్రకటిస్తాడు నభీల్, దీనికి నేడు నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.