https://oktelugu.com/

Devara Trailer: ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై ‘దేవర’ ట్రైలర్ ప్రభావం..భారీగా తగ్గిపోయిన టికెట్ అమ్మకాలు!

సాధారణంగా ట్రైలర్ విడుదలైనప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది. నిన్న సాయంత్రానికి 8 లక్షల 80 వేల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ట్రైలర్ విడుదల తర్వాత అవలీల గా 1 మిలియన్ డాలర్స్ మార్కుని దాటేస్తుందని అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 02:09 PM IST

    Devara

    Follow us on

    Devara Trailer: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. కానీ నిన్న సాయంత్రం ఈ చిత్రం నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఒక సినిమాకి ట్రైలర్ అద్భుతంగా ఉండడం అత్యంత కీలకం. ఎందుకంటే ట్రైలర్ తోనే సగం సినిమా జనాలకు అర్థం అయిపోతుంది. ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటే ఓపెనింగ్స్ కి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమాకి అదే మైనస్ అయ్యింది. గత కొంత కాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతంలో ప్రారంభం అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అదిరిపోయింది. దాదాపుగా 8 లక్షల 50 వేలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ కి మాత్రమే జరిగింది. ఇంత అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చిన ఈ చిత్రం, నిన్న థియేట్రికల్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి బాగా డౌన్ అయిపోయింది.

    సాధారణంగా ట్రైలర్ విడుదలైనప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది. నిన్న సాయంత్రానికి 8 లక్షల 80 వేల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ట్రైలర్ విడుదల తర్వాత అవలీల గా 1 మిలియన్ డాలర్స్ మార్కుని దాటేస్తుందని అనుకున్నారు. కానీ కేవలం 9 లక్షల 60 వేల డాలర్స్ వద్దనే ఆగిపోయింది. ఇది కచ్చితంగా ట్రైలర్ ప్రభావమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రొటీన్ సినిమా అనే ఫీలింగ్ ట్రైలర్ ని చూసినప్పుడు జనాలకు అనిపించడం వల్లే, ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ గణనీయంగా పెరగలేదని ట్రేడ్ విశ్లేషకుల వాదన. ప్రస్తుతానికి ఇప్పటి వరకు నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 1100 షోస్ షెడ్యూల్ అయ్యాయి. పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల మరో వెయ్యి షోస్ అదనంగా ఈ చిత్రానికి వేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ‘ఆయుధ పూజ’ సాంగ్ ఇంకా మిగిలే ఉంది. ఈ సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా ఉంటుందని టాక్. ఈ సాంగ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ లో మరింత ఊపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా త్వరలోనే ఎన్టీఆర్, సందీప్ వంగ ఇంటర్వ్యూ ని విడుదల చేయనుంది టీం. ఈ ఇంటర్వ్యూ తర్వాత హ్రితిక్ రోషన్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా ఒక ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసింది మూవీ టీం. వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం ‘వార్ 2’ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా హిందీ లో కూడా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రప్పించేందుకు మూవీ టీం బలంగా ప్రయత్నాలు చేస్తుంది.