Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #RC16 గా పిలవబడుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిన్న గ్యాప్ కూడా లేకుండా శరవేగంగా సాగుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం కావడంతో పెద్దగా గ్రాఫిక్స్ తో పని లేనందున షూటింగ్ కార్యక్రమాలు వాయు వేగంతో ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం లేట్ నైట్ షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఇటీవలే జరిగింది. ఆయన కూడా తదుపరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడట.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఆట గట్టిగా, ఇలా ఎన్నో రకాల ఆటల్లో ఆరితేరిన యువకుడిగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి షూటింగ్ చేసారు. షూటింగ్ సమయంలో ఎవరో తన మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ అగ్రెసివ్ గా క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్న ఈ వీడియో ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ మాత్రం ఫైర్ ఉంటే చాలు, ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు కానీ, ఓటీటీ డీల్ కారణంగా ఈ ఏడాది విడుదల అవ్వడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ వంటి ఓటీటీ సంస్థలు రికార్డు స్థాయి ధర తో ఈ సినిమాని కొనుగోలు చేస్తామని ముందుకొచ్చారు.
కానీ రామ్ చరణ్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కి మాత్రమే ఈ సినిమాని అమ్మాలని మొండిపట్టు పట్టాడట. కారణం నెట్ ఫ్లిక్స్ లో అయితే గ్లోబల్ వైడ్ గా మంచి రీచ్ ఉంటుంది కాబట్టి. కానీ నెట్ ఫ్లిక్స్ కి ఈ సంవత్సరం సరిపడా స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఈ సినిమాని కొనుగోలు చేయాలంటే వచ్చే ఏడాది స్లాట్ లోనే ఈ సినిమాని షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయంలోనే ఆలోచిస్తున్నారట. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఏడాదే ఈ చిత్రం విడుదలైతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ పరాభవం నుండి బయటపడాలంటే ఈ ఏడాది భారీ హిట్ కొట్టాల్సిందే అనే కసితో ఉన్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
#RC16 maa anna movie pic.twitter.com/Mc8TAtK4Et
— ANIL RCF GAME CHANGER (@AnilRcf30605) March 12, 2025