https://oktelugu.com/

Akkineni Nagarjuna :  నాగ చైతన్య పై 6 నెలలు నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నాగార్జున..అసలు ఏమి జరిగిందంటే!

నాగార్జున నాగ చైతన్య , సమంత లవ్ స్టోరీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ 'చాలా రోజులు నుండి నేను నాగ చైతన్య ని గమనిస్తూనే ఉన్నాను. ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అనేది నాకు తెలిసేది కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 12:05 AM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna :  అక్కినేని ఫ్యామిలీ నుండి మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోలలో ఒకరు అక్కినేని నాగచైతన్య. నిజానికి చెప్పాలంటే ఆ కుటుంబం నుండి నాగార్జున తర్వాత సక్సెస్ అయ్యింది నాగ చైతన్య మాత్రమే, భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటి వరకు హిట్ కొట్టలేకపోయాడు. నాగ చైతన్య ఇండస్ట్రీ లోనే మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య సమంత ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వంటివి నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ టాపిక్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వాటికి వ్యూస్ కూడా లక్షల సంఖ్యలో వస్తుండడంతో ఎక్కువగా విలేఖరులు కూడా వీళ్ళ మీదనే ఫోకస్ పెడుతున్నారు.

    ఇదంతా పక్కన పెడితే గతం లో నాగార్జున నాగ చైతన్య , సమంత లవ్ స్టోరీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘చాలా రోజులు నుండి నేను నాగ చైతన్య ని గమనిస్తూనే ఉన్నాను. ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అనేది నాకు తెలిసేది కాదు. నాకు చెప్పకుండా సైలెంట్ గా గోడ దూకి బయటకి వెళ్ళడాలు వంటివి నేను చూసేవాడిని. అసలు ఏమి చేస్తున్నాడు వీడు అని నేను వాడి మీద ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా పెట్టాను. ఎవరి ఇంటికో వెళ్తుండడం గమనించాను. అది ఎవరు ఇల్లు అనేది ఆరా తీయగా సమంత ఇల్లు అని తెలిసింది. అప్పుడే వీళ్లిద్దరి ప్రేమలో ఉన్నారనే విషయం నాకు అర్థం అయ్యింది. కానీ వాళ్ళు చెప్పే వరకు వేచి చూసాను. నాకు ఈ విషయం తెలిసిన రెండేళ్ల తర్వాత చెప్పారు’ అంటూ చెప్పొచ్చాడు నాగార్జున.

    మీడియా కి కూడా వీళ్లిద్దరు నాలుగేళ్లు డేటింగ్ చేసుకున్న తర్వాత తెలిసింది. నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమా విడుదల సమయంలో వీళ్లిద్దరు కలిసి ఒకే థియేటర్ లో కనిపించారు. అప్పుడే ఈ విషయం బయటపడింది. పెళ్లి చేసుకొని నాలుగేళ్ల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన ఈ జంట కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఇటీవలే మంత్రి కొండాసురేఖ వీళ్ళ విడాకులకు చెప్పిన కారణం ఎంత నీచాతి నీచంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం పై నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కేసు కూడా వేసాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటి తో కలిసి ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం దీపావళి కి, లేదా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.