Telugu News » Odd News » The radiation sar of the phone you are using should be 1 6 w kg
Mobile Radiation : మీరు వాడే ఫోన్ లో రేడియేషన్ ఎంత ఉండాలో తెలుసా? దాన్ని ఇలా చెక్ చేయండి..
స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అన్ని పనులు దీనిద్వారా జరిగిపోతున్న నేపథ్యంలో మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. స్మార్ట్ ఫోన్ లో రేడియేషన్ కూడా ఉంటుంది. అయితే ఇది ఏ స్థాయిలో ఉండాలంటే..
Mobile Radiation : చాలామంది కొత్త ఫోన్ కొనుగోలు చేస్తున్నప్పుడు కెమెరా, స్టోరేజీ, రామ్ వంటి విషయాలను పరిశీలిస్తారు. కానీ రేడియేషన్ ను చెక్ చేయాలి. అది అత్యంత ముఖ్యమైనది కూడా.. స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడుపుతున్న ఈ రోజుల్లో కచ్చితంగా రేడియేషన్ గురించి తెలుసుకోవాలి. మనం వాడే ఫోన్ నుంచి అధిక రేడియేషన్ విడుదలయితే ఆరోగ్య మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. మన వాడే ఫోన్ రేడియేషన్ గురించి తెలిపే వివరాలను SAR విలువ అంటారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువకాలం ఉపయోగిస్తే.. దానివల్ల రేడియేషన్ పెరుగుతుందట. అది చర్మ సంబంధిత క్యాన్సర్ వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఫోన్ నుంచి వెలుపడే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల పరిమాణాన్ని సైన్స్ పరిభాషలో SAR అని పిలుస్తారు. SAR ను స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేటు అని పిలుస్తారు. ఇది ఫోన్ నుంచి విడుదలయ్యే శక్తి లేదా శరీరం గ్రహించే రేడియేషన్ మొత్తాన్ని సూచిస్తుంది.. మీరు వాడే ఫోన్ లో రేడియేషన్ ను వాట్స్ ఫర్ కిలోగ్రామ్ ఆధారంగా లెక్కించవచ్చు. దాని ప్రకారం SAR విలువను అంచనా వేయవచ్చు.
ఇలా తెలుసుకోవాలి
SAR విలువ ఎక్కువగా ఉంటే ఫోన్ నుంచి రేడియేషన్ అధికంగా ఉన్నట్టు.. తక్కువగా ఉంటే ఫోన్ సురక్షితంగా ఉన్నట్టు భావించాలి. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ అది శరీరంలోకి వెళ్తుంది. అయితే అది మోతాదుకు మించితే శరీరంపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తుంది. పైగా చెవులకు దూరంగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం చాలా మంచిది. ఫోన్ బ్యాటరీ చార్జ్ తక్కువగా ఉంటే రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుందట. మీరు ఉపయోగించే ఫోన్లో SAR ద్వారా రేడియేషన్ తెలుసుకోవాలంటే.. మీ స్మార్ట్ ఫోన్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి.. అందులో *#07# అని టైప్ చేయాలి. ఆ తర్వాత డయల్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత మీ ఫోన్ డిస్ ప్లే SAR రేటింగ్ ను ప్రదర్శిస్తుంది.. సురక్షితమైన SAR 1.6 w/kg ఉండాలి.. ఇంతకంటే ఎక్కువగా ఉంటే ఆ ఫోన్ ప్రమాదమని గుర్తించాలి. అదేవిధంగా *#06# అని టైప్ చేస్తే మీరు ఉపయోగించే ఫోన్ IEMI నెంబర్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
SAR ప్రకారం ఫోన్ రేడియేషన్ ఎక్కువగా ఉంటే అది శరీరంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందట. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ కు కారణమవుతుందట. అందువల్ల ఫోన్ రేడియేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేయడం ఉత్తమమని టెక్ నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు బ్రాండెడ్ కంపెనీ ఫోన్ లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.