Cleanest Air: ఈ భూమండలంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు అభివృద్ధి పథంలో ఉండగా.. మరికొన్ని దేశాలు దుర్భర దరిద్రంతో బతుకుతున్నాయి. అయితే ఇన్ని దేశాలలో మనుషులు జీవిస్తున్నారు. మనుషులు జీవించడానికి ప్రధానంగా ఆక్సిజన్ కావాలి.
భూమ్మీద ఉన్న ఇన్ని దేశాలలో ఎడారి, సముద్రాలు, ధ్రువ ప్రాంతాలు మినహా.. మిగతా అన్నిచోట్ల మనుషులు జీవిస్తున్నారు. మనుషులు జీవించడానికి స్వచ్ఛమైన గాలి కావాలి. స్వచ్ఛమైన గాలి ప్రపంచం మొత్తం లేదు. అది లేనప్పుడు మనుషులు ఎలా జీవిస్తున్నారు? అనే ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు. మనుషులు జీవించడానికి ఆక్సిజన్ కావాలి.. కాకపోతే ఆ ఆక్సిజన్ లో కూడా కొన్ని స్థాయిలు ఉంటాయి. ఈ భూమండలంలో కేవలం ఐదు దేశాల్లో మాత్రమే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తోంది. మిగతా అన్నిచోట్ల కాలుష్యకారకాలతో నిండి వుంటున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, కెనడా దేశాలలో మాత్రమే స్వచ్ఛమైన గాలి లభిస్తోందట. ఈ దేశాల విస్తీర్ణం అధికంగా ఉంది. ఆ విస్తీర్ణానికి తగ్గట్టుగా జనాభా లేకపోవడంతో గాలిలో కాలుష్యం చాలా వరకు తక్కువగా ఉంటున్నది. ఇక్కడ శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువ. ప్రకృతి.. ప్రశాంతమైన జీవితం.. స్వచ్ఛమైన నీరు ఐస్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, కెనడా దేశాలలో లభిస్తోంది. ఇక్కడ ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. వృక్షాలు కూడా విస్తారంగా ఉంటాయి. అందువల్లే స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
అభివృద్ధి కొలమానం కాదు
ఓ అధ్యయనం ప్రకారం అభివృద్ధి అనేది కొలమానం కాదని.. ఒక మనిషి జీవితకాలం 70 నుంచి 80 సంవత్సరాల వరకు ఉంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉన్నట్టని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో కొన్ని దేశాల మినహా మిగతా అన్ని దేశాలలో సగటు ఆయుర్దాయం 50 నుంచి 55 సంవత్సరాలకు పడిపోయిందని.. కోవిడ్ తర్వాత అది మరింత పతనానికి చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని అంతటికి కారణం గాలిలో కాలుష్యం పెరిగిపోవడమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అభివృద్ధి వల్ల చెట్లను విస్తారంగా నరికి వేయడం.. కాలుష్యకారక పదార్థాలను నేరుగా గాలిలోకి విడుదల చేయడం.. నదీ జలాలను కలుషితం చేయడం వల్ల మనిషి జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఇదే సమయంలో గాలి కూడా కలుషితమవుతోంది. ఫలితంగా ఆక్సిజన్ స్థాయి పడిపోయి.. ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రైట్ ఆక్సైడ్ వంటివి విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి తీవ్రంగా హానిచేస్తాయి. అందువల్లే ప్రపంచం మొత్తం మీద కేవలం ఫిన్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలలో మాత్రమే స్వచ్ఛమైన గాలి లభిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే వృక్షాలను సంరక్షించాల్సిన బాధ్యత.. మొక్కలను నాటాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. లేకపోతే గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతటి దుస్థితి రాకముందే మనుషులు మేలుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి.